Oct 21, 11.30a.m
రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ !!
పశ్చిమగోదావరి జిల్లా, తణుకు తాలూకా ఖండవల్లి గ్రామం. అతి చిన్న పల్లేటూరు. ఊళ్ళో "శిష్ఠావారిల్లు" అంటే బోలెడు గౌరవం. ఈ వీధి నుంచి ఆ వీధి వరకూ వ్యాపించిన ప్రహారి గోడతో పెద్ద ఇల్లు. ఈ ఇంటి తాలుకు కధలో ప్రస్తుతానికి నేను రాయబోయేది "రామం" ఒక్కడి గురించే. శిష్ఠా పురుషోత్తంగారి నాలుగవ కుమారుడు "సత్యనారయణ". ఆయన ఏకైన కుమారుడు భాస్కర శ్రీరామ్మూర్తి. ఊళ్ళో అందరూ రావుడు అని పిలిచేవారు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం "రాంబాణం" అని పిలిచేది. మనవడు పాకుతూంటే మోకాళ్ళు గీసుకుపోతున్నాయని దొడ్దంతా గచ్చు చేయించిన వెర్రి అప్యాయత ఆమెది.
తెల్లటి తెలుపుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే అందమైన రూపం రాముడిది. దురదృష్టశాత్తు మూడవ ఏటనే తండ్రిని పోగొట్టుకున్న అతనికి ఇంట్లో ఆదరించే అందరూ ఆడవాళ్ళే. నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ, ఇద్దరక్కలు, మేనత్త. నాన్న,అన్న, తమ్ముడు, మావయ్యా.... ఇలా ఏ బంధాలూ లేవు. తెలియవు. తండ్రి ప్రేమ కానీ, మరో మగదిక్కు కాని లేని ఒంటరి పయనం అక్కడ నుంచే మొదలయ్యింది. తండ్రిని కోల్పోయిన మనవలనూ, లంకంత ఇంట్లో ఒంటరైన కుమార్తెకు తోడుగా ఉండటానికి రాముడి అమ్మమ్మ కూడా ఆ ఇంటికి వచ్చి, ఆ ఇంటివారి అనుమతితో ఓ గదిలో తన వంట తాను వండుకుంటూ అక్కడే ఉండిపోయారు. అమ్మమ్మకూ రాముడికీ ఎంతో అనుబంధం. నిత్యం పాతిక మందికి పైగా ఉండే ఇంట్లోని మనుషులకు వండి పెట్టే అమ్మ ఇంటి పనులతో, అత్తమామల సేవతో సతమతమౌతూ ఉంటే, రావుడికి అమ్మమ్మ బాగా చేరువైపోయింది. ఆవిడకు మనవడే లోకం. అలా తండ్రి లేని లోటు తప్పించి, ఇంట్లోని ఆడవారందరి చేతుల్లో గారంగా, అపురూపంగా గడిచిందతని బాల్యం.
తండ్రి కొని ఉంచిన గ్రామఫోన్ రావుడి ముఖ్య వినోద సాధనం. తణుకు వెళ్ళి ఆయన కొని తెచ్చుకున్న కర్ణాటక సంగీత గ్రామఫోన్ రికార్డులు, డ్రామా సెట్లు, హాస్య గీతాలు రావుడి మొదటి సంపద. తెలిసీ తెలియని జ్ఞానంతో మళ్ళీ మళ్ళీ అవన్నీ ప్లే చేసి వినేవాడు అతను. సంగీతం పట్ల ఆతని ఆసక్తి అక్కడ మొదలైంది. హై స్కూల్లో చేరాకా సైన్స్ పాఠాలు బాగా వంటబట్టాయి అతనికి. మధ్యాహ్నం అందరూ నిద్దరోతూంటే పాత సామాను పడేసిన తడికల గాదె లో దూరి, ఆ పాత సామానుతో సైన్స్ ఎక్స్పరిమెంట్లన్నీ చేసేవాడు. ఎండలో అద్దం పెట్టి, చిన్న్ చిన్న ఫిల్మ్ ముక్కలు ఆధారంగా గోడ మీద మూగ సినిమా సొంతంగా వేసేవాడు. అమ్మ నిద్రపోతుంటే మూగ సినిమా, మెళుకువగా ఉంటే గ్రామఫోన్ కూడా జోడించి నిజం సినిమా వేయటం.

