(సాహిత్యం పట్ల,ఉర్దూ భాష పట్ల ఉన్న మక్కువ వల్లనేమో గజల్స్ అంటే నాకు ప్రాణం.నా పరిధికి తెలుసున్న కొన్ని గజల్స్,వాటి విశేషాలని ఈ టపాలో పొందుపరచాలని చేసిన ప్రయత్నంలో ఏవైనా తప్పులు,పొరపాట్లు ఉంటే అర్ధంచేసుకోగలరు.)
సాహిత్యపరంగా "గజల్" అంటే ""ప్రేమికతొ మాట్లాడటం" అని అర్ధం.ఉర్దూ పద్యరూపాల్లో ప్రముఖమైన ఈ "గజల్" ఉర్దూ సాహిత్యానికి ఆత్మ అనే చెప్పాలి. ప్రేమ యొక్క అందాన్ని,ఎడబాటులోని వేదనను,ఆ వేదనలొ దాగి ఉన్న తియ్యని బాధను వ్యక్తీకరించే పద్యరుపాన్ని ఉర్దులో "గజల్" అంటారు. ప్రేమ, ఎడబాటు గజల్స్ లోని ప్రధాన ఇతివృత్తాలు. వీటి సంగీతానికి హిందుస్తాని రాగాలు ఆధారం. హిందుస్తానీ లలితశాస్త్రీయ సంగితంలోని ఒక శైలిగా ఈ గజల్ ను పరిగణిస్తారు. సాధారణంగా 5 verses నుంచీ మొదలైయ్యే ఈ పద్యరూపం 25 verses దాకా రాస్తూ ఉంటారు. ఈ పద్యరూపం ఆఖరి verseలో ఎక్కువగా కవి యొక్క కలం పేరు ఉంటూంటుంది.
సాహిత్యాన్ని, సంగీతాన్నీ కలగలిపి ఒక గజల్ గాయకుడు/గాయని తన పాట ద్వారా శ్రొతలకు ఉన్నతస్థాయిలో, ఒక వైవిధ్యమైన సంగీత మాధ్యమాన్ని అందిస్తారు.పద్య సందేశంతో పాటూ, తమ హావభావాలతో గజల్ గాయకులు తమదైన ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకుంటారు. చాలా మంది గజల్ గాయకులు పాటతో బాటుగా హార్మోనియమ్ ను కూడా వాయిస్తారు.ఇదీ క్లుప్తంగా గజల్ కధ.
గజల్ యొక్క పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్తే ఆరవ శతాబ్దంలో ఇది జన్మించింది.ఇన్డో_పెర్సో_అరబిక్ నాగరికతకు సంబంధించిన పద్యరూపల్లో గజల్ ఒకటి.13వ శతాబ్దాన్తం లో అమీర్ ఖుస్రో(1253-1325) అనే సంగీతకరుడు దీనిని పరిచయం చేసాడు.బ్రజ్ భాషలో ఇతడు రాసిన రచనలు చాలా ప్రశంసలనందుకున్నాయి. సితార్,ఢోలక్ లాంటి వాయిద్యాలని, "కవ్వాలీ" ను కూడా ఇతడే పరిచయం చేసాడని కొందరంటారు.
ప్రైవేటు ఆల్బమ్స్ కాకుండా మన హిందీ సినిమాల్లో కూడా కొన్ని అద్భుతమైన గజల్స్ ఉన్నాయి. వాటిలో నాకిష్టమైన కొన్ని సినిమా గజల్స్:
1)"Arth" సినిమాలో అన్నీ గజల్సే. జగ్జీత్ సింగ్ స్వరపరిచి, పాడిన ఈ గజల్స్ ఎంతో వీనుల విందుగా ఉంటాయి. చిత్రా సింగ్ పాడిన "తూ నహీ తో జిందగీ మే ఔర్ క్యా రెహ్ జాయెగా..."తో సహా మొత్తం అన్ని గజల్స్ నచ్చే ఆల్బం ఇది.
2)Rahte The Kabhi - Mamta
Singer: Lata Mangeshkar / Music; Roshan / Lyric: Majrooh
3)Rang Aur Noor Ki Barat - Gazal
Singer; Mohd Rafi / Music; Madan Mohan / Lyric: Sahir
4)Dil Dhoondhata Hai - Mausam
Singer; Bhupinder / Music: Madan Mohan / Lyric: Gulzar
5)Zindagi Jab Bhi - Umrao Jan Ada
Singer: Talat Aziz / Music; Khaiyyaam / Lyric; Shahryar
6)Aaj Socha To Aansoo Bhar Aaye - Haste Zakham
Singer: Lata Mangeshkar / Music; Madan Mohan / Lyric: Kaifi Azmi
7)Chupke Chupke Raat Din - Nikaah
Singer: Ghulam Ali / Music: Ghulam Ali / Lyric: Hasrat Mohani
8)Hai Isi Mein Pyar Ki Aabroo - Anpadh
Singer: Lata Mangeshkar / Music: Madan Mohan / Lyric: Raja Mehdi Ali Khan
9)Hotonse chulo tum mera geet amar kardo..
