అమ్మ ఫోన్ చేసింది నిన్న సాయంత్రం, "రేపు నాన్నను డిస్చార్జ్ చేస్తాం అన్నారు డాక్టర్..."
ఐదు రోజుల్నుంచీ నిద్రాహారాల్లేక ICU బయట కుర్చీల్లో కూర్చుని కూర్చునీ అమ్మ, అన్నయ్య, తమ్ముడూ...
ఇంట్లో ఉన్నా, ఏమైతుందో...ఏమౌతుందో అని బిక్కు బిక్కుమంటూ గడిపిన నాకూ ప్రాణాలు కుదుట పడ్డాయి...!
ఇవాళ నాన్న ఇంటికి వస్తారు.
*** **** ***
సృష్టిలో ఏ జీవితమూ శాశ్వతం కాదు అన్నది జగమెరిగిన సత్యమే. కానీ కొన్నిసార్లు మనకు తెలిసిన సత్యాల్ని మనం విస్మరిస్తాము. నమ్మటానికి మనసు ఒప్పదు. నాన్న గురించి కూడా అంతే...
ఏమొచ్చినా నాకు నాన్న ఉన్నారు...అన్న ధైర్యం ఐదు రోజుల క్రితం వరకూ...
కొండంత అండ, నాకు "నీడ" నాన్న...
నాన్న లేని జీవితం ఒకటి ఉంటుందన్న ఊహే లేదు ఇంతదాకా......
కానీ, ఐదు రోజుల క్రితం హఠాత్తుగా జరిగిన సంఘటన ఈ కఠోర సత్యాన్ని ఒప్పుకొమ్మని బలవంతపెట్టింది...
ఇకపై అలాంటి జీవితాన్ని ఎదురుకోవటానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉండాలని...
*** *** ****
nanna while in duty |
అమ్మ ఫోన్ చేసింది నిన్న సాయంత్రం, "రేపు నాన్నను డిస్చార్జ్ చేస్తాం అన్నారు డాక్టర్..."
ఐదు రోజుల్నుంచీ నిద్రాహారాల్లేక ICU బయట కుర్చీల్లో కూర్చుని కూర్చునీ అమ్మ, అన్నయ్య, తమ్ముడూ...
ఇంట్లో ఉన్నా, ఏమైతుందో...ఏమౌతుందో అని బిక్కు బిక్కుమంటూ గడిపిన నాకూ ప్రాణాలు కుదుట పడ్డాయి...!
ఇవాళ నాన్న ఇంటికి వస్తారు.
*** **** ***
సృష్టిలో ఏ జీవితమూ శాశ్వతం కాదు అన్నది జగమెరిగిన సత్యమే. కానీ కొన్నిసార్లు మనకు తెలిసిన సత్యాల్ని మనం విస్మరిస్తాము. నమ్మటానికి మనసు ఒప్పదు. నాన్న గురించి కూడా అంతే...
ఏమొచ్చినా నాకు నాన్న ఉన్నారు...అన్న ధైర్యం ఐదు రోజుల క్రితం వరకూ...
కొండంత అండ, నాకు "నీడ" నాన్న...
నాన్న లేని జీవితం ఒకటి ఉంటుందన్న ఊహే లేదు ఇంతదాకా......
కానీ, ఐదు రోజుల క్రితం హఠాత్తుగా జరిగిన సంఘటన ఈ కఠోర సత్యాన్ని ఒప్పుకొమ్మని బలవంతపెట్టింది...
ఇకపై అలాంటి జీవితాన్ని ఎదురుకోవటానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉండాలని...
*** *** ****
నాకే కాదు చాలా మంది కూతుళ్ళకు వాళ్ళ వాళ్ళ నాన్నలు అద్భుతాలే..
ఆ చాలా మందిలో నేనొకరిని...
"నాన్న" నాకేమిటో చెప్పేదెలా...
నాన్న కళ్ళతో నేను ప్రపంచాన్ని చూసాను
నా ప్రతి ఆలోచననూ, కదలికనూ బాగా అర్ధంచేసుకోగలిగింది నాన్న ఒక్కరే.
నేను మారు మాట్లాడకుండానే ఏమనుకుంటున్నానో చెప్పగలిగిన వ్యక్తి...
ప్రతి చిన్న విషయాన్నీ నేను పంచుకునే మొదటి వ్యక్తి నాన్న..
*** *** ***
"ఈ రంగు నీకు బాగుంటుంది. ఈ డ్రెస్ కొనుక్కో" అన్నప్పుడూ,
" ఈ చెప్పులు బావున్నాయి తీసుకో" అని చెప్పినప్పుడూ,
రకరకాల విషయాల గురించి గంటలు గంటలు చర్చించుకునేప్పుడూ,
ఏది కావాలన్నా నేను అడిగినప్పుడు,
"నువ్వు అడిగిందల్లా నేను కొనను. రేపు పెళ్లయ్యాకా ఏదన్నా కొనుక్కోలేకపోతే బాధపడతావు.." అన్నప్పుడు,
"పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైనది...నువ్వు ఆడపిల్లవని కాదు...ప్రతి వ్యక్తికీ జీవితంలో ఒక తోడు కావాలి..." అని పెళ్ళి అనేది ఎంత ముఖ్యమో ఆ రోజు రాత్రి డాబా మీద నాకు చెపినప్పుడూ,
"ఈ అబ్బాయి మంచివాడు. పెళ్ళిచేసుకో..." అని దగ్గర కూచుని మాట్లాడినప్పుడూ...
