సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, March 12, 2010
"మౌన గీతం " నుంచి నాలుగు పాటలు ...
ఇష్టమైన పాటల గురించి రాసి చాలా రోజులైంది అని ఆలోచిస్తుంటే 1981 లో జే.మహేంద్రన్ దర్శకత్వం వహించిన "మౌన గీతం" సినిమాపాటలు గుర్తు వచ్చాయి. సుహాసిని నటించిన మొదటి సినిమా ఇది. హీరోయిన్ గా బుక్ చేసుకున్న పద్మిని కొల్హాపురి రాకపోతే ఆఖరు నిమిషంలో సినిమాకు అసిస్టెంట్ కెమేరా ఉమన్ గా పనిచేస్తున్న సుహాసిని ని హీరోయిన్ గా తీసుకోవటం జరిగిందని చెబుతారు. ప్రతాప్ పోతన్,మోహన్,సుహాసిని ప్రధాన తారాగణం. సినిమాలో నాలుగు పాటలు చాలా ఆదరణ పొందినవే. ఇళయరాజా మార్కుతో ఇప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన పాటలు అవి. తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన ఈ తమిళ్ సినిమా (" Nenjathai Killathey ") కూడా మంచి సినిమాల కేటగిరిలోకి వస్తుంది. 1986 లో మణిరత్నం దర్శకత్వం వహించిన 'మౌన రాగం' చిత్ర కధ ఈ సినిమా కధకు కాస్త దగ్గరగా ఉంటుంది.
ఇక్కడ నేను రాస్తున్న నాలుగు పాటలు "ఆచార్య ఆత్రేయ"గారు రచించారు. మార్నింగ్ వాక్ తో మొదలైయ్యే
"పరువమా చిలిపి పరుగు తీయకు..
పరుగులో పంతాలు పోవకు.."
బాలు, s.జానకి గళాల్లో జీవం పోసుకున్న ఒక గొప్ప రొమాంటిక్ సాంగ్ ఇది.
రెండవ పాట "చెలిమిలో వలపు రాగం
వలపులో మధురభావం"
మూడవ పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది.
"నా రాగమే తోలి పాటై పాడెను..
ఆ పాటకు ఎద వీణై మ్రోగెనే
మీటేదెవరోపాడేదెవరో..
తెలుసుకో నేనే..."
ఇక నాలుగవది చాలా ప్రత్యేకమైన పాట.
"పాపా పేరు మల్లి
నా ఊరు కొత్త ఢిల్లీ
అర్ధ్రరాత్రి నా కల్లోకి వచ్చిలేపి
నా సంగీతం గొప్ప చూపమంది..."
దీనిని ఎస్.జానకి గారు పాడారు అంటే ఎవరు నమ్మలేరు. ఒక తాగుబోతు గొంతును ఇమిటేట్ చేస్తూ ఆవిడ పాడిన విధానం "ఔరా" అనిపిస్తుంది. జానకిగారు పాడిన వైవిధ్యమైన పాటల జాబితాలో చేర్చుకోదగిన పాట ఇది.
Subscribe to:
Posts (Atom)