సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 13, 2013

'నిదురించే తోటలో..' సుశీలమ్మ గానామృతం...





ఇవాళ మన తెలుగుసినీగానప్రపంచాన్ని ఏలిన మధురగాయని సుశీలమ్మ పుట్టినరోజు! టపా కోసం పాటలు వెతుకుతూంటే సుశీలమ్మ పాడిన మొత్తం పాటల జాబితా, వివరాలు, డైన్లోడ్ లింక్స్ ఉన్న వెబ్సైట్ దొరికింది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడకు వెళ్ళి గంటలు గంటలు విహరించవచ్చు :) http://psusheela.org/ 



అన్ని పాటల టపాల్లోలాగనే, నాకు చాలా చాలా ఇష్టమైన సుశీలమ్మ పాటలు కొన్ని ఈ టపాలో అందిస్తున్నాను. కొన్నివేల పాటల్లోంచి ఎంచడం చాలా కష్టమైనా.. ఎక్కువగా సోలోస్ మాత్రమే పెట్టాను. మరి మీరంతా కూడా చూసేసి ,వినేసి ఆ గానమాధుర్యంలో ఉయ్యాలలూగేయండి.. రండ్రండి... 


నీ కోసం..నీకోసం.. నా గానం..నా ప్రాణం నీకోసం.. (పునర్జన్మ)  

నిదురించే తోటలోకి... (ముత్యాలముగ్గు)  

సీతాలు సింగారం..మాలచ్చి బంగారం.. (సీతామాలక్ష్మి)  


తోటలో నా రాజు.. (ఏకవీర)  


రేపల్లియ యద ఝల్లున (సప్తపది)  


ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట.. (శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్)  



రాకోయీ అనుకోని అతిథి (శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3089 


వటపత్ర సాయికీ వరహాల లాలి (స్వాతిముత్యం) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6647


అందాల బొమ్మతో..(అమరశిల్పి జక్కన్న) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1076


సఖియా వివరైంచవే (నర్తనశాల)  



 అందేనా ఈ చేతులకు.. (పూజాఫలం)  


కన్నులకు చూపందం (పద్మవ్యూహం)  



నీవు లేక వీణ నిలువలేనన్నది.. (డాక్టర్ చక్రవర్తి)  


వినిపించని రాగలే కనిపించని అందాలే...(చదువుకున్న అమ్మాయిలు) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1075


అమ్మ కడుపు చల్లగా..(సాక్షి)
 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3003 


అనురాగము విరిసేనా (దొంగ రాముడు) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1009 


సీతారాముల కల్యాణం చూతుము రారండి... (సీతారామకల్యాణం)  


ఏమని పాడెదనో ఈవేళ.. మానసవీణ మౌనముగా నిదురించిన వేళ.. (భార్యాభర్తలు) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1082 




తెలియని ఆనందం నాలో కలిగెను ఈ ఉదయం.. (మాంగల్యబలం)  


చదువురానివాడవని దిగులు చెందకు.. (ఆత్మబంధువు)  



స్వరములు ఏడైనా రాగాలెన్నో 
హృదయం ఒకటైనా భావాలెన్నో (తూర్పు పడమర) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8004 


కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా 
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా (భాగ్యలక్ష్మి) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8722 


పాడనా తెనుగు పాట పరవశనై మి ఎదుట మీ పాట (అమెరికా అమ్మాయి) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4706 


ఆడజన్మకు ఎన్ని శోకాలో (దళపతి) 
http://www.raaga.com/player4/?id=1228&mode=100&rand=0.17349233811214215 


మీ నగుమోము నా కనులారా.. (బడిపంతులు) 
http://www.raaga.com/player4/?id=192007&mode=100&rand=0.6423371311763365 

బూచాదమ్మా బూచాడు.. (బడిపంతులు) 
http://www.raaga.com/player4/?id=192009&mode=100&rand=0.18513762415649937 


ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది (సంపూర్ణరామాయణం) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7848 


అలిగినవేళనే చూడాలి.. (గుండమ్మ కథ) 
http://www.raaga.com/player4/?id=164245&mode=100&rand=0.49423574398814096 

Saturday, November 9, 2013

हमारी साँसों में आज तक वो..




"सदा जो दिल से निकल रही है वो शेर- ए-नग्मॊं में ढल रही हैं.." అనే వాక్యం పదే పదే గుర్తుకువస్తోందివాళ. చక్కని ఈ గజల్ ను ఇద్దరు ప్రముఖ గజల్ గాయకులు ఓ సినిమా కోసం పాడారు.