నాకు నాన్న ఓ స్నేహితుడు. ఒక శ్రేయోభిలాషి.
*** *** ****
ఆ చాలా మందిలో నేనొకరిని...
"నాన్న" నాకేమిటో చెప్పేదెలా...
నాన్న కళ్ళతో నేను ప్రపంచాన్ని చూసాను
నా ప్రతి ఆలోచననూ, కదలికనూ బాగా అర్ధంచేసుకోగలిగింది నాన్న ఒక్కరే.
నేను మారు మాట్లాడకుండానే ఏమనుకుంటున్నానో చెప్పగలిగిన వ్యక్తి...
ప్రతి చిన్న విషయాన్నీ నేను పంచుకునే మొదటి వ్యక్తి నాన్న..
*** *** ***
"ఈ రంగు నీకు బాగుంటుంది. ఈ డ్రెస్ కొనుక్కో" అన్నప్పుడూ,
" ఈ చెప్పులు బావున్నాయి తీసుకో" అని చెప్పినప్పుడూ,
రకరకాల విషయాల గురించి గంటలు గంటలు చర్చించుకునేప్పుడూ,
ఏది కావాలన్నా నేను అడిగినప్పుడు,
"నువ్వు అడిగిందల్లా నేను కొనను. రేపు పెళ్లయ్యాకా ఏదన్నా కొనుక్కోలేకపోతే బాధపడతావు.." అన్నప్పుడు,
"పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైనది...నువ్వు ఆడపిల్లవని కాదు...ప్రతి వ్యక్తికీ జీవితంలో ఒక తోడు కావాలి..." అని పెళ్ళి అనేది ఎంత ముఖ్యమో ఆ రోజు రాత్రి డాబా మీద నాకు చెపినప్పుడూ,
"ఈ అబ్బాయి మంచివాడు. పెళ్ళిచేసుకో..." అని దగ్గర కూచుని మాట్లాడినప్పుడూ...
నాకు నాన్న ఓ స్నేహితుడు. ఒక శ్రేయోభిలాషి.
*** *** ****
"నెమ్మదిగా అబధ్ధం చెప్పినా వింటారు. కానీ అరిచి నిజం చెప్పినా ఎవరూ నమ్మరు"
"సమస్య వచ్చినప్పుడు ఎప్పుడూ ముందు ఎదుటి వ్యక్తి దృష్టిలోంచి ఆలోచించాలి.."
"తుఫాను వచ్చినప్పుడు తల వంచుకుంటే పై నుంచి వెళ్పోతుంది. అలా కాదని తల ఎత్తుకు నిలబడితే నువ్వూ కొట్టుకు పోతావు.."
"ఇవాళ బాలేకపోయినా, రేపు బాగుంటుంది.. అనే ఆశతో ఎప్పుడూ ఉండాలి.."
"ఒకోసారి మన తప్పు లేకపోయినా తల వంచుకోవటం వల్ల సమస్యలు పరిష్కారమౌతాయి..."
అంటూ జీవిత సత్యాలు చెప్పినప్పుడు నాన్న నాకు ఒక మార్గ దర్శకుడు.
*** *** ***
నాన్న గురించి బ్లాగ్‌లో చాలా సార్లు రాయాలని అన్పించినా రాయలేకపోయను..
ఎందుకంటే రాయటానికి ఒకటి రెండు టపాలు చాలని అద్భుతం నాన్న.
నడిచే ఎన్సైక్లోపీడియా నాన్న..
ఒక నిరంతర అన్వేషి నాన్న...
ఒక స్వాప్నికుడు
కళాకారుడు
ఆశావాది.
ఎంత చెప్పినా తనివి తీరదు...ఎంత రాసినా ఇంకా చెప్పవలసింది మిగిలిపోతూనే ఉందనిపిస్తుంది...
నాన్న కూతురుగా పుట్టడం నా అదృష్టం...అంతే..!!
** *** ***
నాన్న గురించి ఇప్పటికైనా కొంతైనా రాయాలని ...
రేడియో కూడా లేని ఒక మారుమూల పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్లాడి జీవన పయనం
"రాముడు" నుంచీ "రామం" దాకా నాన్న పయనం...రాయలనుకున్నా...
కానీ బ్లాగ్ పై సన్నగిల్లిన ఆసక్తి, రాసినా ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత రాయనివ్వటం లేదు..
*** *** ***
నిన్న కాస్త లేచి కూచోగానే ఏమీ తోచటం లేదని, ఓ పుస్తకం పెన్నూ తెప్పించుకుని హాస్పటల్ బెడ్ మీద బొమ్మలు వేస్తూ కూచున్నారుట.(నాన్న స్కెచెస్, పైంటింగ్స్ బాగా వేస్తారు.)
ఇంకొన్నేళ్ళు నాన్న ఆరోగ్యంగా మా మధ్యన తిరగాలని కోరిక. ప్రార్ధన.
*** **** ****
"సమస్య వచ్చినప్పుడు ఎప్పుడూ ముందు ఎదుటి వ్యక్తి దృష్టిలోంచి ఆలోచించాలి.."
"తుఫాను వచ్చినప్పుడు తల వంచుకుంటే పై నుంచి వెళ్పోతుంది. అలా కాదని తల ఎత్తుకు నిలబడితే నువ్వూ కొట్టుకు పోతావు.."
"ఇవాళ బాలేకపోయినా, రేపు బాగుంటుంది.. అనే ఆశతో ఎప్పుడూ ఉండాలి.."
"ఒకోసారి మన తప్పు లేకపోయినా తల వంచుకోవటం వల్ల సమస్యలు పరిష్కారమౌతాయి..."
అంటూ జీవిత సత్యాలు చెప్పినప్పుడు నాన్న నాకు ఒక మార్గ దర్శకుడు.
*** *** ***
నాన్న గురించి బ్లాగ్‌లో చాలా సార్లు రాయాలని అన్పించినా రాయలేకపోయను..
ఎందుకంటే రాయటానికి ఒకటి రెండు టపాలు చాలని అద్భుతం నాన్న.
నడిచే ఎన్సైక్లోపీడియా నాన్న..
ఒక నిరంతర అన్వేషి నాన్న...
ఒక స్వాప్నికుడు
కళాకారుడు
ఆశావాది.
ఎంత చెప్పినా తనివి తీరదు...ఎంత రాసినా ఇంకా చెప్పవలసింది మిగిలిపోతూనే ఉందనిపిస్తుంది...
నాన్న కూతురుగా పుట్టడం నా అదృష్టం...అంతే..!!
** *** ***
నాన్న గురించి ఇప్పటికైనా కొంతైనా రాయాలని ...
రేడియో కూడా లేని ఒక మారుమూల పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్లాడి జీవన పయనం
"రాముడు" నుంచీ "రామం" దాకా నాన్న పయనం...రాయలనుకున్నా...
కానీ బ్లాగ్ పై సన్నగిల్లిన ఆసక్తి, రాసినా ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత రాయనివ్వటం లేదు..
*** *** ***
నిన్న కాస్త లేచి కూచోగానే ఏమీ తోచటం లేదని, ఓ పుస్తకం పెన్నూ తెప్పించుకుని హాస్పటల్ బెడ్ మీద బొమ్మలు వేస్తూ కూచున్నారుట.(నాన్న స్కెచెస్, పైంటింగ్స్ బాగా వేస్తారు.)
ఇంకొన్నేళ్ళు నాన్న ఆరోగ్యంగా మా మధ్యన తిరగాలని కోరిక. ప్రార్ధన.
*** **** ****
అప్పట్లోని 150 స్టేషన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఆకాశవాణి వార్షిక పోటీల్లో వరుసగా పది నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఏకైన తెలుగు అనౌన్సర్ నాన్న.
తాను చేసిన అవిరామ సేవకూ, కృషికీ, సాధించిన విజయాలకూ ఆకాశవాణి సంస్థ ఏ మాత్రం గుర్తింపునీ ఇవ్వలేదనే బాధ ఆయనలో ఉండిపోయింది. అనామకంగా మిగిలిపోయిన చాలా మందిలా గొప్పవాళ్ళలాగే తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం అని మేము అనుకుంటాము.
క్రిందన నాన్న చేసిన ప్రోగ్రామ్స్ కు ఆయా సంవత్సరాల్లోని Information & Broadcasting ministers నేషనల్ అవార్డ్స్ ఇస్తూండగా తీసిన కొన్ని ఫోటోలు.
తాను చేసిన అవిరామ సేవకూ, కృషికీ, సాధించిన విజయాలకూ ఆకాశవాణి సంస్థ ఏ మాత్రం గుర్తింపునీ ఇవ్వలేదనే బాధ ఆయనలో ఉండిపోయింది. అనామకంగా మిగిలిపోయిన చాలా మందిలా గొప్పవాళ్ళలాగే తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం అని మేము అనుకుంటాము.
క్రిందన నాన్న చేసిన ప్రోగ్రామ్స్ కు ఆయా సంవత్సరాల్లోని Information & Broadcasting ministers నేషనల్ అవార్డ్స్ ఇస్తూండగా తీసిన కొన్ని ఫోటోలు.
నాన్న బయోడేటా(పెద్దది చేస్తే ఆయన చేసిన కార్యక్రమాల జాబితా ఉంటుంది.) |
49 comments:
త్రుష్ణగారు మీ నాన్నగారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ..
మీ నాన్నగారి గురించి తెలుసులోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది...మీ నాన్న గారి "ఖండవల్లి డేస్" త్వరలో ఆవిష్క్రుతమవుతుందని ఆశిస్తున్నాను..
మీనాన్న గారి గురించి మీరు మరిన్ని విషయాలు మాకు తెలియచేస్తారని భావిస్తున్నాను..
మీ నాన్నగారు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను.
నాన్న గురించి ఎవరు రాసినా లేదా మాట్లాడినా ప్రతి బిడ్డకు తండ్రి గుర్తుకు రాకతప్పదు.ఆకాశంతోగాని,సముద్రంతోగాని పోల్చబడే నాన్న గంభీరతకన్నా వెన్నతో పోల్చబడే నాన్న మనసే మిన్న.నాన్న కఠిన వాక్కుల వెనుక ఉన్న కర్తవ్యదీక్ష నేటి పిల్లలకు అవగతమైతే నాన్న ప్రేమ కరుణామృతమే.మీ నాన్న గర్వించదగ్గ కూతురు మీరు.
నిజమే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే........
తనే ధైర్యం సంతోషం అలోచన అన్ని
మీరు రాసింది చదువుతుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నయి
నాన్న లేని జీవితం అసలు ఊహకే రాదు
మీ నన్న గారు ఆరోగ్య వంతుండై మరిన్ని విజయాలు అందుకొని మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగ కోరుకుంటున్నా ...............
చాలా బాగా రాశారు తృష్ణా. ఆయన ఆరోగ్యం నిలకడగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇప్పటికైనా మించి పోయింది లేదు ఆ నిర్లిప్తతని పక్కన పెట్టేసి నాన్నగారి గురించి మీరు రాద్దామనుకున్న సిరీస్ రాసేయండి. కామెంట్స్ రాయకపోయినా చాలామంది ఖచ్చితంగా చదువుతారు.
మీ నాన్న గారి గురించి మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు. మీకు మీ నాన్న గారితో ఎంతటి అనుబంధముందో మీ టపాలు చెప్పకనే చెప్తాయి.
ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ఆయన చెయ్యాలనుకున్న పనులు నిర్విఘ్నంగా చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను.
అద్భుతంగా రాసారు.
బ్లాగున్న కూతురి తండ్రి అనామకులెట్లా అవుతారు? :)
ఇప్పటికైనా మీరు రామంగారి గురించి మొదలు పెట్టడం సంతోషం. అంచెలంచెలుగా అయినా కొనసాగించండి.
నాన్నలకి కూతుళ్ళు ఎప్పుడూ బంగారుతల్లులే. కూతుళ్ళకి నాన్న ఎప్పుడూ ఒక అద్భుతమే. మంచి చెడులను వివరించి చెపుతూ, నలుగురిలో ఎలా మసులుకోవాలో చెప్పే నాన్న నిజంగా కూతుళ్ళకి నడిచే ఎన్ సైక్లోపీడియా అనే చెప్పాలి. వారిద్దరి బాంధవ్యం అనిర్వచనీయం. నాకు కూడా అన్నీ మా నాన్నగారే వివరించి చెప్పేవారు.
మీ నాన్నగారు క్షేమంగా ఇంటికొచ్చి, ఆనందంగా మరో పదికాలాలపాటు మీకు రక్షగా వుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
Wishing him a very speedy recovery!
తృష్ణ,
రాసిన ప్రతి అక్షరం అక్షర సత్యం. నాన్న గారి ఆరోగ్యం కుదుటపడి వుంటుందని ఆశిస్తున్నాను.
మీకు ముందే చెప్పినట్లు అప్పటి మీ నాన్నగారిని ( నాకు బాగా పరిచయం వున్న మీ నాన్నగారు) చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. ఆయన రేడియో లో నిర్వహించిన కార్యక్రమాలన్నీ నెమ్మదిగా గుర్తుకు రాసాగాయి. నా దగ్గర మీ నాన్నగారిది ఇంకో ఫోటో వుండాలి. ఎప్పుడైనా కనిపిస్తే పోస్ట్ చేస్తాను. చూద్దూరు గాని.
ఆకాశవాణి విజయవాడ శ్రోతలకు సుపరిచితమైన రామం గారి గురించి ఈ పోస్ట్ సరిపోదు అమ్మాయి. ఇంకా చాలా చాలా విషయాలు రాయాలి.రాస్తారు గా...
నాన్న గారికి అడిగానని చెప్పండి.
Really thanks a ton for sending me he link... What can I say??? Simply great
నిజానికి ఊపిరి తీసుకోడానికి కూడా బిజీగా ఉన్నాను తృష్ణ గారూ! కానీ మీ ఉత్తరం ,ఈ పోస్టు, చూడగానే వ్యాఖ్య రాయకుండా ఉండలేననిపించింది.
నాకసలు రేడియో అంటే ఇంత ప్రేమ ఏర్పడ్డానికి కారణం విజయవాడ అనౌన్సర్లు! అందులోనూ మీ నాన్నగరాంటే ఏదో మా ఇంట్లో మనిషిలా ఫీలైపోయేవాళ్లం! మెత్తని తాలిత్యంతో కూడినా ఆ స్వరం వింటూ ఉంటే రేడియోని విడిచిపెట్టబుద్ధి అయ్యేది కాదు! మధ్యాహ్నం పన్నెండింటికి (సోమవారమా? గురువారామా గుర్తు లేదు) సంగీత ప్రియ సిగ్నేచర్ ట్యూను, "సంగీత ప్రియ" అన్న చక్కని అనౌన్స్ మెంట్ వినడానికి మా అమ్మగారు వేచి ఉండేవారు. ఎన్నెన్నో ప్రయోగాలు, ఎంతెంత మందివో పరిచయాలు, ఎంత బావుండేది ఆ కార్యక్రమం! ఒకసారి తెలుగు సినిమా పాటలకు మూలమైన హిందీ, ఇంగ్లీష్ పాటల గురిచి ప్రోగ్రామ్ చేశారు. చిట్టి చెల్లెలు సినిమాలోని 'ఈ రేయి తీయనిది" పాటకు మూలమైన ఇంగ్లీష్ ట్యూన్ వినిపించారు. ఇలాంటివే ఎన్నో జ్ఞాపకాలు!
నిజమే, మీరెంతో అదృష్ట వంతులు! "ఎవరు చదువుతారు" కాదు, ఎంతో మంది ఉన్నారు, చదివేందుకు! ఎవరూ చదవకపోయినా సరే, మా రామం గారి గురించి ఇక్కడ ఒక బ్లాగులో ఎప్పటికీ అలా ఒక టపా ఉండిపోవాలి.
ఒక నిరంతర అన్వేషి ...
ఒక స్వాప్నికుడు
కళాకారుడు
ఆశావాది....అంతే కాదు, ఎంతో మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న ఒక వాచస్పతి!
అనామకంగా మిగిలిపోయిన చాలా మందిలా గొప్పవాళ్ళలాగే తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం ..ఇది బహుశా మీరు అనుకుంటున్నారు కానీ ఆయన అలా ఎప్పుడూ అనుకుని ఉండరు. అసలు ఈ గుర్తింపుల్ని ఆయన పట్టించుకోరేమో అనిపిస్తుంది నాకు. అది ఆయన దురదృష్టం కాదు, కళా కారుల్ని గుర్తించి గౌరవించలేని మన ప్రభుత్వానిది, సమాజానిదీ!
మీ నాన్నగారికేమీ కాదు! ఇంటికి వచ్చిన రామం గారు చక్కని నూరేళ్ళ జీవితాన్ని నిండుగా చూస్తారు.
మీరేమీ బెంగ పడవద్దు. మీరంతా దిగులు పడకుండా ఉంటే రామం గారు త్వరలోనే కోలుకుని, సంపూర్ణారోగ్యంతో తిరుగుతారు.
మీ నాన్నగారు ఆరోగ్యంగా ఇంటికి వస్తారు.ఎంత మంచి నాన్నండి.మా నాన్నగారు గుర్తుకు వచ్చారు.ఆయనా అంతే.అందరు నాన్నలూ మంచివారేనండి.అయితే కొంతమందే పిల్లల తో చనువుగా ఉంటారు.మిగిలిన నాన్నలతో అమ్మ మధ్యవర్తిత్వం ఉంటేకానీ పనవ్వదు.మీరు రాస్తూ ఉండండి.మేం చదువుతూ ఉంటాం.ఇలాంటివి రాయటం మాత్రం మానేయకండేం.
mee nanna garu tondaraga kolukovali ani korukuntunna..
enthaina prathi aada pilla ki 1st hero nanne kada...
mee post chaduvuthuu unte..naku nannaku madya unna anubandham inko sari gurthochindi... :)..chala bagundi mee post
మీ నాన్నగారు త్వరలో కోలుకోవాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను .
@ కొత్తపాళీ,
అతిశయోక్తిగా మాట్లాడ్డం కాకపోతే "బ్లాగున్న కూతురి తండ్రి అనామకులెలా అవుతారు " ఏమిటి? ఏమైనా అర్థం ఉందా ఆ మాటకి? ఒక పక్క ఆవిడ వాళ్ల నాన్నగారి గొప్పతనం అంతా రాశాక 'అంతటి గొప్ప మనిషి అనామకులెలా అవుతారు" అంటే సరిగ్గా ఉండదూ!
తృష్ణగారు, మీ నాన్నగారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
మీ నాన్నగారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.వివిధభారతి, ఈవెనింగ్ వచ్చే హిందీ పాటలు, ఆ ప్రోగ్రాం పేరు కూడా గుర్తులేదు, తప్పించి నాకు రేడియో అలవాటు తక్కువ. అందువల్ల వారి గురించి నాకు తెలియదు.మీ నాన్నగారిని చక్కగా పరిచయం చేసారు.థాంక్స్
ఊఁ...! నా భావం మీకు అర్ధమయ్యే ఉంటుందనుకుంటున్నాను :)
అక్క, నాన్న గారు నిజంగా గ్రేట్...ఆ బయోడేటా చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది....అలాంటి వ్యక్తి గురించి మీరు రాయాలా వద్దా అని ఆలోచించటం ఏం బాలేదు...మీకు కూడా నాన్నగారిలానే చాలా కళల్లో ప్రవేశం ఉంది అనిపించింది...మీరు ఆయన గురించి టపాలు రాస్తే అవి మాతో పాటు, ఆయన కూడా స్వయంగా చదువుకోవాలని ఆశిస్తున్నాను...ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకుంటున్నాను...అన్నట్టు నాన్నగారు యంగ్‌గా ఉన్నప్పుడు(మొదటి ఫోటో)చాలా స్మార్ట్‌గా ఉన్నారు కదా...
