కొత్త తెలుగు సినిమాల్లో బాగా నచ్చేవాటిని వేళ్లపై లెఖ్ఖపెట్టచ్చు. అలా నాకిష్టమైన అతి తక్కువ సినిమాల్లో ఒకటి "మధుమాసం(2007)" చిత్రం. ఈ సినిమా థీమ్ నాకు బాగా నచ్చింది. ఆప్యాయానురాగాలే జీవితం అని నమ్మే ఒక ఎమోషనల్ అమ్మాయి, ఏ ఉద్వేగాలకీ పెద్దగా స్పందించని ఒక ప్రాక్టికల్ మైండెడ్ అబ్బాయి ని ప్రేమిస్తుంది. కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా రెండవ భాగానికి వచ్చేసరికీ వారిద్దరూ తమ తమ స్వభావాలకు విరుధ్ధంగా మారిపోతారు. క్లైమాక్స్ పార్ట్ అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు కానీ అక్కడిదాకా నడిచిన ఆ మూడొంతులు సినిమా మాత్రం నాకు బాగా నచ్చేస్తుంది. స్నేహ, సుమంత్ ఇద్దరు కూడా బాగా నటించిన ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ శ్రీ ఈ.ఎస్.మూర్తి చేసారు. దర్శకుడు "చంద్ర సిధ్ధార్ధ" ఇంతకు ముందు తీసిన "అదీ సంగతి", "ఆ నలుగురు" కూడా బావుంటాయి. ఈ సినిమా బానే ఆడింది. కొన్ని ప్రేమ, పెళ్ళి, సంసారం మొదలైనవాటిపై అంతగా నమ్మకంలేని సంజయ్, హంస పెళ్ళి ప్రస్తావనను వద్దనటానికి ఏ కారణం కనబడక ఒప్పుకుంటాడు. కానీ ప్రేమ లేదన్న కారణంగా పెళ్ళి వద్దనుకున్న హంస అతనికి మూర్ఖంగా అనిపిస్తుంది. స్వేచ్ఛాపరురాలైన అతని స్నేహితురాలు మాయ(పార్వతీ మెల్టన్) తో పాటూ అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు సంజయ్. అతని తల్లిదండ్రులు కూడా అతడిని అనుమానించి పోలీస్ స్టేషన్ కు వెళ్లటానికి నిరాకరిసారు. అర్ధరాత్రి పూట సంజయ్, మాయలకు ఒంటరిగా భోజనం తెచ్చిన హంసను చూసి ఆశ్చర్యపోతారు వారిద్దరూ. తనకు వారిపై ఎటువంటి అనుమానం లేదనీ చెప్పి వెళ్ళిన హంస పై మొదటిసారిగా అభిమానం ఏర్పడుతుంది సంజయ్ కు. సినిమాలో ఈ పోలీస్ స్టేషన్ సన్నివేశం నాకు బాగా నచ్చుతుంది. అది హంస నిర్మల వ్యక్తిత్వాన్ని చిత్రికరించటానికి ఉపయోగపడే బలమైన సన్నివేశం. ఆ రాత్రి తరువాత తనకు కనపడని హంసను కలవాలని సంజయ్ ఆమె కోసం ఎంతో వెతుకుతాడు. అది అతనిలోని మార్పుకు నిదర్శనం. కొన్ని చోట్ల అయితే వంద రోజులు కూడా ఆడింది.
సినిమాకు మూలం బలభద్రపాత్రుని రమణిగారు రాసిన నవల అని విన్నాను. మరి నవలలోనూ ఇదే కథ ఉండే, సినిమాకు ఏమన్నా మార్పులు చేసారో తెలియదు. హంసవాహిని(స్నేహ) ఒక మధ్యతరగతి అమ్మాయి. ఉద్యోగం చేస్తూ తండ్రిని పోషిస్తూ ఉంటుంది. తనను అమితంగా ప్రేమించే భర్త కావాలని నోములూ, పుజలూ చేసే సెంటిమెంట్లున్న అమ్మాయి. కొత్తగా మారిన ఇంటి ఓనర్గారి అబ్బాయి సంజయ్(సుమంత్) వ్యక్తిత్వం బాగ నచ్చుతుంది హంసకు. అతడి దగ్గర పెళ్ళి ప్రస్తావన తెస్తుంది. ఎంగేజ్మెంట్ రోజున సంజయ్ కు తన మీద ప్రేమలేదని, కేవలం స్వశక్తిని నమ్ముకున్న అందమైన అమ్మాయిగానే తనను పెళ్ళాడుతున్నానని సంజయ్ చెప్పటం హంసను బాగా కృంగదీస్తుంది. ప్రేమ లేని పెళ్ళి తనకు ఇష్టం లేదని పెళ్ళిని రద్దు చేసుకుంటుంది హంస. తరువాతి వరుస సన్నివేశాలు ఆమెకు తన తండ్రి, అన్నావదినల నిజస్వరూపాలు తెలుసుకునేలా చేస్తాయి. ప్రపంచంలో అన్ని బంధాలూ అవసరాల మీదే ఆధారపడి ఉంటాయి. మనుషుల మధ్యన ప్రేమాభిమానాలు అన్నీ వట్టి నాటకాలన్న అభిప్రాయానికి ఆమె చేరుకుంటుంది. ఇల్లు వదిలి హాస్టల్లో ఒంటరి జీవితం మొదలుపెడుతుంది.
