సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 29, 2011

కొత్త మొక్కల్.. కొత్త మొక్కల్...

సంచీలో...కొత్తగా కొన్న మొక్కలు


చలికాలంలో పూసే చామంతులు ఎన్ని రంగులు ఉన్నా మళ్ళీ కొత్త మొక్కలు కొందామనిపిస్తుంది. పెద్ద చామంతులు ఐదారు రంగులున్నాయి కదా అని ఈసారి చిట్టి చామంతులు కొన్నా. కుండీ నిండుగా బాగా పూస్తాయి ఇవి.


తెల్లటి ఈ స్వచ్ఛమైన గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా? ఒకే చెట్టుకి ఎన్ని మొగ్గలేసాయో...


ఎన్నో రోజుల నుంచీ చెంబేలీ తీగ కొనాలని. కుండీలో బాగా పెరగదేమో అని ఆలోచన. మొత్తానికి ఈసారి కొనేసా. మొగ్గ పింక్ కలర్లో ఉండి పువ్వు పూసాకా తెల్లగా ఉంటుంది. చాలా మత్తైన సువాసన ఈ పువ్వుది. చాలా ఇళ్ళలో గేటు పక్కగా గోడ మీదుగా డాబాపైకి పాకించి ఉంటుందీ తీగ.



క్రింది ఫొటోలోని గులాబీ రంగు గులాబి పువ్వు చెట్టు విజయవాడలో మా క్వార్టర్ గుమ్మంలో ఉండేది. చాలా పేద్ద చెట్టు. రోజుకు ఇరవైకి మించి పూసేది. ఎన్ని కొమ్మలు ఎందరికి ఇచ్చామో...అందరి ఇళ్ళలో ఈ మొక్క బతికింది. నర్సరిలో కనిపించగానే వెంఠనే కొనేసా.



ఇక ముద్దబంతి పువ్వులు అలా పేద్దగా పూసేసరికీ కొనకుండా ఉండగలనా? ఇంతకు ముందు కుండీలో వేసిన బంతునారు బాగానే పెరిగాయి. కొన్ని రేకపూలు పూస్తున్నాయి. కొన్ని ఇంకా మొగ్గలే రాలా..:(( అందుకని ఈ ముద్దబంతి కొనేసా...:))



13 comments:

మధురవాణి said...

చాలా బాగున్నాయి మీ కొత్త పూల మొక్కలు.. :)

Praveen Mandangi said...

మీరు మొక్కలకి ఫొటోగ్రాఫర్ అవ్వొచ్చు కదా. ఈ రోజు ఉదయం ఆముదాలవలస & కనుగులవలసల దగ్గర మొక్కలకి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేశాను. https://plus.google.com/111113261980146074416
అంటే ఇంటిలో కాకుండా బయట మొక్కలకి ఫొటోలు తియ్యడం.

లత said...

భలే ఉన్నాయండి మొక్కలూ,పూలు.చిట్టిచేమంతులు చిన్నప్పుడు మా ఇంట్లో ఎంత బాగా పూసేవో

వేణూశ్రీకాంత్ said...

Nice...

మనసు పలికే said...

చాలా చాలా చాలా బాగున్నాయి మీ మొక్కలు.. పువ్వులు.. తృష్ణ గారూ:)

swathi said...

nice flowers

రాజ్ కుమార్ said...

వావ్.. .భలే ఉన్నాయండీ..
మా ఇంట్లో కూడా ఇలాగే పెంచుతారు మా వాళ్ళు.. ఇల్లు గుర్తొస్తుందీ ఇవి చూస్స్తుంటే ;(

నేనెప్పుడు బంతి పూల మొక్కలేసినా అవి పోతుబంతులే అయ్యేవి.. ;( వేసే చేతిని బట్టి కూడా ఉంటాయంట..
బంతి పూలు నాకు బాగా నచ్చాయండీ..

SHANKAR.S said...

తృష్ణ గారూ ఎన్నాళ్లకెన్నాళ్లకు మొక్కల మీద టపా!!!! బాగు బాగు.
అన్నట్టు మొక్కలు ప్లాస్టిక్ / సిమెంట్ కుండీలలో కంటే మట్టి కుండీలలో / కింద మామూలు మట్టిలో పెంచితే బాగా పెరుగుతాయని ఎక్కడో చదివాను. అది ఎంతవరకూ నిజం?

జ్యోతిర్మయి said...

తృష్ణ గారూ భలే ఉన్నాయ్ మీ మొక్కలూ..పువ్వులూ..

Praveen Mandangi said...

ఈ పూలు చూడండి: http://videos.teluguwebmedia.in/meda-meeda-teegala-pail-vikasimchina-poolu

తృష్ణ said...

@మధుర: థాంక్యూ..

@ప్రవీణ్ శర్మ: చూశానండి బాగున్నాయి.
ధన్యవాదాలు.

@లత: చెట్టు నిండా పూసే ఈ పూలు చాలా ముద్దుగా ఉంటాయండి.
ధన్యవాదాలు.

@వేణూశ్రీకాంత్: ధన్యవాదాలు.

తృష్ణ said...

@మనసుపలిక, @స్వాతి: ధన్యవాదాలు.

@రాజ్ కుమార్: ఎప్పుడూ అలా కావండి నాకు. బంతినారు అమ్మిన అమ్మాయి అబధ్ధం చెప్పినట్లుంది.
బంతి పూలలో తెలుగుతనం ఉట్టిపడుతుంది అనిపిస్తుంది రాజ్ నాకు..
ధన్యవాదాలు.

@శంకర్: నూరుశాతం నిజం !
ధన్యవాదాలు.

తృష్ణ said...

@జ్యోతిర్మయి: ధన్యవాదాలు.
@ప్రవీణ్ శర్మ: చూశానండి.బావున్నాయి.
ధన్యవాదాలు.