సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label non-filmi. Show all posts
Showing posts with label non-filmi. Show all posts

Wednesday, October 3, 2012

Manna Dey's "कुछ ऐसे भी पल होते है.."


ప్రముఖ హిందీ గాయకుడు  మన్నాడే ది ఒక విలక్షణమైన గళం. "आजा सनम ...", "तु प्यर क सगर है ", "लागा चुनरी मॆं दाग..", "प्यार हुआ इक्रार हुआ..", "ये मेरॆ प्यारॆ वतन..", "ज़िंदगी कैसी है पहॆली हायॆ.."सुर ना सजॆ क्या गावू मैं..." మొదలైన పాటలు మన్నాడే కి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. క్లాసికల్ టచ్ ఉన్న హిందీ పాటలు ఎక్కువగా పాడారు ఈయన. ఒక ప్రత్యేకమైన మూసలో ఉండిపోకుండా అన్నిరకాల పాటలు పాడగలగటం మన్నాడే గొప్పతనమే కానీ ఆయన గొంతులోని ఈ versatility వల్ల ఒకోసారి ఇది మన్నాడే పాడినదా?కాదా? అని సందేహం వస్తుంటుంది.

సినిమా పాటలే కాక ప్రైవేట్ పాటలు కూడా చాలా పాడారు మన్నాడే. వాటిల్లో "कुछ ऐसे भी पल होते है.." పాట చాలా బావుంటుంది. నాన్నగారి పాత కేసెట్లలో ఉన్న ఈ పాటను రాసుకుని నేర్చుకున్నా నేను. ఇవాళ అనుకోకుండా యూట్యూబ్ లో దొరికింది. ఈ పాట సాహిత్యం కూడా ఎంతో బావుంటుంది. గేయ రచయిత "యోగేష్" రచించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు మన్నాడే. మీరూ వినండి..


lyrics:
 ప: कुछ ऐसे भी पल होते है(२) 
जब रात कॆ गेहरॆ सन्नाटॆ 
गेहरी सी नींद मॆं सॊतॆ हैं 
तब मुस्कानें कॆ दर्द यहां 
बच्चॊं की तरहा सॆ रॊतॆ हैं 

౧చ: जब छा जाती है खामोशी 
 तब शोर मचाती है धड़कन 
 एक मेला जैसा लगता है 
 बिखरा बिखरा ये सूनापन 
 यादों के साए ऐसे में
 करने लगते है आलिंगन 
 चुभने लगते है साँसों में 
 बिखरे सपनें का हर दर्पण 
 फिर भी जागे ये दो नैना 
 सपनें का बोझ संजोता है ((ప)) 

 २చ:यु ही हर रात ढ़लती है 
 यु ही हर दिन ढलजाता है 
 हर साँझ यु ही ये बिरही मन 
 पतझर में फूल खिलाता है 
 आखिर ये कैसा बंधन है 
 आखिर ये कैसा नाता है 
 जो जुड़ तो गया अनजाने में 
 पर टूट नहीं अब पाता है 
 और हम उलझे इस बंधन में
 दिन भर ये नैन भिगोते है ((ప))


Wednesday, April 4, 2012

ऐसा कॊई जिंदगी सॆ.. (vaadaa)




"వాదా" అని 2000 లో ఒక హిందీ ప్రైవేట్ ఆల్బం వచ్చింది. "రూప్ కుమార్ రాథోడ్" పాడిన పాటలకు, గుల్జార్ సాహిత్యాన్ని అందించారు. గాయని సాధనా సర్గమ్ కూడా కొన్ని పాటలు పాడారు. ఈ ఆల్బంలో "రూప్ కుమార్" పాడిన అన్ని పాటలూ వినటానికి బావుంటాయి.


