ఎప్పుడెప్పుడా అని ప్రతి ఏడూ ఎదురు చూసే రోజు నిన్న వచ్చింది. ఊళ్ళో హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ మొదలయ్యింది. ప్రతి జనవరి చివరి వారంలో మూడు నాలుగుగురోజులు నగరంలో జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పూలమొక్కలు, కాయగూరలు, రకరకాల చెట్లూ, బోన్సాయ్ మొక్కలూ, ఎరువులూ, మొక్కల కుండీలు, వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు మొదలైనవి ప్రదర్శనకూ, అమ్మకానికి పెడతారు. ఎప్పుడు మొదలుపెట్టారో తెలీదు కానీ నేను మొదటిసారి తొమ్మిది,పదేళ్ల క్రితం అనుకుంటా Hitex Exhibition Centre లో ఈ హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ చూసాను. అప్పుడు కేవలం మొక్కలు మాత్రమే ప్రదర్శనకూ, అమ్మకానికి ఉండేవి.
పువ్వులు..పువ్వులు..పువ్వులు...
రంగురంగుల పువ్వులు.. గులాబీలు..చామంతులు...మందారాలు...
రకరకాల ఆకులు... చుట్టూరా పచ్చదనం...
రకరకాల cactus లు, crotons, రంగురంగుల orchids..మత్తెక్కించే లిల్లీ పూలూ...
ఇంకా...గుబులంతా పోగొట్టి కబుర్లాడేవి..
నవ్వులు పూయించేవీ.. ఆహా అనిపించేవీ...
మైమరపించే పువ్వులు...అన్నీ చూసి మైమరచిపోయాను..!!
ఇప్పుడు మూడేళ్ళనుంచీ మిస్సవకుండా ఈ ప్రదర్శనకు వెళ్తున్నాను. ప్రదర్శన లోనూ చాలా మార్పులు వచ్చేసాయి. తినుబండారాల స్టాల్, ఓ పుస్తకాల స్టాల్, ఓ ఐస్క్రీం స్టాల్.. ఇలా కొత్త కొత్తవి ఇందులో కలిసాయి. ఇంకా నయం natural flower colours తో డిజైన్ చేసిన బట్టలు అంటూ ఓ బట్టల కొట్టు కూడా పెట్టారు కాదు అనుకున్నా..! ఈసారి ప్రదర్శన కన్నా నిరుడు ఇంకాస్త బావుంది అనిపించింది. "ఫ్లవర్ ఎరేంజ్మెంట్" కి ప్రత్యేకం ఓ స్టాల్ ఉండేది. ఈసారి ఉండి కానీ చాలా చిన్నది. నాలుగైదు రకాలకన్నా ఎక్కువ లేవు. పైగా అన్నీ రొటీన్ గా ఉన్నాయి. ఏదేమైనా చుట్టూరా రకరకాల పువ్వులు, పచ్చదనం కాస్తంత ఉన్నా మనసుకు ఆహ్లాదం, చికాకుల్లోంచి కాస్తంత మైమరుపు పుష్కలంగా దొరుకుతాయి. అలా చూసుకుంటే ఈసారి కూడా ఆ ఆనందం నాకు దక్కింది.
ఈసారి బోన్సాయి విభాగంలో అందరి దృష్టినీ ఆకర్షించింది ఈ బుజ్జి చింత చెట్టు
క్రితం ఏడాది ఇలాంటి ఆర్టిఫీషియల్ పువ్వుల ఫోటోలు ఇక్కడ పెట్టాను.
కూరగాయమొక్కలు పెంచే రకరకాల విధానాలు కూడా చూపెట్టారు ఇలా:
ప్రదర్శనలొ నాకు అస్సలు నచ్చనిది ఈ పూల మొక్కలను మోసే కూలీలు. ఆడవాళ్ళు కూడా బుట్ట కావాలా అని తిరుగుతు ఉంటారు పాపం. జనాలు శుబ్భరంగా మొక్కలు కొనేసుకుని ప్రదర్శన అంతా ఇలా వెనక్కాల తలలపై మొక్కలు మోసే కూలీలతొ తిరగటం నాకెందుకో నచ్చదు...పాపం అనిపిస్తుంది.
ఈసారి ఎక్కువ కూరగాయల మొక్కలకు ఫోటోలు తీశాను. రకరకాల కూరగాయమొక్కలను ఇంట్లో ఎలా పెంచుకోవచ్చునో చూపిస్తూ పెట్టిన స్టాల్స్ చాలా బాగున్నాయి.
