సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, December 1, 2014

నవలా నాయకులు - 12



కౌముదిలో 'నవలా నాయకులు' సిరీస్ లో ఆఖరి ఆర్టికల్...’చివరకు మిగిలేది’ నుండి..
http://www.koumudi.net/Monthly/2014/december/dec_2014_navalaa_nayakulu.pdf


ఇన్ని నెలలూ ఆర్టికల్ రాసిన వెంఠనే.. 'చదువుతా విని ఎలా ఉందో చెప్పండని' ఫోన్లో నాన్ననూ, ఇంట్లో మావారినీ కూచోపెట్టి అన్ని ఆర్టికల్స్ వాళ్ళకి వినిపించిన తర్వాతే పంపేదాన్ని! అలా ఓపిగ్గా వినీ నాకు ప్రోత్సాహాన్ని అందించిన వారిద్దరికీ బోలెడు థాంక్యూలు :) మొదట్లో కొన్ని నెలలు నెలలో మూడు ఆర్టికల్స్ రాసిన సమయంలో కూడా ఎంతో ఓపిగ్గా నన్ను, నా clumsinessనీ భరించిన శ్రీవారికి ఈ సిరీస్ తాలూకూ నాకొచ్చిన ప్రశంసలన్నీ చెందుతాయి. 

నాపై నమ్మకంతో ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన కౌముది ఎడిటర్ కిరణ్ ప్రభ గారికి బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు.

2 comments:

..nagarjuna.. said...

చాలా comprehensive గా ఉంది మీ పోస్ట్. తెలుగులో చదివిన మొదటి 'మనోవైజ్ఞానిక‌‌'నవల అయినందుకో లేక చదివినపుడు నా వయసు అలాంటిది కనకనో 'చివరకు మిగిలేది‌‌' బాగా నచ్చింది. దయానిధి, అమృతం, కోమలి, పైకి సరదాగా కనపడే జగన్నాథం పాత్రలు లోతుబావిలోకి చేద వేసి నీటిని తోడేస్తున్నట్టు సంఘం, బంధాలపై మనసు మూలల్లో ఎక్కడో దాగిన మన అవగాహనలనూ, అభిప్రాయాలనూ ఒకసారి review చేసేలా చేస్తాయి. ఈ పుస్తకం పై అభిప్రాయాలూ, విశ్లేషణలూ చదువుతుంతే అర్దం చేసుకోవాల్సింది ఇంకా మిగిలింది అనిపిస్తుంది..

ఈ సిరీస్‌‌లో మీరు రాసిన మిగతా పోస్ట్‌‌లు చదవలేదు. వీలు చేసుకొని చదవాలి అవి కూడా. thanks for this post.

తృష్ణ said...

Thanks for the comment nagarjuna.