ఆకాశవాణి ప్రముఖులలో రజని గారు మునిపుంగవులు లాంటివారు. అనేకమంది రేడియో కళాకారులకు ఆయన భీష్మ పితామహులు. తెలుగు కార్యక్రమాలకు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టిన తొలి కళాకారులు, వాగ్గేయకారులు రజని.
25-4-13 తేదిన 'మార్కోనీ' జయంతి సందర్భంగా కృష్ణవేణి క్రియేషన్స్ వారు విజయవాడలో ఆకాశవాణి మాజీ సంచాలకులు, కళాకారులు డాక్టర్ బాలాంత్రపు రజని కాంతారావు గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేసారు. ప్రసార భారతి మాజీ అధికారి సాహితీవేత్త డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు అధ్యక్షతన ఈ పురస్కారం అందించబడింది.
సభ తాలుకు ఫోటోలు..
***
రజని గారి స్వీయ రచన "రజనీ ఆత్మ కథా విభావరి" పుస్తకం విడుదల సభ విశేషాలు, రెండు మంచి ప్రసంగాలు ఇక్కడ :
http://trishnaventa.blogspot.in/2012/05/blog-post_24.html