సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, August 7, 2013

mesmerizing 'Rekha Bharadwaj' !





కొన్ని పాటలు వినగానే ఎంతో నచ్చేస్తాయి. పాటలో మనకి నచ్చినది పాడిన విధానమా, సాహిత్యమా, సంగీతమా అన్నది పట్టించుకోకుండానే ఆ నచ్చిన పాటల్ని మళ్ళీ మళ్ళీ వినేస్తూ ఉంటాము. అలా నాకు నచ్చి ఎక్కువగా నే విన్న కొన్ని హిందీ పాటలు .. 'మాన్సూన్ వెడ్డింగ్' లో గేందా ఫూల్, 'యే జవాని హై దివాని'లో కబీరా, 'బర్ఫీ 'లో ఫిర్ లే ఆయా, 'సాత్ ఖూన్ మాఫ్' లో డార్లింగ్, 'Ishqa Ishqa' album లోని తెరే ఇష్క్ మే, 'డి డే' లో ఎక్ ఘడి... వీటన్నింటిలో డి డే లో ఎక్ ఘడి ఈమధ్య బాగా వింటుంటే ఈ పాటలన్నింటిలో నాకు బాగా నచ్చినదేమిటో తెలిసింది.. అది "రేఖా భరద్వాజ్" స్వరం. 


వినే కొద్ది వినాలనేలా, తియ్యగా, అందంగా, కాస్తంత హస్కీగా, సుతారంగా, రాగయుక్తంగా, కాస్త హిందుస్తానీ శాస్త్రీయసంగీతపు రంగుపులుముకున్న ఆమె గొంతు నన్ను బాగా కట్టిపడేసింది. ఒక్కమాటలో మెస్మరైజింగ్ అనచ్చు! గుల్జార్ స్వయంగా ఆమె ఆల్బంకు లిరిక్స్ రాస్తానని చెప్పరంటే ఎంత ఇంప్రెస్ అయిఉంటారో ఆమె గాత్రానికి అనిపించింది. గత వారం రోజులుగా నెట్లో రేఖ పాడిన పాటలన్నీ వెతుక్కుని వెతుక్కుని వింటున్నా! ఓహో ఇదివరకు నాకు నచ్చిన పాటలన్నీ ఈవిడ వాయిస్ వల్ల అంతగా నచ్చాయన్నమాట అనుకుంటున్నా! రేఖ భరద్వాజ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత, సినీదర్శకుడు విశాల్ భరద్వాజ్ భార్య అని వికీలో  చదివి ఇంకా ఆనందించా! "మాచిస్" పాటలు విన్నప్పటి నుండీ విశాల్ నా ఫేవొరేట్ మ్యూజిషియన్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అతని పాటలు బాగా నచ్చుతాయి నాకు. ఆ ఒక్క సిన్మా పాటలు చాలు తన టాలెంట్ తెలియటానికి. అందులో "పానీ పానీ రే" I, "ఛోడ్ ఆయే హమ్ వో గలియా.."  రెండూ నాకెంతో ప్రియమైన పాటలు. భార్యభార్తల్లో ఒకరు ఒక గాయని, ఒకరు స్వరకర్త. ఎంత చక్కని కాంబోనో :) 


హిందీలో రేఖ పాడినవి చాలా తక్కువ పాటలు. వాటిల్లో తొంభై శాతం భర్త విశాల్ స్వరపరిచిన పాటలే అయినా చాలావరకూ మంచి పాటలు ఎంపిక చేసుకుందనే చెప్పాలి. తన వాయిస్ వినగానే శాస్త్రియ సంగీతంలో బాగా శిక్షణ ఉన్నట్లు తెలిసిపోతుంది. మ్యూజిక్ స్టూడెంట్ ట మరి ! అన్ని రకాల పాటలకు కాక కొన్ని ప్రత్యేకమైన పాటలకే తన వాయిస్ బాగా సూట్ అవుతుంది. అలాంటివే ఆమె పాడింది కూడా. "ఇష్కియా" లో పాటకు బెస్ట్ ఫీమేల్ సింగర్ ఫిల్మ్ ఫేర్ ను కూడా అందుకుంది. రేఖ ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలనీ, గొప్ప గాయనిగా పేరు పొందాలని కోరుకుంటున్నాను.. 