ఊళ్ళోకి సినిమా వస్తే, ఆ సినిమా ప్రదర్శన గురించి మైకులో చెప్తూ జీప్ తిరిగేది. దాని వెనుక మిగతా పిల్లలతో పాటూ తానూ పరిగెత్తుతూ వెళ్ళేవాడు రావుడు. సినిమాల మీద కూడా అప్పుడే సరదా మొదలైంది. రావుడు ఎస్.ఎస్.ఎల్.సిలోకి వచ్చేదాకా కిర్సనాయిలు దీపాలే చదువుకి ఆధారం.
అప్పటిదాకా ఎవరింట్లోనూ రేడియో లేని ఆ ఊళ్ళో, రాముడు హైస్కూలుకు వచ్చే నాటికి వాళ్ల ఎదురిల్లైన మునుసబుగారి ఇంట్లో బ్యాటరీ రేడియో వెలిసింది. ప్రొద్దుటి పూట వాళ్ళ ఇంట్లోంచి రేడియో సిలోన్, ఆ తరువాత పురానే ఫిల్మోంకా లోక్ ప్రియ్ సంగీత్, శ్రోతల ఫర్మాయిషీ ఫిలిం గీతాలు వినిపిస్తుంటే గోడ పక్క నించుని అబ్బురంగా వింటూండేవాడు రావుడు. అదే రేడియోతో అతని మొదటి పరిచయం. మరో ఇరవైఏళ్ల తరువాత అదే జీవితంగా మారుతుందని అప్పుడతనికి తెలియదు. హైస్కూల్ చదువయ్యాకా కాలేజీ కోసం నెల్లూరు వెళ్లాడు అతను.
1961లో డిగ్రీ పూర్తయ్యేవరకూ నెల్లూరే అతడి వాసం. అతడికి తోడుగా వండిబెట్టడానికి అమ్మమ్మ తోడు వచ్చింది. ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే బుధ్ధుడికి బోధి వృక్షం లాగ రాముడికి నెల్లూరు విజ్ఞాన కేంద్రం అయ్యింది. అతని మనోవికాశానికి నాంది నెల్లూరే. సినిమాలు, పుస్తకాలు, పత్రికలు, స్నేహితులు అన్నీ అక్కడే పరిచయం. కమ్ సెప్టెంబర్, బేబీ ఎలిఫెంట్ వాక్, లవ్ ఈజ్ బ్లూ వంటి వెస్ట్రన్ మ్యూజిక్ రికార్డ్లు వినటం, కొనటం అక్కడే మొదలైంది.సొంతంగా బొమ్మలు వెయ్యటం, బుల్బుల్, షాహిబాజా, మౌత్ ఆర్గాన్, మాన్డొలీన్ మొదలైన సంగీత వాయిద్యాలను సొంతంగా నేర్చుకున్నదీ ఇక్కడే. తను బుల్బుల్ వాయించుకోవటానికి అప్పుడప్పుడు ఆ వాయిద్యాన్ని అరువుగా ఇచ్చే ఓ లాయరుగారు, అతను బాగా వాయించడం చూసి ఈ ఇన్స్ట్రుమెంట్ నువ్వే ఉంచేసుకో అని బహుమతిగా ఇచ్చేసారు.నలభై ఐదు సంవత్సరాల వయసున్న ఆ బుల్బుల్ ఇప్పటికీ భాస్కర్ దగ్గర ఉంది. ఇంకా వాయిస్తూనే ఉంటాడు.
అందుకే ఆ ఊరంటే అతనికి ఎంతో ప్రేమ, మమకారం. వాళ్ళ వి.ఆర్.కాలేజీ ఎదురుగా ఉండే లీలామహల్లో వచ్చిన ప్రతి సినిమా విడువకుండా చూసేవాడు. ఇంగ్లీషు సినిమాల పరిచయమూ అక్కడే. ఖండవిల్లి రాముడు కాస్తా స్నేహితుల పిలుపుతో "భాస్కర్"గా మారాడిక్కడ. నెల్లూరులో ఉండగానే మద్రాసులో ఒక సినీ స్టూడియోలో పనిచేసే బంధువు ద్వారా తరచూ సినిమా షూటింగులు చూస్తూ ఉండేవాడు. సినిమా అతని మీద బలమైన ముద్ర వేసింది. ఎలాగైనా సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి, మంచి టెక్నీషియన్ అయిపోవాలని ఉవ్విళ్ళూరేవాడు భాస్కర్.

(మొదటి భాగం పూర్తి..)