"నా హృదయంలో నిదురించే చెలీ(1999)" అనే సినిమాలో రెండు పాటలు చాలా బావుంటాయి. అప్పట్లో బాగా వినేవాళ్ళం. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడైన "శ్రీ" సంగీతాన్ని అందించిన ఈ పాటలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. గాయం, మనీ, మనీ మనీ, సింధూరం, లిటిల్ సోల్జర్స్ మొదలైన సినిమాలకు మంచి సంగీతాన్నందించిన "శ్రీ" కొద్దిపాటి చిత్రాలకే సంగీతాన్నందించటం విచారకరం. ఇతర భాషా సంగీత దర్శకుల పట్ల మనవారికి ఉన్న మోజు దీనికి కారణం కావచ్చు.
అంతే కాక ఈ సినిమాలో 'ఓ చెలీ నను వీడిపోకే' అనే పాట పాడిన కన్నడ అబ్బాయి రాజేష్ కృష్ణన్ వాయిస్ చాలా బావుంటుంది. "ఎటో వెళ్ళిపోయింది మనసు ' అంటూ పాడి తెలుగువారి మనసు దోచేసిన ఈ గాయకుడు తెలుగులో ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నా.
పాడినది: S.P.బాలసుబ్రహ్మణ్యం
download link for this song:
నా హృదయంలో నిదురించే చెలీ
నీ హృదయంలో చోటిస్తావా మరి
పల్లవిగా నన్ను అల్లుకుని పాటే నీవైనావే
((నా హృదయంలో))
ప్రేమించే మనసుందనీ ఈనాడే అది తెలిసింది
ప్రేమకు భావన నీవనీ ఆ మనసే వివరించింది
మధురమైన నా ఊహల్లో రేయిపవలు నిలిచావమ్మా
కమ్మని ఓ నిజమవమంటూ కలలే అకంటున్నా
((నా హృదయంలో))
నేనంటే అది నీవనీ కనుపాపలు కబురంపాయి
నీవెంటే నా పయనమని కల కవితలు వరమిచ్చాయి
పదిలమైన నా హృదయంలో గుడిని నీకు కడతానే
ఇంకెవ్వరికీ చోటివ్వననీ మాటే ఇస్తున్నానే((నా హృదయంలో))
------------------------------------------------------------
song: 'ఓ చెలీ నను వీడిపోకే'
పాడినది: రాజేష్ కృష్ణన్
రచన: వెన్నెలకంటి
download link for this song:
ఆశలే వసివాడనీకే
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
((ఓ చెలీ))
ఇన్నాళ్ళూ కలగన్నా ఆశే తీఋఅగా
నేనే నువ్వనీ నువ్వే నేననీ, బాసే తీరగా
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
((ఓ చెలీ))
నిరాశే లేని నివాసానికీ
నన్నొదిలి ఒంటరిగా వెళిపోరాదమ్మా
దేహం వీడినా ప్రాణం నీవుగా
వెళిపోతే, బ్రతుకంతా ఇకపై శూన్యమే
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
((ఓ చెలీ))