అలనాటి రేడియో నాటకాలకు ప్రాణమైన సుతిమెత్తని స్వరం ఆమెది. నాటకంలో ఆవిడ పాత్ర ఉన్నదంటే చెవులు రిక్కించుకుని నాటకం వినేవారు ఆమె ఆభిమానులు. నాటకం సాంఘికమైనా, పౌరాణికమైనా అందులోని పాత్ర కు అనుగుణంగా తన స్వరాన్ని మలుచుకోగల నిష్ణాతురాలు శారదా శ్రీనివాసన్ గారు. తనకు రేడియోతో గల అనుబంధాన్ని, ఎందరో ప్రముఖులతో పరిచయాలనూ, స్నేహాలనూ ఒక జ్ఞాపకాల మాలగా చేసి, ఇటీవల ఆరునెలల క్రితం శారదా శ్రీనివాసన్ గారు "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకం రచించారు. ఈ పుస్తకం ఎంతోమంది రేడియో అభిమానుల ప్రశంసలను అందుకుంది.
పలువురు బ్లాగ్మిత్రులు కూడా ఈ పుస్తక పరిచయాన్ని మనకందించారు. క్రింద ఉన్న linksలో ఆయా టపాలను చూడవచ్చు:
http://manishi-manasulomaata.blogspot.com/2011/07/blog-post.html
http://nemalikannu.blogspot.com/2011/09/blog-post_08.html
pustakam.net/?p=8205
pustakam.net/?p=8205
'సుధామధురం' బ్లాగర్, ప్రసిధ్ధ కవి, రచయిత, రిటైర్డ్ రేడియో కళాకారులు శ్రీ సుధామ గారు తమ టపాలో ఈ పుస్తక పరిచయానికి, శారదా శ్రీనివాసన్ గారిని గూర్చిన మరిన్ని మంచి కబుర్లను కూడా జతచేసారు.
sudhamadhuram.blogspot.com/2011/09/blog-post_11.html
ఇప్పుడు సరికొత్త విషయం ఏమిటంటే పలువురు మిత్రుల, అభిమానుల కోరికపై "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకం ఇప్పుడు సీడీ రూపంలో మన ముందుకు వచ్చింది. తన అనుభవాలను ఆవిడ స్వరంలోనే వినాలని, ముఖ్యంగా దూరదేశాలలో ఉన్న రేడియో అభిమానులు డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వినేలాగ కావాలని పట్టుబట్టడంతో ఈ సీడీ రూపకల్పన త్వరత్వరగా జరిగింది. ఈ సీడీ మొన్న జరిగిన పుస్తక ప్రదర్శనలో SR communications ద్వారా వెలువడిందని తాజా వార్త. ఈ సంగతి శారదత్త(మా ఇంట్లో అందరం ఆవిడను అభిమానంగా అలా పిలుస్తాము) స్వయంగా ఫోన్ చేసి బ్లాగులో రాయమని చెప్పారు. నేను కూడా సీడి వినాల్సి ఉంది.
శారదా శ్రీనివాసన్ గారి మరో సీడీ వివరలు:
శారద గారి "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖుల్లో ఒకరు ప్రముఖ రచయిత "డా. పోరంకి దక్షిణామూర్తి" గారు. వారు రచించిన "ముత్యాల పందిరి" అనే నవలను పూర్తిగా శారదత్త స్వరం లో ఈ రెండవ సీడీలో వినవచ్చుట. ఈ నవల మొత్తం తెలంగాణా మాండలికంలో ఉంటుందిట. అయితే, ఈ సీడీ ఇంకా తయారీలో ఉందని సమాచారం.
13 comments:
Wow! Thanks for sharing the news!
చాలా మంచి వార్త చెప్పారు. థాంక్యూ వెరీ మచ్!
కొనేస్తా కొనేస్తా!వినేస్తా వినేస్తా!
చాల సంతోషమండి! నిజం గ
ఆవిడ గొంతు వింటూ వుంటే ఆ పాత్ర మన దగ్గర వుండి మాట్లాడుతున్నట్లు వుండేది. మిగతావన్నీ ఒక ఎత్తు అయేతే యుద్దనపూడి గారి ఆరాధన నవలలో మూగ పాత్ర(అన్నపూర్ణ) మనసులోనిభావాలని చాల అద్భుతం గ ఆవిష్కరించారు శారదశ్రీనివాసన్ గారు.
మీరు మీ బ్లాగ్ద్వార ఈ విశేషాలనిమాతోటి పంచుకున్నందకు మీకు
కూడా
ధన్యవాదాలు త్రుష్ణగారు
వా:(((( నేనొప్పుకోను కొనక కొనక మొన్నటి బుక్ ఫెస్టివల్ లో ఈ పుస్తకం కొంటే అదే పుస్తక ప్రదర్శనలో ఈ ఆడియో బుక్ రిలీజ్ అవడం నేను ఒప్పుకోనంతే.
నవోదయాలో దొరికితే ఈ సారి దండయాత్రలో ఆడియో బుక్ సైతం చేజిక్కించుకోవలె.
తెలుగులో కూడా ఆడియో బుక్స్ వస్తున్నందుకు అంతో సంతోషంగా ఉన్నది.
తెలియచేసిన మీకు ధన్యవాదాలు. కొద్దిరోజుల్లో విజయవాడ వెళ్ళబోతున్నాను, అక్కడి పుస్తక ప్రదర్సన కోసం వాయిదా వేసుకు మరీ వెళ్తున్నాను. అక్కడ కొనాలి ఈ సి డి వీలయితే ఆ పుస్తకం కూడా.
@s: thank you too.
@sujata: the CD will be out in all music stores from next week.sujata gaaru.
@virisina aravindam: It's a pleasure talking about great artists like sarada srinivasan..!
thank you too for the visit.
@shankar.s:the book & the audio...both are valuable !
u can get this audio in other music stores too.
thank you.
@siva ramprasad kappagantu:u will surely find the CD in VJA book fair.
Thank you.
తృష్ణగారు, మీకు మీ కుటుంబానికి,నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Trishna, I wish you a very happy new year.
jayagaaru & indira gaaru, thank you very much for the wishes.. wish you the same.
తృష్ణ గారూ మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు. ఇంకేమైనా తెలుగు audio books దొరుతాయాండీ..
@జ్యొతిర్మయి: 'కోతికొమ్మచ్చి" ఒక్కటే నాకు తెలుసండి. ఇంకేమన్నా ఉన్నాయేమో తెలీదు నాకు..
ధన్యవాదాలు.
Post a Comment