 "మేరే హుజూర్(1977 )" అనే పాకిస్తాని ఉర్దూ చిత్రం కోసం గాయని 'నూర్ జహాన్' ఈ గజల్ పాడారు. 'Malika-e-Tarannum'  అనే బిరుదు పొందిన నూర్జహాన్ నటి, గాయని కూడానూ! ఒక విలక్షణమైన గొంతు ఆమెది. 'తస్లీమ్ ఫజ్లీ' సాహిత్యాన్ని అందించిన ఈ గజల్ కు 'ఎం.అషారఫ్' సంగీతాన్ని సమకూర్చారు. అదే సినిమా కోసం గజల్ రారాజు 'మెహదీ హసన్' కూడా ఇదే గజల్ పాడారు. 


సినిమాలోని రెండు గజల్స్ ఇక్కడ చూడచ్చు:
female version: 
http://www.youtube.com/watch?v=gMARk6-haOw
male version: 
http://www.youtube.com/watch?v=dTQwVmdhBHw

noorjahan:
 



"మెహదీ హసన్" గజల్ :

 


సాహిత్యం:

हमारी साँसों में आज तक वो हीना की खुशबू महक रही है
लबों पे नग्मॆं मचल रहे हैं नज़र से मस्ती छलक रही है

वो मेरे नज़दीक आते आते हया से एक दिन सिमट गए थे
मेरे खयालों में आज तक वो बदन की डाली लचक रही है

सदा जो दिल से निकल रही है वो शेर- ए-नग्मॊं में ढल रही हैं
के दिल के आँगन में जैसे कोई ग़ज़ल की झांझर झलक रही हैं

तड़प मेरे बेकरार दिल की कभी तो उन पे असर करेगी
कभी तो वो भी जलेंगे इसमें जो आग दिल में दहक रही है

Friday, November 8, 2013

పాట వెంట పయనం : 'వెన్నెల'




“కార్తీకమాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది…”
అంటారు తిలక్ మహాశయులు తన ‘వెన్నెల’ కవితలో!

సినీకవులు వర్ణించిన మరిన్ని వెన్నెల సోయగాలను కళ్ళలో నింపుకుందాం… 'పాట వెంట పయనానికి' నాతో రండి మరి…

http://www.saarangabooks.com/magazine/2013/11/07/%E0%B0%AA%E0%B0%97%E0%B0%B2%E0%B1%87-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%97%E0%B0%AE%E0%B1%87-%E0%B0%8A%E0%B0%AF%E0%B0%B2/


Thursday, November 7, 2013

వంటింటి రాణికి వీడ్కోలు..





డభ్భై ఆరేళ్ళ తృప్తికరమైన జీవితం చాలాకొద్దిమందికే దొరికే ఒక వరం! అటువంటి కొద్దిమంది అదృష్టవంతుల్లో Tarla Dalal ఒకరు! "తర్లా దలాల్" అనగానే కాన్ఫిడెంట్ గా కనబడే నవ్వు మొహం, భుజాల దాకా పొట్టిగా ఉండి ఎగిరుతూండే జుట్టు ఠక్కున గుర్తుకువస్తాయి. టివిలో ఎక్కడ చూసినా ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూనే కనబడేవారావిడ.
పద్మశ్రీ గ్రహీత, సెలబ్రిటీ షెఫ్, బెస్ట్ సెల్లింగ్ కుక్కరీ ఆథర్స్ లో ఒకరైన తర్లా దలాల్ ఇక లేరన్న వార్త పొద్దున్నే నన్ను పాత జ్ఞాపకాల అలల్లోకి నెట్టెసింది..


