సంసారం - బాధ్యతలు
పరుగులు - పరిష్కారాలు
సమస్యలు - సమాధానాలు
ప్రయాణాలు - ఆనందాలు
ఉత్సాహాలు - ఉద్విగ్నాలు
ఆదాయాలు - వ్యయాలు
ఆరోగ్యం - జాగ్రత్తలు
ఆరాటాలు - ఆక్రోశాలు
వయస్సు - అంతరాలు
పునశ్చరణ - పూజలు
సత్యాన్వేషణ - సాధన
అన్నింటా అంతర్లీనంగా ప్రవహించేది ఒకే ఆలోచన - ఆలోచనలను పంచుకోవాలని!
అదే రచనా ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది.
అదే నన్ను నిస్పృహ నుంచి బయటకు లాగింది.
అదే నాలో ఉత్సాహాన్ని నింపుతూ నడిపించేది.
అదే మళ్ళీ మళ్ళీ నన్ను నిలబెట్టేది.
అదే తృష్ణ...!
ఎప్పటికీ.. అదే తృష్ణ...!

4 comments:
జీవితమే ఒక తీరని దాహం
@sarma: నా దృష్టిలో తీరని దాహం మన మనుషులదండి. దానిని తీర్చుకునేందుకు భగవంతుడు ఇచ్చిన వరం జీవితం. ఆ వరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది మన చేతుల్లోనే ఉంటుంది.
ధన్యవాదాలు.
Forever mee abhimanini. Mee rachanalu chadivakane konchem intlo Aadavaallani ardham chesukovali ane thought start ayyindi. Thank you for writing and sharing your thoughts.
Thankyou very much.
Post a Comment