సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 19, 2010

పరికిణీ !!




పరికిణీ


"....స్వప్నాల డాబా మీద
నాలుగు చెరుగులూ పరిచి
కుర్రకారు గుండెల్ని
’పిండి’ వడియాలు పెట్టేసిన
జాణ - ఓణీ !!
ఓణీ... పరికిణీ...
తెలుగు కన్నెపిల్లకు
అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి ...
ఓణీయే ఓంకారం !!
పరికిణీయే పరమార్ధం !! "


౮౮౮౮౮ ౮౮౮౮౮ ౮౮౮౮౮


మా ఆవిడకి మంత్రాలొచ్చు !!


ఏడ్చే పసివాడికి
పాలసీసా అయిపోతుంది !
అత్తగారి నడ్డి కింద
పీటైపోతుంది.
మామగారికి కాఫీ
ప్లాస్కయి పోతుంది...
రాత్రి పదగ్గదిలో
నాకు - రగ్గైపోతుంది
ప్రొద్దున్నే వాకిట్లో
ముగ్గై పోతుంది..
మా ఆవిడకి మంత్రాలొచ్చు...


౮౮౮౮౮ ౮౮౮౮౮ ౮౮౮౮౮


మధ్యతరగతి నటరాజు


30 - ఫస్ట్ నైట్ !!


చీర


మూసీనది


నవర’సావిత్రి’


రేఖ


స్వర్గం నుంచి నాన్నకి !



...ఇంతకన్నా ఈ పుస్తకానికి వేరే పరిచయాలవసరం లేదు.
చదివే ప్రతి కవిత మనసుని కదిలిస్తుంది. సామాన్య మధ్యతరగతి బ్రతుకుల్ని ఫ్రేమ్ లో బిగించి చూపిస్తుంది.
అక్షరాన్ని ప్రేమించే ఎవరైనా చదివి తీరాల్సిన పుస్తకం...తనికెళ్ళ భరణి గారి "పరికిణీ".



12 comments:

jaggampeta said...

bavundhi

ఇందు said...

nice introduction......essence of the poems is wonderful :)

కొత్త పాళీ said...

good show.
కవర్ పేజి చాలా బాగుంది

సి.ఉమాదేవి said...

మూడే మూడు ముత్యాల్లాంటి కవితలతో భరణిగారి కవితా సంపుటి పరికిణీ పరిచయం ఆసక్తిదాయకంగా వుంది.

తృష్ణ said...

ఉమాదేవిగారూ, రెండు కవితల తరువాత ఉన్నవి పుస్తకంలోని కొన్ని మంచి కవితల పేర్లండి. టపాలో నేను మెన్షన్ చేయలేదు...

వేణూశ్రీకాంత్ said...

కవితలూ కవర్ పేజీ రెండూ బాగున్నాయ్.

తృష్ణ said...

@venu srikanth: thank you.

Satya said...

painting is beautiful akka ..u r suberb akka...gr8 work

Satya
http://www.superyummyrecipes.com

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Wonderful poems.

జ్యోతి said...

Thanks for sending me the links Trishna gaaru.Naa daggara ee books levu. Next time evaraina Hyd nundi vastunte teppinchukuntanu.
Sorry for leaving this message in Tenglish:)

తృష్ణ said...

@కొండముది సాయికిరణ్ కుమార్: పుస్తకం తప్పక కొనుక్కోండి. చాలా బాగుంటాయి కవితలు.

@మెహక్: థాంక్యూ టూ..!!

తృష్ణ said...

@జగ్గంపేట:
@ఇందు:
@కొత్తపాళీ:
@ఉమాదేవి
@వేణూశ్రీకాంత్
@సత్య:

టపాకు వ్యాఖ్యలందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.