Yes, its a tribute to all our secret agents who risk their lives for the sake of our country. Their sacrifices are worthy, but the saddest part is that they die unknown. మనకు తెలిసి దేశం కోసం పోరాడేది దేశ సైనికులైతే, తెలియకుండా దేశాన్ని రక్షించే రహస్య గూఢచారులు ఎందరో ఉంటారు. చాలామంది చేసే త్యాగాలు ప్రజలకు తెలియకుండానే ఉండిపోతాయి. దేశ రక్షణ కోసం తమ జీవితాలను పణంగా పెట్టే అటువంటి గుర్తు తెలియని వీరుల కోసం ఒక్కసారి తప్పక చూడాలి అనిపించే సినిమా D-Day!
కజిన్స్ అందరూ కలవాలని ప్లాన్ చేసుకుని ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసారు. శనివారం రాత్రి షో, అదీ సీరియస్ మూవీ అనేసరికీ నాకు కొంచెం బోర్ గా అనిపించింది. కానీ అందరిని కలవాలనే ఉద్దేశంతో ఓకే చెప్పేసి బయల్దేరాం. హాఫ్ హర్టెడ్ గా సిన్మా హాల్లో కూచున్న నేను మూవీ మొదలైన పదినిమిషాల్లో బాగా లీనమైపోయాను. ఆసక్తికరమైన కథనంతో, చక్కని ఏక్షన్ సన్నివేశాలతో, చివరిదాకా ఉత్కంఠం రేపుతూ సాగింది సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు.
'నిఖిల్ అద్వానీ' దర్శకత్వం వహించిన ఐదు(?) సినిమాల్లో నేను 'Kal ho naho', 'salaam-e-ishq'.. రెండే చూసాను. ఆ రెండుంటికన్నా ఎన్నో రెట్ల పరిపక్వత కనపడింది ఈ సినిమాలో. చిన్నప్పటి దూరదర్శన్ సిరియల్స్ రోజుల్నుండీ ఇర్ఫాన్ ఖాన్ మంచినటుడన్న అభిప్రాయం. సినిమాల్లోకొచ్చాకా అతని ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది అనుకుంటుంటాను నేను. నటినటులందరూ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. నలుగురు సీక్రెట్ ఏజంట్లుగా ఇర్ఫాన్, అర్జున్ రాంపాల్, హ్యూమా ఖురేషీ, కొత్త నటుడు సందీప్ కులకర్ణీ; గోల్డ్ మాన్ 'ఇక్బాల్ సేఠ్' గా రిషి కపూర్, ఇర్ఫాన్ వైఫ్ గా వేసిన అమ్మాయి అందరూ కూడా పోటీపడి నటించారా అనిపించింది. ముఖ్యంగా అర్జున్ రామ్ పాల్ చాలా బాగా చేసాడు. ఇర్ఫాన్ ఖాన్ ఫ్యామిలితో ఉండే సీన్స్ ఇమోషనల్ గా ఉన్నాయి.
ఊహించని మలుపులు తిరుగుతూ కథనం సాగిన తీరు బాగుంది. ఉద్వేగానికి లోనైనా చివరిసమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు వాలీ ఖాన్(ఇర్ఫాన్ ఫాన్). క్లైమాక్స్ లో ఇక్బాల్ ఖాన్(రిషి కపూర్), రుద్ర్ (అర్జున్ రామ్ పాల్) ఇద్దరూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.. ఆలోచింపజేస్తాయి. నాజర్ బాగా చేసాడు, కష్టపడి తన డైలాగ్స్ తనే చెప్పుకున్నాడు కానీ అతని హిందీ ఏక్సెంట్ పూర్ గా ఉంది. డబ్బింగ్ చెప్పించాల్సింది లేదా అతనొక సౌత్ ఇండియన్ ఆఫీసర్ అని చూపించాల్సింది. శృతి హాసన్ రోల్ చిన్నదే అయినా బాగా చేసింది. అయితే కథకు ఏ మాత్రం ఉపయోగపడని ఆ పాత్ర అనవసరమేమో అనిపించింది. ఇక సినిమాలో ఉన్న మరో మెరుపు 'రాజ్ పాల్ యాదవ్'. కమిడియన్ గా పేరుపొందిన రాజ్ పాల్ తన నటనాకౌశలాన్ని mein meri patni aur woh ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో "దమాదమ్ మస్త్ కలందర్" పాడే ఉత్సాహావంతమైన గాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తాడు.
'శంకర్-ఎహ్సాన్-లాయ్' అందించిన నేపధ్యసంగీతం బాగుంది. సీరియస్ మూవీలో పాటలు ఎందుకసలు అనిపించింది. "అల్విదా" పాట సాహిత్యం బాగుంది కానీ శృతి మరణవిధానాన్ని తెలిపే నేపథ్యంలో ఆ పాట పెట్టడం నాకైతే నచ్చలేదు. సంగీత దర్శకుడు 'విశాల్ భరద్వాజ్' భార్య 'రేఖ భరద్వాజ్' పాడిన "ఏక్ ఘడీ" పాట నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. ఆ రెండు పాటల లింక్స్ క్రింద ఇస్తున్నాను...
* alvida
* ek ghadi
'D-Day' tralier: