సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, September 28, 2010

మంచి మాట


మన ప్రాచీన గ్రంధాల్లోని మంచి సుభాషితాలు చాలా ఉన్నాయి. కొన్ని శ్లోకాలు, పద్యాలు మొత్తం తెలియకపోయినా వాటి తాలూకు మొదటి వాక్యమో, చివరి వాక్యమో మనం మాట్లాడేటప్పుడు వాడుతూ ఉంటాము. నాకు తెలుగు, ఇంగ్లీషు కొటేషన్స్ కలక్ట్ చేసుకునే అలవాటు ఉండటంతో చిన్నప్పుడు ఎక్కడో దొరికినప్పుడు రాసుకుని దాచుకున్నవి ఇవి. ఏవైనా అచ్చుతప్పులు ఉన్నయేమో తెలీదు.


మనం చాలాసార్లు వాడుకలో చెప్పుకునే వాక్యాలను, మనం చాలాసార్లు వాడుకలో చెప్పుకునే వాక్యాలను ఇవి మనకు తెలుసే అనిపించే హైలైట్ చేసాను. ఎంతో నీతి దాగి ఉన్న అలాంటి వాక్యాలు- వాటి పూర్తి రూపాలు కొన్ని ...


పుస్తకం వనితా విత్తం
పరహస్తం గతం గత:
అధవా పునరాయాతం
జీర్ణం భ్రష్టాచ ఖండశ:


పుస్తకం, స్త్రీ, ధనం ఈ మూడూ పరాయి చేతుల్లోకి వెళ్ళాకా ఆశ వదులుకోవలసినదే.
ఒకవేళ వెనక్కు వచ్చినా ముక్కముక్కలైపోయి నాశనమై వస్తాయి.




కృషితో నాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం


కృషి చేసేవారికి కరువనేది ఉండదు. భగవన్నామ జపం చేసుకునేవారికి పాపమంటదు.
మౌనంగా ఉండేవారికి కలహాలుండవు. జాగురుకతో ఉండేవారికి భయం ఉండదు.




ఋణానుబంధరూపేణా
పశుపత్నీ సుతాదయా
ఋణక్షయే క్షయంయాతి
కతత్ర పరివేదనా


ప్రపంచంలో మనకు ఏర్పడే అన్నిరకాల బంధాలూ ఋణానుబంధాలే. ఋణం తీరిపోయాకా ఆ బంధాలన్నీ నశించిపోతాయి. అందువల్ల ఈ ప్రాపంచిక బంధాలపై మమకారం పెంచుకుని వేదన పడకూడదు.




సత్యం బ్రూయాత్ప్రియంబ్రూయా
న్న బ్రూయా త్పత్య మప్రియం
ప్రియంచ నానృతం బ్రూయా
దేష ధర్మ స్సనత:


ఎప్పుడూ సత్యాన్ని చెప్పాలి. ఆ సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పాలి.
సత్యం అప్రియమైనదైనా కూడా ప్రియంగానే చెప్పాలి. ఇది అనాదిగా వస్తున్న ధర్మసూత్రం.




పరోపకారాయ ఫలంతి వృక్షా:
పరోపకారాయ వహంతి నద్యా:
పరోపకారాయ దుహంతి గావ:
పరోపకారార్ధ మిదం శరీరమ్.


అడగకుండానే చెట్లు పండ్లనిస్తాయి. అడగకుండానే నది నీళ్లనిస్తోంది. అడగకుండానే ఆవులు పాలనిస్తాయి. ఇవన్నీ ఇతరుల కోసమే. అలానే మానవ శరీరం కూడా ఇతరులకు ఉపకారం చేయటానికే ఇవ్వబడింది.