అన్నింటికన్నా నచ్చిన మొక్క ఇది. క్రితం సారి ప్రదర్శనలోఇదే పేద్ద చెట్టు పెట్టారు .
ఈ Expo లో జనాలను ఆకర్షిస్తున్న మరొక స్టాల్ "అరోవా" అనే హెర్బల్ టీ స్టాల్. ఈ హెర్బల్ టీ బాలాజీ ఆయుర్వేదిక్ ఫార్మసీ వాళ్లదిట. పాలు,పంచదార ,కెఫిన్,టీ ఆకులు లేకుండా కేవలం సొంఠి, మిరియాలు, పిప్పలి, జీరక, ధనియాలు,లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, వాము, కుంకుమపువ్వు మొదలైనవాటితో ఈ హెర్బల్ టీ తయారు చేసారుట. నిమ్మరసం, తేనె కలిపి వేడి వేడిగా స్టాల్ వాళ్లు ఇచ్చిన ఈ టీ(Rs.5/-) నాక్కుడా బాగా నచ్చింది.
ఇంతకీ ఏమీ కొననేలేదు నిన్న. మళ్ళీ వెళ్ళాలి కొనటానికి...!!
క్రితం ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ ఫోటోలు:
25 comments:
wow...సుపర్ గా ఉన్నాయండీ.
నాకు ఆ కూరగాయల పిక్స్ బాగా నచ్చాయ్..
"ఈసారి ఎక్కువ కూరగాయల మొక్కలకు ఫోటోలు తీశాను. వీటిని చూస్తే నాకు కాకినాడలో చిన్నప్పుడు చూసిన "ఫలపుష్పప్రదర్శనే" గుర్తుకు వస్తుంది."
కెవ్వ్వ్వ్వ్ "కాకినాడ" :)
ఫోటోలు కెవ్వుకేక.మొదటి ఫోటో అయితే కె.రాఘవేంద్రరావు గుర్తొచ్చాడు.:).ఆ బోన్సాయ్ చింత చెట్టు భలే ఉందండీ.
"చుట్టూరా రకరకాల పువ్వులు, పచ్చదనం కాస్తంత ఉన్నా మనసుకు ఆహ్లాదం, చికాకుల్లోంచి కాస్తంత మైమరుపు పుష్కలంగా దొరుకుతాయి."
ఇది నిజం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని మొక్కలు ఒకే చోట చూసే సరికి మీరు ఎంత సంబరపడతారో ఊహించగలను.
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కాకినాడ(నేను ప్రస్తుతం కాకినాడలోనే ఉన్నా వింటున్నావా శంకరో)లో కూడ అవుతోందండీ ఈ ప్రదర్శన.నాకు ఎప్పట్నించో ఒక మామిడి మొక్క(బోన్సాయ్)ఇంట్లో పెచుకోవాలని కోరిక,మరి పెద్దగ ఎండ రాదాయె,వెలుతురు వస్తుంది కాని మరి అది బ్రతుకుతుందో లేదో తెలియక ఊరుకున్నా.ఈ సారి మీరు వెళ్ళినప్పూడు ఓ సారి కనుక్కుంటారా ఖరీదు ఎంతో ఎలాంటి పరిసరాల్లో పెరుగుతుందో.దాన్ని బట్టి కొనాలో వద్దో నిర్ణయించుకోవచ్చు కదా.
అసలు విషయం మొక్కల ఫొటోలు సూపర్ గా ఉన్నాయి మొక్కలంత అందంగా
బాగున్నాయండీ మొక్కల కబుర్లూ, ఫోటోలూ.. :)
చింతచెట్టు భలే బాగుంది. :)
మొన్న జూబ్లీ హిల్స్ లో హోర్డింగ్ చూసి మీ గురించే అనుకున్నా! అప్పుడే వెళ్ళారా? ఏం కొంటారేమిటి ఈ సారి? బ్రహ్మ కమలం మొక్క నేనిస్తాను, కొనకండి!
ఆ చింత చెట్టు కొనండి! బుజ్జి ముండ ఎన్ని కాయలు కాస్తోందో!
చాలా బాగున్నాయి తృష్ణ గారు..
కూరగాయల పిక్స్ సూపర్.. :) ఆ కూరగాయలు ఆధునిక పద్దతిలో పండించినవా లేక సేంద్రీయ పద్దతిలో పండిచినవా? అక్కదేమైనా వివరణ పెట్టారా వీటి గురించి?
అన్నీ బాగున్నాయి కానీ చిన్న సవరణ క్రిందనుంచి రెండవ చిత్రం జొన్నలు కాదు అవి సజ్జ కంకులు సవరించండి.
