రెహ్మాన్ స్వరాలనందించిన కొత్త ఆల్బమ్ ఒకటి "రౌనక్" పేరుతో రాబోతోంది. అందులో శ్రేయా ఘోషాల్ మధురంగా ఆలపించగా మొదటి పాటను నిన్న రిలీజ్ చేసారు. ఈ ఆల్బంలోని గీతాలకు ఒక యూనియన్ మినిస్టర్ సాహిత్యాన్ని అందించడం విశేషం. ఆల్బమ్ తాలూకూ మిగతా వివరాలు ఇక్కడ చదవచ్చు.
పాట కన్నా సంగీతం నన్ను బాగా అలరించింది. ముఖ్యంగా రెహ్మాన్ గిటార్స్ వాడిన తీరు నాకు బాగా నచ్చింది.. మరి శ్రేయా స్వరమధురిమలనూ, రెహ్మాన్ జాదూనీ మరోసారి ఆస్వాదించేద్దామా...