డభ్భై ఆరేళ్ళ తృప్తికరమైన జీవితం చాలాకొద్దిమందికే దొరికే ఒక వరం! అటువంటి కొద్దిమంది అదృష్టవంతుల్లో Tarla Dalal ఒకరు! "తర్లా దలాల్" అనగానే కాన్ఫిడెంట్ గా కనబడే నవ్వు మొహం, భుజాల దాకా పొట్టిగా ఉండి ఎగిరుతూండే జుట్టు ఠక్కున గుర్తుకువస్తాయి. టివిలో ఎక్కడ చూసినా ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూనే కనబడేవారావిడ. పద్మశ్రీ గ్రహీత, సెలబ్రిటీ షెఫ్, బెస్ట్ సెల్లింగ్ కుక్కరీ ఆథర్స్ లో ఒకరైన తర్లా దలాల్ ఇక లేరన్న వార్త పొద్దున్నే నన్ను పాత జ్ఞాపకాల అలల్లోకి నెట్టెసింది..
కాలేజీ రోజుల్లో షెఫ్ సంజీవ్ కపూర్ షో "ఖానా ఖజానా", "కుక్ ఇట్ అప్ విత్ తర్లా దలాల్", "తర్లా దలాల్ షో", స్టార్ ప్లస్ లో "మిర్చ్ మసాలా" మొదలైన కుక్కరీ షోస్ అన్నీ వదలకుండా చూసేదాన్ని. అసలు నాకు వంటింటి మీద ఆసక్తి కలిగించినవి ఈ టీవీ షోసే! నచ్చిన రెసిపీనల్లా డైరీల్లో నింపేసి; మధ్యాహ్నాలు అమ్మ నిద్దరోతున్నప్పుడు వంటింట్లోకి పిల్లిలా దూరి తోచిన ప్రయోగాలన్నీ చేసేస్తు గడిపేసిన కులాసా రోజులు గుర్తుకువచ్చాయి. నెట్లో వెతికి రాసుకున్నవి, ఇంకా తర్లా దలాల్ వెబ్సైట్లోంచి రాసుకున్నవీ, వాల్డెన్ లో కొన్న తర్లా దలాల్ కుక్బుక్స్ లోని రెసిపీలు అన్నయ్య సెలవలకి వచ్చినప్పుడల్లా నేను,వాడూ కలిసి వంటింట్లో చేసిన లెఖ్ఖలేనన్ని ప్రయోగాలు.. గుర్తుకువచ్చాయి! సంజీవ్ కపూర్ చెప్పే విధానం బాగా నచ్చితే, తర్లా దలాల్ చెప్పే వైవిధ్యమైన రెసిపీలు, హెల్దీ రెసిపీలు మా ఇద్దరికీ నచ్చేవి. ఏదైనా రిలయబుల్ రెసిపీ కావాలంటే ఇప్పటికీ నేను తర్లా దలాల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతుకుతాను. నిన్న రాత్రి కూడా యాదృఛ్ఛికంగా నేను ఆవిడ వెబ్సైట్లో ఒక రెసిపీ వెతికాను..!
"She lived a happy, successful and fulfilling life" అన్నడుట ఆవిడ కుమారుడు దీపక్ దలాల్. అతను కూడా రచయిత. బోలెడు పిల్లల పుస్తకాలు రాసాడు. కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడైన వంద పైగా కుక్ బుక్స్, అంతేకాక తను ఫస్ట్ ఫైవ్ బెస్ట్ సెల్లింగ్ కుక్కరీ ఆథర్స్ లో నిలబడగలగడం.. ఆమెకు ఎంత తృప్తిని ఇచ్చి ఉంటుంది..!! ఆవిడ ఆత్మకు శాంతిని నేను కోరేదేమిటి... she deserves it..! కానీ ఆవిడ మాటలు కొన్నింటిని నేను తలుచుకుని, ఇంకా ఆవిడంటే ఇష్టం ఉన్నవారెవరైనా చూస్తారని ఇక్కడ పెడుతున్నాను.. తర్లా దలాల్ ఇంటర్వ్యూ ఒకటి sify.com వెబ్సైట్లో దొరికింది.. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న లింక్ లో ఆ ఇంటర్వ్యూ చూసేయండి..
http://videos.sify.com/with-Tarla-Dalal-SIFY-watch-Rendezvous-watch-klmq4hifgje.html
2 comments:
Tarla Dalal నాకంటే ఆరేళ్ళు పెద్దది! వండుతూ వండిస్తూ ఆనందంగా సార్థకంగా జీవితం గడిపింది! రుచికి,అభిరుచికి తనకు చేతనైనంత మంచి చేసింది!జీవితం చాలా,ఎంతో చిన్నది!చేసేమంచి వెంటనే చేసెయ్యాలి,మంచి పనిని వాయిదా వేయ రాదు!ఇవే ఆమె జీవితం నేర్పే పాటాలు!
@surya prakash apkari:అవునండి, ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది... ధన్యవాదాలు.
Post a Comment