హిందుస్తానీ సంగీతం నచ్చేవాళ్ళకు రేఖ వాయిస్ నచ్చుతుంది. నాకులా ఇష్టంగా వినేవాళ్ళెవరైనా ఉంటారని రేఖా భరద్వాజ్ పాడిన కొన్ని పాటల లింక్స్ క్రింద ఇస్తున్నాను: 

ఈ పాట ఎంత రమ్యంగా ఉందో వినండి... 
1) Ab Mujhe Koi - Ishqiya - Vishal Bhardwaj 

 


2) Ek Woh Din Bhi - Chachi 420 - Vishal Bhardwaj 
http://www.youtube.com/watch?v=WdRrO19p5_0 


3) Ye Kaisi Chaap Jahan Tum Le Chalo Vishal Bhardwaj 
http://www.youtube.com/watch?v=-6YOmSxiq4E 


4) Rone Do Maqbool - Vishal - Bhardwaj 
http://www.youtube.com/watch?v=38GwCykLckE 


5) Laakad - Omkara - Vishal Bhardwaj 
http://www.youtube.com/watch?v=Zl_cIeqJxJg 


6) Sadiyon Ki Pyaas  - Red Swastik - Shammir Tandon
http://player.raag.fm/player/?browser=flash&pick[]=191951


7) jaan veh   -  Haal–e–dil  -  Vishal Bhardwaj
 http://www.youtube.com/watch?v=wze4xOsO7JY 


 8) Kabira - Yeh Jawaani Hai Deewani - Pritam 
http://www.youtube.com/watch?v=m7poxLIFrVk 


9) Ranjha Ranjha - Raavan  - A.R.Rahman
 http://www.youtube.com/watch?v=-SwraHOtsLU 


 10) Namak Ishq Ka Omkara Vishal Bhardwaj
 http://www.youtube.com/watch?v=BVJ-tJ34bzQ 


 11) tere bin nayi lagda 
 http://www.youtube.com/watch?v=H4T6QSSpD-k 


12) Darling - 7 Khoon Maaf  - Vishal 
http://www.youtube.com/watch?v=kZCAb5XXn6s 


14) Kabira Yeh Jawaani Hai Deewani Pritam
 http://www.youtube.com/watch?v=m7poxLIFrVk 


15) wakt ne jo beej boya - Sadiyaan - adnan sami
http://www.youtube.com/watch?v=89ccypfyG2Y


గుల్జార్ ,విశాల్,రేఖ ల మ్యుజికల్ ఆల్బమ్ "ఇష్కా ఇష్కా" లో గుల్జార్ రాసిన పాటలన్నీ బాగుంటాయి. 
అందులోవి: 
16) tere ishq mein Ishqa Ishqa album 
http://www.youtube.com/watch?v=yhAl-29SBQ8 

17) raat ki jogan Ishqa Ishqa album 
http://www.youtube.com/watch?v=Y9ruX1Nu2m8 


18) Badi Dheere Jali  - Ishqiya - Vishal Bhardwaj

   


19) Phir Le Aaya Dil Barfi Pritam




 20) D-Day - Ek ghadi - Shankar-Ehsaan-loy 



21) Behne do - Shala - Alokananda dasgupta

3 comments:

శ్రీనివాస్ said...

Thank you for introducing a good singer and for providing links to her songs.

నిషిగంధ said...


ఇష్కియా లోని 'బడీ ధీరే జలీ' పాట విన్నదగ్గర్నించీ నేను రేఖ వాయిస్‌కి వీరపంఖా అయిపోయానండీ.. తన గొంతులో ఆ సన్నపాటి జీర ఎంతనచ్చుతుందో నాకు!
థాంక్స్ ఫర్ ద లిస్ట్.. అన్నీ సూపర్ సాంగ్స్ అసలు!

అవునూ, ఓంకార లో 'ఓ సాథి రే ' పాడింది శ్రేయా కదా!?

తృష్ణ said...

@శ్రీనివాస్: ధన్యవాదాలు.

@nishiji,అవునండోయ్.. పొరబడ్డాను..Thank you :) మిగతా రెండూ తనే పాడే సరికీ ఇదీ తనే అనుకుంటున్నా. లిస్ట్లో వేరే పాట చేర్చా చూడండి.'రెడ్ స్వస్తిక్' లోది. ఈ లిస్ట్ లో పాటలన్ని ఒకచోట చేసుకోండి. వినటానికి చాలా బాగున్నాయి. I'm enjoying.