ఇవాళ బాలేకపోయినా, రేపు బాగుంటుంది.. అనే ఆశతో ఎప్పుడూ ఉండాలి.."
మీ నాన్నగారు చెప్పింది గుర్తు పెట్టుకుని ఆయన్ని ఆరోగ్యం గా రిసీవ్ చేసుకోడానికి సిద్దం గా ఉండండి .
మీ నాన్నగారు కోలుకుంటున్నారని, ఇవ్వాళో రేపో ఇంటికి వెడతారని తెలిసి ఎంతగానో సంతోషించాను. నేను, రేడియో అభిమాని బ్లాగ్ సహ రచయితలు, పాఠకులు-అందరి కోరిక, ప్రార్ధన ఒక్కటే "రేడియో రామం" గారు అయురారోగ్యాలతో కలకాలం మన మధ్య ఉండాలని.
నిజం! నిజం!! నిజం!!! ఆకాశవాణి వారు, వారి కళాకారుల పట్ల చూపించిన నిరాదరణ రేడియో అభిమానులందరి మనస్సులనూ కలచివేస్తున్నది. ఎంతో కష్టపడి ఆకాశవాణి కార్యక్రమాలను, ఏదో ఉద్యోగ ధర్మంగా పది గంటలకు వచ్చి, ఆ మైకు ముందు కూచుని మాట్లాడి ఐదు గంటలకు వెళ్ళిపోకుండా, మనస్సు పెట్టి తమ మేధస్సు మొత్తం ఆకాశవాణికే అంకితం చేసిన కళాకారులకు సరైన పదవోన్నతులు కల్పించకుండా ఊడిగం చేయించుకోవటమే కాక, ఆపైన వారికి తగినంత గుర్తింపు కూడ ఇవ్వకపోవటం, మన మధ్య మనం చూస్తుండగా, మన కళ్ళముందే జరిగిన దారుణం. మీ నాన్నగారు ఈ విషయంలో బాధపడటంలో కారణం తప్పకుండా ఉన్నది. ఆకాశవాణి పట్టించుకోకపోతేనేమి, శ్రోతల మనస్సులో ఎప్పటికీ చెరిగిపోని గుర్తుండిపోయారు అని సరిపుచ్చుకోవటమే మనవంతుగా అనిపిస్తున్నది పైనున్న కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే.
ఈ నాటికైన ఆకాశవాణి వారు మేల్కొని, వారి కళాకారులకు సముచితమైన గుర్తింపునిచ్చి, ఆకాశవాణి పేరు గౌరవాలు నిలబెట్టుకోవాలని రేడియో అభిమానులందరి తరఫున నా డిమాండ్.
రామం గారి లలిత గాంభీర్యమైన గొంతు వింటే ఆకాశవాణి స్వర్ణయుగం గుర్తొస్తుంది; సంవత్సరాల వెనక్కి మనసు పరిగెడుతుంది. ఆయన గురించిన విశేషాలు (వీలున్న సందర్భంలో ఆయన స్వరంతో కూడిన ఆడియో జోడిస్తూ) తప్పుకుండా రాయండి. వాటిని ఆసక్తిగా చదవాలని ఎదురుచూసేవాళ్ళు ఉన్నారని మర్చిపోకండి!
ఆకాశవాణి సంస్థ గుర్తింపునివ్వకపోతే ఏమైంది? ఆయన్ను అమితంగా అభిమానించే ఎందరో అభిమానులున్నారని రామం గారికి గుర్తు చేయండి!
ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాకొద్దీ నాకు ఇంకా ఆసక్తి పెరుగుతోంది. మీ నాన్నగారు వేసిన కొన్ని చిత్రాలు కూడా మాకు చూపించగలరా. మీ నాన్న గారు తొందరలోనే కోలుకొని తన ఆశయాలు నెరవేర్చుకొంటారు. అందుకు మీరు తోడ్పడాలి మరి.
Naanna ane padamlone undi naa sontam ane feeling, mee naanna gaari gurinchi intaga alochisthunna meeku naa abhinandanalu. Jeevitam lo ilaanti kastaalu anevi thappavu ilantivi vachinapude kada goppavati viluva telustundi manaku. Mee naana gaaru twaraga kolukuni happy ga undaalani aa devudni praardisthunnanu.
తృష్ణ గారు,నాన్నగారి గురించిన విశేషాలు చదివాను....నాకు రేడియోతో అంతగా పరిచయం లేకపోయినా మీ బ్లాగ్ ముఖంగా ఆయనగురించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన సదా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్దిస్తున్నాను.
మీ నాన్నగారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరి ఆయన రాయాలనుకున్న పుస్తకాలన్నీ పూర్తి చేయాలని, అవి చదివే అవకాశం మనందరికీ రావాలని ఎదురు చూస్తూ ఉంటాను.
