భాష తెలీదు.. ఒక్క ముక్క అర్థం కాదు కానీ ఆ రాగం.. ఆ పదాలు.. ఎందుకో మనసుకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి. రికార్డ్ అయిన కేసెట్స్ వచ్చాకా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వెనక్కి తిప్పుకుని వినేదాన్ని..!
ఇళయరాజా ఏం చేసినా మహాప్రసాదం. పాడినా అంతే. ఆయన గళం నచ్చనివారూ ఉన్నారు. కానీ నాకు ఆయన పాడిన పాటలన్నీ కూడా ఇష్టమే. "కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక తిరుగుతున్నవి.. ముంచే మైకమో మురిపించే మోహమో.." అని పాడినప్పుడు కూడా :)
ఈ పాటలో జానకి స్వరం.. ఇళయరాజా బాణీ.. రెండూ మహదానందాన్ని కలిగించేవే..i just love this song..