My Blog List

  • October - 2018లో అనుకుంటా ఒకరోజు అనుకోకుండా ఈ సినిమా చూశాను. చాలా చిత్రమైన కథ. ఒక స్టార్ హోటల్లో intern స్టూడెంట్స్ కొందరు పనిచేస్తూ ఉంటారు. ఒకే గ్రూప్ కాబట్టి అందర...

Sunday, January 19, 2020

భగవంతుడి దయ


భగవంతుడి దయ ఉండబట్టి ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. సాయంత్రం కూరలు కొనుక్కుని రోడ్దుకి ఎడమ పక్కగానే మెల్లగా నడిచి వస్తున్నాను. బరువుగా ఉందని కూరల సంచీ భూజానికి వేసుకున్నాను.. మరుక్షణంలో వెనుకనుంచి ఒక ట్రాలీ వాడు గుద్దేశాడు. బండి నా వీపుకున్న బ్యాగ్ కి గుద్దుకుంది. అమాంతం ముందుకు బోర్లా పడిపోయాను. బ్యాగ్ దూరంగా పడి కూరలన్నీ దొర్లిపోయాయి. వాడు ట్రాలీ ఆపి, దిగి వచ్చి సారి సారీ అనేసి వెళ్పోయాడు. నేను వాడి వైపు కూడా చూడలేదు. ఆ అదురుకి కాసేపు అసలు లేవలేకపోయాను. ఎవరో ఒకామె వచ్చి లేపింది. అదృష్టం బాగుండి చిన్న చిన్న కముకు దెబ్బలతో బయటపడ్డాను. ఏ చెయ్యో కాలో విరిగి ఉంటే, నే మంచాన పడితే ఇల్లెలా గడుస్తుంది?
అరచేతితో అనుకోవడం వల్ల అరచేతి నెప్పి
  బాగా ఉంది.. నిజంగా ఎంతటి అదృష్టం నాయందు ఉందో ఇవాళ! లేచిన వేళ మంచిది. భగవంతుడి కృప గట్టిది.