ప్రారబ్ధమో, కర్మో, నిష్కపటమో, తెలియనితనమో..
దుస్సంగతో, దురాగతమో, పొరపాటో, వెన్నుపోటో..
కారణమేదైనా, పెట్టే పేరులో ఏముంది గానీ..
నష్టమెంతో కష్టమైంది, లోతెరగని గాయమైంది!
నేరం ఒప్పకపోయినా, కన్నీరు ఇంకిపోయినా,
మౌనమే ఆయుధమై పోరాటం ఒంటరిదయినా,
వెలుగు మరుగై వెతలు మిగిలినా,
నిక్కమెన్నటికైనా ఉదయించేనా?
ఇక పయనమాగినా, శ్వాస ఆగినా,
తీర్పు ఎవరిపరమైనా, తోడెవరూ నిలవకున్నా,
ఏ జ్ఞానమెంతపెరిగినా.. లేనేలేదు మన్నింపు !
మనమున లేనేలేదు మన్నింపు!!
1 comment:
మన్నింపు లేని కాలం.
మనకు మనమే వేసుకున్న పాశం.
తరగని పశ్చాత్తాపం కరగని కన్నీటి కధలు.
కొన్ని వేల మరణాలు కొన్ని వందల జననాలు.
కరిగిపోయిన సమయం తిరిగిరాని బాల్యం.
స్ఫురింపనివ్వని అహం. కాలం లో కలిసిపోతున్న అందమైన పరిచయాలు.
ఒక్కసారి మీ కవిత చదవగానే నాకు ఇవే గుర్తువచ్చింది. చాలా బాగుంది మేడం.
Post a Comment