కేసెట్ లో అన్ని పాటలు ఒక ఎత్తు ఐతే "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో " పాట ఒక ఎత్తు. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి. నిజంగా షాజహాన్ అంత హాయిగా నిదురించాడో లేదో తెలీదు కానీ ఈ పాట వింటున్నంత సేపు మనం మాత్రం హాయిగా సేదతీరుతాము.
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..
పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా ..
నీ జీవితజ్యోతీ నీ మధురమూర్తి
ముంతాజ్ సతిసమాధి సమీపాన
నిదురించూ జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..
----------------
ప్రేమ వెలిసింది మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవనలా
------------------
మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం..
-------------------
ఘల్లు ఘల్లున గుండె ఝల్లునా
పిల్లఈడు తుళ్ళిపడ్డదీ
మనసుతీరగా మాటలాడక మౌనం ఎందుకన్నదీ
-------------------
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మరిచిన మమతొకటి
మరి మరి పిలిచినది
ఒక తియ్యనీ పరితాపమై
---------------------
నాప్రేమకే శలవు నా దారికే శలవు
కాలానికే శలవు దైవానికే శలవు
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శలవు
మదిలోని రూపం మొదలంట చెరిపి
మనసారా ఏడ్చానులే ((నాప్రేమకే))
కనరాని కసితీర కుదిపి కడుపారా నవ్వానులే
అనుకున్న దీవి అది ఎండమావి
ఆ నీరు జలతారులే
నను నీడ తానే ననువీడగానే
మిగిలింది కన్నీరులే ((నాప్రేమకే))
---------
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏజన్మ కైనా ఇలాగే..
----------------
మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం
------------------
ఇంకా "ఊహల ఊయలలో", "నేనే సాక్ష్యాము", "నీ వదనం విరిసే కమలం" పాటలు దొరకలేదు...:(
కానీ రాగా.కాం లింక్ లో మొత్తం పది పాటలూ వినచ్చు: