ఆమధ్యన వెళ్లిన ఒక నర్సరీ దారిలోనే మరికొంత దూరం వెళ్తే "అలంకృత" రిసార్ట్స్ ఉన్నాయి. స్టే కి వెళ్లకపోయినా, గార్డెన్ చూడటానికి విజిటర్స్ ని పర్మిట్ చేస్తారు. షామీర్పేట్ మండలం, తూముకుంట అనే పల్లె ప్రాంతం ఇది. మొన్నదివారం అక్కడికి వెళ్లాం. 'పచ్చందనమే పచ్చదనమే..' అన్నట్లు.. పెద్ద పెద్ద వృక్షాలు, వాటిపైకి పాకి వేలాడుతున్నతీగెలూ, రంగురంగుల పువ్వులతో చూడముచ్చటగా ఉంది అలంకృత!
అక్కడ రెండు మూడు రోజులు ఉండేవాళ్ళే కాక గార్డెన్ చూడటానికి వచ్చే విజిటర్స్ కూడా చాలామందే ఉన్నారు. నాలుగైదు రకాల రెస్టారెంట్లు కూడా ఉన్నాయి లోపల. చాలా చోట్ల ధ్యాన ముద్రలో ఉన్న బుధ్ధభగవానుడి విగ్రహాలు ఆ ప్రాంతంలోని ప్రశాంతతను పెంచాయి. ఓ గంటసేపు ఆ ప్రశాంతతని ఆస్వాదించి తిరిగివచ్చేసాము.
దూరాలు వెళ్లలేని నగరవాసులకు చక్కని ఆటవిడుపు ఈ ప్రదేశం. కొన్ని ఫోటోలు..
violet lotus |
ఈ పళ్ళు భలే ఉన్నాయి.. |
nightqueen |
figs? |
బాబోయ్.. |