ప్రేమ, పెళ్ళి, సంసారం మొదలైనవాటిపై అంతగా నమ్మకంలేని సంజయ్, హంస పెళ్ళి ప్రస్తావనను వద్దనటానికి ఏ కారణం కనబడక ఒప్పుకుంటాడు. కానీ ప్రేమ లేదన్న కారణంగా పెళ్ళి వద్దనుకున్న హంస అతనికి మూర్ఖంగా అనిపిస్తుంది. స్వేచ్ఛాపరురాలైన అతని స్నేహితురాలు మాయ(పార్వతీ మెల్టన్) తో పాటూ అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు సంజయ్. అతని తల్లిదండ్రులు కూడా అతడిని అనుమానించి పోలీస్ స్టేషన్ కు వెళ్లటానికి నిరాకరిసారు. అర్ధరాత్రి పూట సంజయ్, మాయలకు ఒంటరిగా భోజనం తెచ్చిన హంసను చూసి ఆశ్చర్యపోతారు వారిద్దరూ. తనకు వారిపై ఎటువంటి అనుమానం లేదనీ చెప్పి వెళ్ళిన హంస పై మొదటిసారిగా అభిమానం ఏర్పడుతుంది సంజయ్ కు. సినిమాలో ఈ పోలీస్ స్టేషన్ సన్నివేశం నాకు బాగా నచ్చుతుంది. అది హంస నిర్మల వ్యక్తిత్వాన్ని చిత్రికరించటానికి ఉపయోగపడే బలమైన సన్నివేశం. ఆ రాత్రి తరువాత తనకు కనపడని హంసను కలవాలని సంజయ్ ఆమె కోసం ఎంతో వెతుకుతాడు. అది అతనిలోని మార్పుకు నిదర్శనం.
హంస ఎక్కడుందో కనుక్కొని కలిసిన సంజయ్ కు నిరాశే ఎదురౌతుంది. అతని ప్రేమను నమ్మలేనన్నీ, అతనిది కేవలం గెలవాలనే పట్టుదల మాత్రమే అనీ హంస అంటుంది. తనలోని మార్పునీ, హంస పట్ల అనురాగాన్ని ఎలా తెలపాలో తెలియక తికమక పడ్తాడు సంజయ్. చివరికి ఏమౌతుంది? హంస సంజయ్ ప్రేమను నమ్ముతుందా? అన్నది మిగిలిన కథ. ఇక్కడిదాకా సినిమా చాలా బావుంటుంది. ఇద్దరిలోనూ వచ్చిన ఈ మార్పు నాకు భలే నచ్చేసింది. రెండవ భాగం చాలా బావుంటుంది అని ఆశ పడ్డ నాకు చాలా నిరాశ కలిగింది. ఇక ఇక్కడ నుంచి జరిగే కథ కేవలం ఒక మామూలు సినిమా కథ లాగానే ఉంటుంది. ఏక్సిడెంట్, అంత పెద్ద సర్జరీ అయ్యాకా కూడా హంస బండి నడపటం...మొదలైనవన్నీ కృత్రిమంగా ఉంటాయి. అసలు ఏక్సిడెంట్ సీన్ పెట్టకుండా మరే విధంగానో ఆ అమ్మాయిలో మార్పు తెచ్చినట్లు ఎందుకు చూపించకూడదు? అన్నది నాకు మిగిలిపోయిన ప్రశ్న. చివరికి కృతిమంగా మిగిసినా, చిత్ర కధాంశం నాకు ఈ సినిమా పట్ల ఇష్టాన్ని మిగిల్చేసింది. ఈ దర్శకుడి తదుపరి చిత్రాల కోసం ఎదురుచూసేలా చేసింది ఈ సినిమా.
మాయ గా పార్వతి మెల్టన్ పాత్ర కథలో ముఖ్యమైనది. మిగిలిన ముఖ్య పాత్రల్లో గిరిబాబు, కవిత, చలపతిరావు, ఉత్తేజ్ తమ వంతు అబినయాన్ని సమర్ధవంతంగా పోషించారు. సిన్మాలో మణిశర్మ సంగీతం సమకూర్చిన బాణీలు బావుంటాయి. ఇతను మొలొడీస్ కూడా బాగా చేస్తాడు అనటానికి నిదర్శనమయ్యే పాటల్లో ఈ సినిమా పాటలూ ఉంటాయి. మొదటి పాట "ఓణీ మెరుపులు" పాట టేకింగ్ చాలా బావుంటుంది. "దేవదాసు కాన్నా", "వేలంటైన్" పాట లిరిక్స్ బావుంటాయి. "ఊహలే", "ప్రొమిస్ చేస్తు ఉన్నా"...కూడా వినటానికి బావుంటాయి. ముఖ్యంగా చివర్ పాటైన "వసంతం వాయిదాపడైనా రాదుగా" పాటకు వేటూరిగారు తనదైన శైలిలో రాసిన సాహిత్యం నాకు బాగా నచ్చుతుంది. "పొడి ఇసుక దారులలో..", "ముస్తాబు మీదా హస్తాక్షరాలే" లాంటి ప్రయోగాలు భలేగా ఉంటాయి. అలా వేటూరి మాత్రమే రాయగలరెమో..! ఈ పాటను రంజిత్,రీటా పాడారు. మేల్ వర్షన్ మరెవరైనా గంభీరమైన వాయిస్ అయితే పాట ఇంక బావుండేది అనిపిస్తుంది నాకు.
ఈ పాటను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు:
http://www.mediafire.com/?1ym2tm3yyyy