ఈలోగా మీరు మాత్రం మీ జ్ఞాపకాల్ని బ్లాగులో పంచుకుంటూ ఉండండి. :)
ఒక కూతురిగా నాన్న గారి గురించి చెప్పిన మీ ప్రతీ మాటలో నాకు నేను కూడా కనిపించాను. బహుశా అందరు నాన్నలు కూతుళ్ళని ఇంతే అపురూపంగా పెంచుతారేమో!
రోజువారి కబుర్లే మీ బ్లాగులొకి వచ్చేసరికి అపురూప౦గా మురిపిస్తాయి. మరి అపురూపమయిన వ్యక్తి (...నాన్న కాదు. నాన్నకు ము౦దు విశేషణాలకి విలువలేదు) గురి౦చి వ్రాస్తే అభిన౦ది౦చకు౦డా ఎవరు౦డగలరు. వీలయిన౦త త్వరగా మీ బ్లాగును, నాన్న గారికి చూపి౦చి ఆ కళ్ళల్లో తృప్తి/గర్వ౦ చూడ౦డి ( రాని గౌరవాలు కూడా తేలేనివి). బ్లాగు మీద వైరాగ్య౦ మరి౦తగా విస్తరి౦చడానికి అయితే ఓకే. అయినా మీ నాన్న గారి పూర్తిగాని వర్క్స్ మీ ద్వారా వస్తే ఎలా వు౦టు౦ది...బ్లాగు సీరియల్ గా(సీరియస్ ఆలొచి౦చ౦డి)
నాన్న గురించి అద్భుతంగా రాసిన మీరు నాకు ఓ అద్భుతమైన కూతురుగా కనిపిస్తున్నారు . ఆలస్యంగానైనా కోరుకొంటున్నాను .. మీ నాన్న గారి ఆరోగ్యం కుదటబడి, మీ నాన్నగారు తో మీరు ముందు ముందు మరిన్ని అందమైన రోజులను జ్ఞాపకాలుగా మలచుకోవాలని, ముందున్న మంచిరోజులన్నీ మీవే కావాలని .
@రాజ్: భగవంతుని దయ వలన నాన్న కోలుకుంటున్నారు.
అదే మా అందరి కోరిక కూడా నండీ.ధన్యవాదాలు.
@జ్యోతి: ధన్యవాదాలండీ..
@సి.ఉమాదేవి: ధన్యవాదాలండీ..
@పావని: ధన్యవాదాలండీ..
@వేణూ శ్రీకాంత్: ప్రయత్నిస్తానండీ..ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: మా అందరి కోరిక కూడా అదేనండీ. ధన్యవాదాలు.
@భాను: ఆయనపై ప్రేమే రాయించిందండీ. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: తప్పక ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.
@శ్రీలలిత: నిజమేనండీ..ధన్యవాదాలు.
@మాగంటి వంశీమోహన్: థాంక్సండీ.
@కల్పన రెంటాల: నాన్నగారు సమర్పించిన ఒక నాటకంలో మీరు పాల్గొన్నప్పుడు తీసిన ఓ ఫోటో ఉంది. చాలా చిన్నప్పుడు. అదీ పంపుతాను..:)
నాన్న గురించి ఇప్పటికైనా ఈమాత్రం రాయగలిగాను. ఇంకా రాయటానికి ప్రయత్నిస్తానండి..
@గీతాచార్య: Thank you too..
లేట్ గా చూసాను ఈ పోస్ట్. మీరింతకుముందు మీ నాన్నగారి గురించి అడపాదడపా చెప్పినప్పుడే అడగాలనుకున్నాను ఆయనగురించి పూర్తిపాఠం రాయమని, కానీ ఎందుకో అడగలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ కూతురిగా మీకు ఆయనగురించి సర్వం తెలుసు. రాయండి, ఎన్ని భాగాలైనా చదవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మీ నాన్నగారు కోలుకున్నారని తలుస్తాను.
@సుజాత: మీ అభిమానానికి కళ్ళ నీళ్ళు వచ్చాయి. సాటిలైట్ చానల్స్ రొజుల్లో రేడియోనూ, ఆ మనుషులనూ ఇంకా గుర్తుంచుకున్నవారు చాలా తక్కువ.
ఆ రోజుల్లో "సంగీతప్రియ" కు ఉన్న క్రేజ్ విన్న వాళ్ళకే తెలుస్తుంది. గురువారాలు వచ్చేది. నాన్న వాయిస్ కూడా అంత మధురంగా ఉండేది. కొద్దిగా మారినా ఇప్పటికీ మాకు ఇష్టమే ఆ గొంతు..!
ఎంతమంది శ్రోతలు ఉత్తరాలు రాసేవారో...అలమారు నిండి పోయేది లెటర్స్ తో. డిడి వాళ్ల సురభి లో చూపించేవారు గంగాళంతో ఉత్తరాలు వచ్చాయని..అలా వచ్చేవి.
