సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 31, 2012

శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి "జానకితో జనాంతికం" ఆడియో



శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి రచన "జానకితో జనాంతికం" ఒక అద్భుతమైన వాక్ చిత్రం. 1975లో ఆయనే సొంతంగా చదవగా విజయవాడ ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఒకసారి దువ్వూరివారు విజయవాడ రేడియోస్టేషన్ కి విచ్చేసిన సందర్భంలో ఏదైనా మాట్లాడవలసిందిగా వెంకటరమణశాస్త్రిగారిని కోరితే, ముందస్తు తయారి లేకపోయినా అప్పటికప్పుడు "జానకితో జనాంతికం" స్క్రిప్ట్ చదివారిట వారు. రికార్డింగ్ సదుపాయాలు సరిగ్గాలేని అప్పటి పాత విజయవాడ ఆకాశవాణి స్టూడియోలో రికార్డింగ్ జరిగిందిట.


అప్పటికే పెద్ద వయసు అయినా, ఇందులో దువ్వూరి వారు తన స్వరంలో కనబరిచిన ఆర్ద్రత, సీతమ్మవారిపై కనబరిచిన గౌరవాభిమానాలు, వాయిస్ మాడ్యులేషన్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక వాక్యాన్ని ఎలా పలకాలి, మైక్ ముందర ఎలా మాట్లాడాలి అని కొత్తగా ఆకాశవాణిలో చేరినవారికి చెప్పటానికి టేపుని వినిపిస్తూ ఉండేవారుట.

రేపటి శ్రీరామనవమి సందర్భంగా దువ్వూరివారి స్వరంలో ఉన్న వాక్ చిత్రాన్ని టపాలో అందించాలని ప్రయత్నం. చాలా పాత రికార్డింగ్ అవటం వల్ల స్పష్టత కాస్త తక్కువైంది.. ! దువ్వూరివారి స్వరంలో ఉన్న పాత రికార్డింగ్ క్రింద లింక్లో వినవచ్చు.

 

పదిహేనేళ్ల క్రితం ఒక శ్రీరామనవమి సందర్భంలో ఆంధ్రప్రభ పత్రిక వారు వాక్ చిత్రాన్ని అక్షరరూపంలో ప్రచురించారు. కాపీ ఇక్కడ చూడవచ్చు.


దువ్వూరి వారి స్వీయ చరిత్ర ( కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర ) గురించి పుస్తకం.నెట్ లో ప్రచురితమైన 'మెహెర్'గారి వ్యాసం ఇక్కడ చూడవచ్చు.


14 comments:

SHANKAR.S said...

అద్భుతమైన కానుక. శ్రమకోర్చి మాకు అందించినందుకు థాంకులో థాంకులు. ప్రఖ్యకి, మీకు, తృష్ణుడుగారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

SRRao said...

తృష్ణ గారూ !
మంచి రచనను వినిపించారు. ధన్యవాదాలు.
మీకు, మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

కొత్తావకాయ said...

దువ్వూరి వారి స్వీయ చరిత్ర, "జానకితో జనాంతికం" చదివి ఎంత సంబరపడ్డానో.. ఇప్పుడీ ఆడియో వింటే అంతకంటే సంతోషంగా ఉందండీ. తృష్ణ గారూ! అపురూపమైన ఈ ఆడియో మాకు అందించినందుకు మీకెన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే! శ్రీరామనవమి శుభాకాంక్షలు!

సామాన్య said...

yentha baagundo !thank you !

Saahitya Abhimaani said...

Well Done Trushna garu.

Same file is available in Ushasri.Org You have only provided them the audio recording. Good job.

Indira said...

డియర్ తృష్ణా ఈమధ్య కొంచెం బిజీగా వుండటంతో సిస్టం దగ్గరికి రావడం లేదు.ఈనవమినాడు మన మిత్రులంతా ఏమి రాశారోనని తీరికచేసుకుని చూస్తే,ఎంత సంతోషం వేసిందో!!!జానకితో జనాంతికం రచన, బాపుగారి బొమ్మా,వాగర్ధావివ సంపృక్తౌ.......... శ్లోకంలో లాగా విడదీయలేనట్టు అనిపించటంలేదూ?

కామేశ్వరరావు said...

ఆడియో మొత్తం విని "అద్భుతమైన అపురూపమైన కానుక" అని కామెంటు పెడదామనుకుంటే, అప్పటికే ఆ మాటలు ఇక్కడ వచ్చేసాయి. ఇక మాటల్లేవు. అనేక కృతజ్ఞతలు. యాదృచ్ఛికంగా ఇందులోని "జానక్యాః..." శ్లోకాన్నే నేనీ రోజు నా బ్లాగు టపాలో కూడా ప్రస్తావించాను!

శ్రీలలిత said...

చాలా గొప్ప ఆడియోని అందించేరు. మనసంతా ఆ జానకమ్మతల్లిని నింపేసారు ఆ మహానుభావులు.
మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు..

నిషిగంధ said...

తృష్ణ గారూ, మీరందించిన ఈ అపురూపమైన కానుకకి అసలు ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువేనండీ.. దువ్వూరిగారి స్వగొంతుకతో జానకితో జనాంతికం వినడం చాలా సంతోషంగా ఉంది.

నిషిగంధ said...

అసలు విషయం మర్చిపోయాను - పుస్తకం పిడిఎఫ్ కాపీని ఇచ్చినందుకు ఇంకా బోల్డు ధన్యవాదాలు :-)

నైమిష్ said...

త్రుష్ణ గారు సాక్షి పేపర్ లో ఈ ఆర్టికల్ చూసి ఎంత బాగా రాసారు ..ఆడియో ఎక్కడదొరుకుతుందో అనుకుంటున్నా..మీరు పెట్టేసారు..ధన్యవాదాలు..

రామ్ said...

మంచి వాక్చిత్రాన్ని పరిచయం చేసారు. చాలా బాగుంది.

ఈ మహానుభావులు అందరూ ఉన్న టైం లో ఈ బ్లాగులూ ఈ టెక్నాలజీ ఉంటే ఎలా ఉండేదో ...!!

A Homemaker's Utopia said...

Thanks for the nice post..Learnt some thing..:-)

తృష్ణ said...

శంకర్ గారూ, chicha.in గారు, ఎస్.ఆర్.రావు గారూ, కొత్తావకాయ గారూ, సామాన్యగారూ, శివరామ ప్రసాద్ గారు, ఇందిర గారూ, భైరవభట్ల కామేశ్వరరావు గారూ, శ్రీలలిత గారూ, నిషిగంధ గారూ, నైమిష్ గారూ, రామ్ గారూ, నాగిని గారూ:

వ్యాఖ్యలు రాసిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ ధన్యవాదాలు అన్నీ మా నాన్నగారికి తెలియజేసాను. ఎందుకంటే అవన్నీ ముఫ్ఫై ఏడేళ్లక్రితం నాటి ఈ రికార్డింగ్ ను పదిలంగా దాచుకుని నాకు అందించిన వారికే చెందుతాయి.