సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, August 10, 2010

భరణిగారి "ఆటగదరా శివా !!"



బెడ్ రెస్ట్ లో ఉండటం వల్ల ఇతరత్రా ఇబ్బందుల సంగతి ఎలా ఉన్నా, ఒక ఉపయోగం ఉంది. ప్రశాంతంగా ఆటంకం లేకుండా పుస్తకాలు చదువుకోగలగటం. (దానివల్ల కళ్ళకు కూడా కొన్నాళ్ళు ఇబ్బంది కలిగింది.అది వేరే సంగతి..:)) ఇటీవలి అలా చదివిన వాటిల్లో ఒకటి తనికెళ్ళ భరణిగారి "ఆటగదరా శివా !!"

భరణిగారు రాసిన "నాలోన శివుడు కలడు" పాటల గురించి రాసినప్పుడు, ఆయన "ఆటగదరా శివా !!" (1999) అన్న శివతత్వాలు కూడా రాసారని తెలిసింది. అనుకోకుండా అది నాన్నగారి పుస్తకాల్లో ఈమధ్య దొరికింది. ఎంతో సరళమైన భాషలో, అందరికీ సులభంగా అర్ధమయ్యేలా ఉన్న శివతత్వాలు నాకు ఎంతగానో నచ్చాయి. ఆట్ట మీది "బాపూగారి బొమ్మ", అట్ట వెనుక "వేటూరిగారి మాట(స్వదస్తూరీలో)" రెండూ ఎంతో ఆకట్టుకుంటాయి.

పుస్తకంలో నాకు బాగా నచ్చిన తత్వాలు కొన్ని ...

ఆటగదరా నీకు
మూడు కన్నులవాడ
ఆటగద
మాపైన సీతకన్ను.

***
ఆటగద బతుకంత
కాలకూటముగ్రక్కు
శుధ్ధి జేతువు గదా
తులసినీళ్ళు.

***
ఆటగదరా నీకు
అన్నపూర్ణప్రియా
ఆకలికి భిక్షాట
నాట నీకు.

***
ఆటగద అందాని
కజ్ఞాన మిచ్చేవు
జ్ఞాని కొసగేవు
వికృతరూపము.

***
ఆటగద మనవాడు
ఆటగద పైవాడు
అందరిని కలిపేది
వల్లకాడు.

***
ఆటగద సొంతాలు
ఆటగద పంతాలు
ఆటగద అంతాలు
ఆట నీకు.
***

ఆసక్తిగలవారు july10th/2010 hindu న్యూస్ పేపర్ లో వచ్చిన
తనికెళ్ళ భరణిగారి interview ఇక్కడ చూడచ్చు.