 కాలేజీ రోజుల్లో షెఫ్ సంజీవ్ కపూర్ షో "ఖానా ఖజానా", "కుక్ ఇట్ అప్ విత్ తర్లా దలాల్", "తర్లా దలాల్ షో", స్టార్ ప్లస్ లో "మిర్చ్ మసాలా" మొదలైన కుక్కరీ షోస్ అన్నీ వదలకుండా చూసేదాన్ని. అసలు నాకు వంటింటి మీద ఆసక్తి కలిగించినవి ఈ టీవీ షోసే! నచ్చిన రెసిపీనల్లా డైరీల్లో నింపేసి; మధ్యాహ్నాలు అమ్మ నిద్దరోతున్నప్పుడు వంటింట్లోకి పిల్లిలా దూరి తోచిన ప్రయోగాలన్నీ చేసేస్తు గడిపేసిన కులాసా రోజులు గుర్తుకువచ్చాయి. నెట్లో వెతికి రాసుకున్నవి, ఇంకా తర్లా దలాల్ వెబ్సైట్లోంచి రాసుకున్నవీ, వాల్డెన్ లో కొన్న తర్లా దలాల్ కుక్బుక్స్ లోని రెసిపీలు అన్నయ్య సెలవలకి వచ్చినప్పుడల్లా నేను,వాడూ కలిసి వంటింట్లో చేసిన లెఖ్ఖలేనన్ని ప్రయోగాలు.. గుర్తుకువచ్చాయి! సంజీవ్ కపూర్ చెప్పే విధానం బాగా నచ్చితే, తర్లా దలాల్ చెప్పే వైవిధ్యమైన రెసిపీలు, హెల్దీ రెసిపీలు మా ఇద్దరికీ నచ్చేవి. ఏదైనా రిలయబుల్ రెసిపీ కావాలంటే ఇప్పటికీ నేను తర్లా దలాల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతుకుతాను. నిన్న రాత్రి కూడా యాదృఛ్ఛికంగా నేను ఆవిడ వెబ్సైట్లో ఒక రెసిపీ వెతికాను..!



 "She lived a happy, successful and fulfilling life" అన్నడుట ఆవిడ కుమారుడు దీపక్ దలాల్. అతను కూడా రచయిత. బోలెడు పిల్లల పుస్తకాలు రాసాడు. కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడైన వంద పైగా కుక్ బుక్స్, అంతేకాక తను ఫస్ట్ ఫైవ్ బెస్ట్ సెల్లింగ్ కుక్కరీ ఆథర్స్ లో నిలబడగలగడం.. ఆమెకు ఎంత తృప్తిని ఇచ్చి ఉంటుంది..!! ఆవిడ ఆత్మకు శాంతిని నేను కోరేదేమిటి... she deserves it..! కానీ ఆవిడ మాటలు కొన్నింటిని నేను తలుచుకుని, ఇంకా ఆవిడంటే ఇష్టం ఉన్నవారెవరైనా చూస్తారని ఇక్కడ పెడుతున్నాను.. తర్లా దలాల్ ఇంటర్వ్యూ ఒకటి sify.com వెబ్సైట్లో దొరికింది.. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న లింక్ లో ఆ ఇంటర్వ్యూ చూసేయండి..

http://videos.sify.com/with-Tarla-Dalal-SIFY-watch-Rendezvous-watch-klmq4hifgje.html



Friday, November 1, 2013

చలువపందిరి - దిఖాయీ దియే యూ..






  “గజల్స్ ఫ్రమ్ ఫిల్మ్స్” అని లతా పాడిన ఓ పాతిక గజల్స్ ఉన్న ఆల్బం(రెండు కేసెట్లు) కొన్నారు నాన్నగారు నా కాలేజి రోజుల్లో. నా ఫేవొరేట్ ఆల్బంస్ లో ఒకటి అది. ఆ గజల్స్ లో వాడిన ఉర్దూ పదాలకు అర్థాలు తెలియకున్నా అవన్నీ నాకెంతగానో నచ్చేవి.  కొన్నళ్ళయ్యాకా డిక్షనరీ కొనుక్కుని మరీ ఆ ఉర్దూ పదాలకు అర్థాలు వెతుక్కుని, అర్థాన్ని ఆస్వాదిస్తూ ఆ గజల్స్ వినేదాన్ని. అసలా భాషకున్న మధురిమవల్లనే అనుకుంటా ఓ చిత్రకథానాయకుడు “జిస్కీ జుబా ఉర్దు కీ తర్హా..” అని నాయికను వర్ణిస్తూ పాడతాడు! అలా నే పదే పదే వింటూ వచ్చిన ఆ సినీ గజల్స్ ఆల్బంలోదే ‘Bazaar’ చిత్రంలోని “దిఖాయీ దియే యూ..” అన్న గజల్. నాకెంతో ప్రియమైన పాటల జాబితాలోది. 




వినేకొద్ది వినాలనిపించే ఈ గజల్ లో దాదాపు అన్నీ ఉర్దూ పదాలే. పాటల డైరీలో రాసుకున్న గజల్ లోని ప్రతి పదానికీ అర్థం రాసుకుని, మొత్తం అర్థాన్ని గ్రహించటానికి ప్రయత్నించేదాన్ని అప్పట్లో. ఆ ఇష్టంతోనే ఈ సిరీస్ లో ఈ పాట గురించి రాయడానికి సాహసిస్తున్నా...

పాట గురించిన మిగతా కబుర్లు ఇక్కడ:
http://vaakili.com/patrika/?p=4155