విజయమోహన్ గారూ, సరిచేసాను.ధన్యవాదాలు. ఈ కూరగాయల ఫోటోలు చూస్తుంటే మీరు గుర్తుకు వచ్చారు.
త్రుష్ణ గారూ మొక్కల ఫోటోలు బావున్నాయండీ. ఇండియాలో అన్ని రకాల కాప్సికంస్ దొరుకుతాయని తెలియదు. సజ్జకంకులు చూసి చాలా రోజులయింది. ఫోటోల్లోనే ఇంత బావున్నాయి. ఎదురుగా ఇంకెంత బావుండి ఉంటాయో కదా...
చాలా చాలా బాగున్నాయి తృష్ణ :) మీరు అన్నిటికన్నా నచ్చిన మొక్క అని పెట్టారు ఫోటో,అది ఏం మొక్క?
నా ఫేవరేట్ మాత్రం బోన్సాయ్ చింత చెట్టే :))
కాకినడ వొదిలేశాకా మళ్ళీ చూడలేకపోయా! కొరత తీర్చేరు. ధన్యవాదాలు.
తృష్ణగారు, మళ్ళీ మిమ్మల్ని మిస్ అయ్యాం.రాత్రి నేను మా పిల్లలు వుద్యానవన ప్రదర్శన కి వచ్చాం.ఔత్సాహిక ఫొటోగ్రాఫరైన మా చిన్నమ్మాయి యేవి క్లిక్ చేసిందో సరిగ్గా అవే మీ టపా లో ప్రత్యక్షమయ్యాయి.అవి ఎవరినైనా ఆకర్షించేవే అనుకోండి!!మీ గురించి వాళ్ళకి చెపుతుంటాను.మీ టపా చూసేటప్పటికి ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగింది.
ఫొటోస్ చాలా బాగున్నాయండి.
బాగా రాసారండి. ఫాలో అవుతాను.
తృష్ణ గారూ.. నాకు చాలా కుళ్లుగా ఉంది:(
అద్భుతంగా ఉన్నాయి అన్ని మొక్కలూనూ.. ఆ బుజ్జి చింత చెట్టైతే మరీనూ:)
@raj,
@shankar,
@srinivas pappu,
@madhuravani,
@sujata,
Thank you very much for the visit & comments.
@harsha,ఆ కూరలన్నీ ఎలా పండించారో అక్కడ ఆయా స్టాల్స్ లో ఉన్నవాళ్ళు వివరణ ఇస్తారు.
thank you.
@jyotirmayi,ఇండియాలో అన్నిచోట్లా ఇన్ని రకాల కాప్సికం దొరకవండీ. కొన్నిచోట్లే..ఇది ఎగ్జిబిషన్ కాబట్టి ఇన్ని పెట్టి ఉంటారు.
ధన్యవాదాలు.
@chilamakuru vijayamohan,
@mahek,
@kashtepahle,
@indira,
@lasya ramakrishna,
Thank you very much for the visit & comments.
తృష్ణ గారు ఈ సంవత్సరం ఎప్పుడు జరుగుతుందండి??
ఎక్కడా ఏ info దొరకడంలేదు..ఇక మీరే శరణు..:))జరిగినప్పుడు చెప్పడానికి..:)
@dhaatri: waiting for the news dhatri gaaru..! Every year between jan 20-30 అన్నది ఖచ్చితం. తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను..థాంక్యూ :)
ధన్యవాదాలు తృష్ణ గారు.will be waiting for update..:))
@dhaatri: కనుక్కున్నానండి..
హార్టికల్చర్ ఎగ్జిబిషన్ ఈ నెల26th నుండి 5 రోజులు పీపుల్స్ ప్లాజా లో(నెక్లెస్ రోడ్) జరుగుతుందిట. నేను సంవత్సరమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాను దీని కోసం..:))
హాయ్..ఎగిరి గంతేసాను మీ వ్యాఖ్య చూసి..ఈ శనివారమే..:D
Soo sweet of you.
బోలెడన్ని థాంక్యూలు..:)
అన్నట్లు సమయమండీ?? ఉదయం పదిగంటలు దాటాక ఎప్పుడైనా ఫర్వాలేదా??
@dhaatri:మొదటిరోజు పువ్వులు, మొక్కలు తాజాగా ఉంటాయి. తెరిచిన వెంఠనే కన్నా సాయంత్రానికి అన్నీ పెడతారు. వీలైతే సాయంత్రానికి వెళ్లండి.happy visit :)
Post a Comment