మీరన్నట్లు ధనార్జన, పేరుప్రఖ్యతలకూ ఆయన ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. తనకు నచ్చిన విధంగా, చేయగలిగినన్ని వైవిధ్యభరితమైన కార్యక్రమాలని రూపొందించుకుంటూ వెళ్ళారు. రేడియో ఏ ఆయన జీవితం.
@వజ్రం: చాలా థాంక్సండి.
@మాలా కుమార్: ధన్యవాదాలండి.
@కిరణ్ కుమార్: ధన్యవాదాలు.
@సునీత: నాన్నగారు ఎక్కువభాగం వివిధభారతిలోనే పనిచేసారు. ’జనరంజన” అవీ వినేప్పుడు వాయిస్ వినే ఉంటారు...ధన్యవాదాలు.
@సృజన: got it..:)
@శేఖర్: మీరన్నది నిజమే. నాన్న చాలా బాగుండేవారు. నన్ను దింపతానికి కాలేజీకి వస్తే జకీర్ హుసేన్లా ఉన్నారు మీ నాన్నగారు అనేవారు ఫ్రెండ్స్...:)
నాన్నలా ఇన్స్ట్రుమెంట్స్(ఎక్కడా నేర్చుకోకున్న బుల్బుల్,మాండొలీన్,షాహిబాజా,మోర్సింగ్ మొదలైన వాయిద్యాలు వాయిస్తారు నాన్న) వాయించటం తప్ప మిగిలిన కళల్లో కాస్తొ కూస్తో ప్రవేశం ఏర్పడిందనే చెప్పలండీ.
మీరు చెప్పినట్లే ఈ టపా నాన్నకు చూపించాను.సంతోషించారు. thanks a lot.
@శివ: సరిగ్గా చెప్పారండి. అందరికీ రేడియో బయట నుంచే తెలుసు. వింటారు. కానీ నేను రేడియో లోపల కథకు కూడా సాక్షిని కాబట్టి నాకు ఆ సంస్థ కళాకరులకు చేసిన అన్యాయం పైన తీరని కోపం.
రజనీకాంతరావు గారి వంటి మహామహులకే సరైన గుర్తింపుని ఇవ్వలేకపోయింది ఆకాశవాణి, ప్రభుత్వం. ఇంకేం చెప్పాలి..?!
రేడియో కళాకారుల పట్ల మీ అభిమానానికి ధన్యవాదాలు.
@వేణు: నాన్నగారి గొంతు మీక్కూడా పరిచితమేనని చదివి సంతోషం కలిగిందండి. అప్పటిది నిజంగా స్వర్ణయుగమే.
వినేవాళ్ళు ఇందరున్నారని తెలిసింది కదా..తప్పక వాయిస్ క్లిప్పింగ్ పెడతానండీ...ధన్యవాదాలు.
@జయ: నాన్న వేసిన చిత్రాలు చాలా మటుకు బహుమతులుగా వెళ్పోయాయండి. స్కెచ్ బుక్స్‌లో వేసిన కొన్ని బొమ్మలు మాత్రమే ఉన్నాయి. నాన్న గురించి మళ్ళీ రాసినప్పుడు అవి పెడతానండి..ధన్యవాదాలు.
@కొంచెం మానవత్వం: ధన్యవాదాలు.
@పరిమళం: ధన్యవాదాలండి.
@మధురవాణి: అవునండి. నాకు తెలిసీ అబ్బాయిలందరూ అమ్మ పార్టీ. కూతుళ్ళంతా నాన్న పార్టీ...:)
@శివ: మీరు మరీ ఎత్తేస్తున్నారు... :)
నాన్నగారు టపా చూసి సంతోషించారండి.thank you.
@విజయ: దేవుడి దయవలన ఆయన కోలుకుంటున్నారండీ...ధన్యవాదాలు.
@ఆ.సౌమ్య: నాన్న కోలుకుంటున్నారండీ...చాలా థాంక్స్.
మీ నాన్న గారు కోలుకున్నందుకు సంతోషం
మీరు నన్ను విస్మరించినందుకు ఖేదం
@రవిగారు : రవిగారు : అయ్యో, very very sorry అండీ. చాలా రోజులైంది వ్యాఖ్యలకు జవాబు రాయలేదనే తొందరలో రాసాను. అందుకని మిస్సయ్యాను...మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు..:)
తృష్ణ,
అవును. నేను చెప్పింది కూడా ఆ ఫోటో నే. చెప్పాను గా చాలా సార్లు. మొత్తం నా రచనల పేపర్ కటింగ్స్ పోయాయి అని. అందులో ఇది వుందో లేదో తెలియదు. అందుకే వెతుకుతాను అని చెప్పాను. ఆశ్చర్యం గా నాన్న గారి దగ్గర అది వుందా? నేను చాలా చిన్న పిల్లని అప్పుడు. అదే రేడియో లో నా మొదటి నాటకం.
నాన్న గారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా వుంది?
@kalpana: అవును. మీరప్పుడూ 12-15yrs మధ్య ఉండి ఉంటారు. త్వరలో పంపిస్తాను ఫోటో...:)
and with God's grace nanna is recuperating.
చాలా బాగా వ్రాశారు.. గుండెల్లో తడి కలిగించింది..
Post a Comment