సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Sunday, January 10, 2010
స్వర రాగ గంగా ప్రవాహమే...
"चलो मन जाये घर अपनॆ
इस परदॆस में वॊ पर भॆस में
क्यॊ परदॆसी रहॆं....
चलो मन जाये घर अपनॆ....."
అంటూ 1998 లో G.V.Iyer గారు దర్శకత్వం వహించిన "స్వామి వివేకానంద" హిందీ చిత్రానికి ఒక అద్భుతమైన పాట పాడారు ఏసుదాస్ గారు.
గుల్జార్ రాయగా, ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు "సలీల్ చౌదరి" గారు స్వరపరిచిన పాట ఇది.
ఈ పాట ఈ లంకెలో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=d5oOvxcff0g
నాకు చాలా ఇష్టమైన గాయకుల్లో "ఏసుదాస్" గారు ఒకరు. K.J.Yesudas గొంతు నాకు ఇష్టం అనటం "వెన్నెల" అంటే నాకూ ఇష్టమే అని చెప్పటమే అవుతుంది. ఆయన పాటల గురించి, ఆ స్వరంలోని మాధుర్యాన్ని, విలక్షణమైన ఒరవడి గురించీ ఎంత చెప్పినా తనివి తీరదు. కాబట్టి ఆయిన పాడిన కొన్ని తెలుగు ,హిందీ పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు గుర్తు చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తాను.
ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని తెలుగు పాటలు:
ఓ నిండు చందమామ..నిగనిగలా భామా (బంగారు తిమ్మరాజు)
కొంగున కట్టేసుకోనా(ఇద్దరు మొనగాళ్ళూ)
కురిసెను హృదయములో తేనె జల్లులే (నేనూ నా దేశం)
నీవు నా పక్కనుంటే హాయి(శివమెత్తిన సత్యం)
చిన్ని చిన్ని కన్నయా కన్నులలో నీవయ్యా(భద్రకాళి)
ఎవ్వరిది ఈ పిలుపు..(మానస వీణ)
ఊ అన్నా...ఆ అన్నా....ఉలికి ఉలికి పడతావెందుకు....(దారి తప్పిన మనిషి)
అమృతం తాగిన వాళ్ళు (ప్రతిభావంతుడు)
లలిత ప్రియ కమలం(రుద్రవీణ)
తులసీ దళములచే(రుద్రవీణ)
నీతోనే ఆగేనా(రుద్రవీణ)
తెలవారదేమో స్వామీ(శృతిలయలు)
చుక్కల్లే తోచావే(నిరీక్షణ)
ఇదేలే తరతరాల చరితం(పెద్దరికం)
రాధికా కృష్ణా(మేఘసందేశం)
ఆకాశ దేశానా(మేఘ సందేశం)
సిగలో అవి విరులో(మేఘ సందేశం)
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా(పచ్చని సంసారం)
పచ్చని చిలుకలు(భారతీయుడు)
స్వర రాగ గంగా ప్రవాహమే(సరిగమలు)
కృష్ణ కృపా సాగరం(సరిగమలు)
ముద్దబంతి నవ్వులో మూగబాసలూ(అల్లుడుగారు)
నగుమోము(అల్లుడుగారు)
పూమాల వాడెనుగా పూజసేయకే(సింధు భైరవి)
నీవేగ నా ప్రాణం అంట(ఓ పాపా లాలి)
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా(కుంకుమ తిలకం)
మా పాపాలు కరిగించు (శ్రీ షిర్డీసాయిబాబా మహత్యం)
నాకు చాలా ఇష్టమైన "హరివరాసనం" పాటను ఈ లింక్ లో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=rcQCkkVKC5w
ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని హిందీ పాటలు:
१)चांद जैसॆ मुख्डॆ पॆ...
२)दिल के टुकडॆ टुक्डॆ कर कॆ मुस्कुराकॆ चल दियॆ...जातॆ जातॆ यॆ तॊ बता जा हम जियॆंगॆ किस्कॆ लियॆ..
३)गॊरि तेरा गांव बडा प्यारा में तो गया मारा आकॆ यहा रॆ...(चित चॊर)
४)आज से पेह लॆ..आज सॆ ज्यादा खूशी आज तक नही मिली..(चित चॊर)
५)जब दीप जले आना..जब शाम ढलॆ आना(चित चॊर)
६)जानॆ मन जानॆ मन तॆरॆ यॆ नयन..
७)निस..गम..पनि....आ ..आभीजा..(आनंद महल)
८)सुरमयि अखियॊं में..(सदमा)
९)का करू सजनी आयॆ ना बालम (स्वामी)
१०)माना हॊ तुं बॆहद हसी..(टूटॆ खिलॊनॆ)
११)कहा सॆ आयॆ बदरा -- (चष्मॆ बद्दूर, Singers: K.J. Yesudas & Haimanti Shukla)
నాకు చాలా ఇష్టమైన ఈ పాట ఇక్కడ చూడండి...
2000లో ఈయన పాడిన "Sitaron mein tu hi" ప్రైవేట్ హిందీ అల్బమ్ చాలా ఆదరణ పొందింది. "మెహబూబ్" రాయగా, హిందీ చిత్ర స్వరకర్త "లలిత్" స్వరపరిచిన ఈ అల్బం లోని పది పాటలూ చాలా బావుంటాయి. వాటిలోని ఒక "చమక్ ఛం ఛం" అనే పాటని ఇక్కడ చూడండి..
ఏసుదాస్ గారికి "పిన్నమనేని అవార్డ్" ను విజయవాడలో ఒక సభలో ప్రధానం చేసారు. అప్పుడు ఆయన చేసిన "లైవ్ కచేరి" వినలేకపోయినా, రికార్డింగ్ ను దాచుకోగలగటం నా అదృష్టం. K.J.Yesudas గురించిన మరిన్ని వివరాల కోసం "ఇక్కడ" చూడండి. కొందరు ప్రముఖులు ఆయనకు ఇచ్చిన ప్రశంసలు, ఆయనకు వచ్చిన అవార్డులు, పాడిన భాషల వివరాలూ అన్నీ ఈ వికిపీడియా లింక్ లో ఉన్నాయి. అందుకని ఇంక ప్రత్యేకంగా ఆయన గురించి ఇంకేమీ రాయటం లేదు.
ఏసుదాస్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మనకందరికీ ఇంకెన్నో అద్భుతమైన పాటలనందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఆయన టపా ద్వారా ఇవాళ ఏసుదాస్ గారి పుట్టిన రోజని తెలిపి నాకు ఈ మధురమైన పాటలన్నీ మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన "మురళిగారికి" ప్రత్యేకధన్యవాదాలు.
Subscribe to:
Posts (Atom)