Singer:jagjit singh
10)seene mein jalan - Gaman - suresh wadkar
11)Tum ko dekhaa to ye khayaal aayaa - saath saath --jagjit&chitra singh
12)Hosh Walon Ko Khabar Kya - Sarfarosh - Jagjit Singh
13)yu hasraton ke daag mohobbat mein dho liye - adaalat -- lata
14)kisi nazar ko tera intezaar aaj bhi hai -- Aitbaar -Bhupinder&Asha Bhonsle
TVలో jagjit singh, talat aziz, peenaaz masaani, runa laila...ఇలా కొందరి లైవ్ కాన్సర్ట్స్ వచ్చినప్పుడు టేప్ రికార్డర్, వైర్లు పెట్టుకుని, అర్ధరాత్రి దాకా కూర్చుని నచ్చిన గజల్స్ అన్నీ రికార్డ్ చేసుకున్న కాలేజీ రోజులు...మరువలేనివి..!! రూనా లైలా పాడిన "रंजिशी सही दिल ही दुखानॆ के लियॆ आ....आ फिर मुझे तू छॊड्कॆ जानॆ के लियॆ आ...."చాల ఇష్టమైనది నాకు. ఈ గజల్ కు मेहदी हसन గారి వెర్షన్ కూడా ఉంది.ఇంకా...jagjit&chitra పాడినవి,గుల్జార్ గారు,జావేద్ అఖ్తర్ గారు రాసినవి కొన్ని,తలత్ అజీజ్ గారు పాడినవి కొన్ని..ఇలా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ బాగుంటాయి.
hariharan:
గజల్ అనగానే మెహదీ హసన్, గులామ్ అలీ, జగ్జీత్ సింగ్, పీనాజ్ మసానీ, చందన్ దాస్,రూనా లైలా,హరిహరన్...అందరూ గుర్తు వస్తారు.గజల్ అనగానే నాకు మాత్రం ఒక్క హరిహరన్ గుర్తుకొస్తారు.ఆ గాత్రంలోని మధురిమ, ఉత్సాహం అపూర్వం. అది అమృత గానం. నేను కరిగి, లీనమైపోయే కొన్ని గాత్రాలలో ఇది ఒకటి. నేను ఆయన వీరాభిమానిని. నా దగ్గర ఆయనవి చాలా ఆల్బమ్ లు ఉన్నా, నాకు వాటిల్లో ఇష్టమైనవి రెండే రెండు.ఆయన స్వయంగా స్వరపరిచిన Horizon(1988), Kaash(2000). రెండిటిలో అన్ని గజల్సూ బాగుంటాయి.
Horizon లొ అన్నీ ఆయనే స్వరపరిచి,గానం చేసారు. ""आज भी है मॆरॆ कदमॊ के निशा आवारा...." నా ఆల్ టైమ్ ఫేవరేట్. ఆ ఘజల్ మొత్తం బాగా నేర్చుకుని, పాడాలని చిన్నప్పటి నుంచీ కోరిక...ఎప్పటికి తీరుతుందో..!ఆల్బంలో మిగిలిన గజల్స్:
** "हम् नॆ काटि है तेरे याद मे राते अक्सर...."
** "तुझे कसम है साक़िया...शराब ला.....शराब दे..."
** "बन नहि पाया जो मॆरा हम्सफ़र...केह ना उसॆ..."
** "क्या खबर थी..."
** "फूल के आस पास रहते है.."
** "सागर है मॆरा खाली..लादॆ शराब साकी...है रात ढल्नॆ वाली..लादॆ शराब साकी.."ఈ పాటల్లోని ఇంటర్లూడ్స్ లో సంతూర్ ఎంత బాగా వాయిస్తారో..అన్నట్టు,నాకు సంతూర్ వాయిద్యమంటే చాలా ఇష్టం.. !!
ఇక Kaashలో ఆయన సంగీతం సమకూర్చి పాడిన గజల్స్ మనసును తాకుతాయి..ఈ ఆల్బమ్ కి 2000 లో స్క్రీన్ వీడియోకాన్ "బెస్ట్ నాన్_ఫిల్మ్ ఆల్బమ్" అవార్డు వచ్చింది.
** "काश ऐसा कोइ हुम्दुम हॊता...".
** "ये आयिनॆ सॆ अकॆलॆ मे जुस्त्जू क्या है...."
** "आन्धिया आती थी..."
** "अब कॆ बरस.."
** "झूम लॆ..." మొదలైనవి బాగుంటాయి.
తన స్నేహితుడైన Leslie Lewis తో కలిసి హరిహరన్ రిలిజ్ చెసిన Colonial Cousins అనే ఫ్యూజన్ ఆల్బం ఎన్త పొపులర్ అయ్యిందో అందరికీ తెలిసున్నదే.5,6 ప్రాంతీయభాషల్లో సినిమా పాటలు పాడిన హరిహరన్ తెలుగులో కూడా కొన్ని మంచి పాటలు పాడారు. (నేను ఇక్కడ కేవలం గజల్స్ గురిన్చి రాస్తున్నాను కాబట్టి ఆయన పాడిన తెలుగు సినిమా పాటల గురించి రాయటం లేదు). ఆయన గురించిన మరిన్ని వివరాలు,ఆయన పాడిన ఆల్బమ్స్, వాటి వివరాలూ ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వెబ్సైటులో చదవవచ్చు.http://www.nilacharal.com/enter/celeb/hariharan.asp