అన్నింటిలోకీ ముఖ్యంగా మొదటి పాట "ఐసా కోయీ జిందజీ సే వాదా తో నహీ థా.." అనే పాట చాలా బావుంటుంది. గుల్జార్ అందించిన సాహిత్యం కూడా గుర్తుండిపోతుంది. ఈ పాట మధ్యలో వచ్చే ఫ్లూట్ బిట్స్ పాట యొక్క మూడ్ తాలుకు ఇంటెన్సిటీకి బాగా సరిపోతాయి.


album: Vaada
lyrics: Gulzar
singer: Roop Kumar Rathod



సాహిత్యం:


ऐसा कॊई जिंदगी सॆ वादा तो नही था
तॆरॆ बिन जीनॆ का इरादा तो नही था


तॆरॆ लियॆ रातों मॆं चंदनी उगाई थी
क्यारियॊं में खुशबू की रॊशनी लगाई थी
जानॆ कहां टूटी है डॊर मेरॆ ख्वाबों की
ख्वाब सॆ जागॆंगॆ सॊचा तॊ नही था


शामियानॆ शामॊं कॆ रॊज ही सजायॆ थॆ
कितनी उम्मीदॊं कॆ मेहमान बुलायॆ थॆ
आकॆ दरवाजॆ सॆ लौट गयॆ हो
यू भी कॊई आयॆगा सोचा तो नही था






ఈ ఆల్బంలోని కొన్ని పాటలను ప్రఖ్యాత సరోద్ వాదకుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ సరోద్ పై వాయించటం ఈ ఆల్బంలో ప్రత్యేకత. ఈ కేసెట్ లోని మొత్తం పాటలను క్రింద లింక్ లో వినవచ్చు:


http://www.dhingana.com/hindi/vaada-roop-kumar-rathod-songs-roop-kumar-rathod-ghazals-3c295d1

Tuesday, July 5, 2011

मिलेगी मिलेगी.. मंज़िल


కాలేజీ రోజుల్లో లక్కీ అలీ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో... బేస్ వాయిస్ కాకపోవటం వల్ల మరీ ప్రఖ్యాతి రాలేదేమో అనిపిస్తుంది నాకు.హాస్య నటుడు మెహ్మూద్ కుమారుడైన ఇతను నటించిన "సుర్" సినిమాలో పాటలు చాలా బావుంటాయి.

"సునో" ఆల్బం లోని ఈ పాట,సాహిత్యం నాకు భలే నచ్చుతాయి..పాట మధ్య మధ్యలో వచ్చే ఆ గిటార్ భలే బావుంటుంది. ఇలాంటి హస్కీ వాయిసెస్ కూడా కొన్ని పాటలకు అందాన్ని ఇస్తాయి.


मिलेगी मिलेगी ..मंज़िल
चलके कही दूर
अ‍ॅये है चले जाने कॉ
अ‍ॅये है चले जायेंगे
दूर मजबूर..
मिलेगी मिलेगी

कैसी है ये दुनियां
प्यार का नम-ओ-निशा नहीं
नदा दुनियां वलें देखॊ
यहा पे कोई ईमान नहीं
अ‍ॅकेले ढूंढ्तॆ
सवेरा सवेरा
सवेरा सवेरा आयेगा चल के दो कदम
फ़ास्ले घट जायेंगे होसलॆं बढं जायेंगे
चल के दो कदम..
मिलेगी मिलेगी

चलतॆ दुनियां वलें सारे
राह मगर अंजान कही
मैं तो हूँ दीवना मेरी दीवान्गी बेनाम सही
अ‍ॅकेले ढूंढ्तॆ
मोहब्बत मोहब्बत
मोहब्बत मोहब्बत मिलॆगी चल के दो कदम
साथी से मिल जायेंगे
बहारॆं फिर खिल जायेंगे
चल के दो कदम..
मिलेगी मिलेगी

Monday, September 20, 2010

సలీల్ చౌదరి మాట...అంతరా చౌదరి పాట


"అంతరా చౌదరి" ప్రముఖ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి కుమార్తె. ఆమె చిన్నప్పుడు "మీనూ" అనే అమోల్ పాలేకర్ తీసిన హిందీ చిత్రంలో "తేరీ గలియోంమే హమ్ ఆయే.." అనే పాటను పాడించారు. శాస్త్రీయంగా హిందుస్తానీ తో పాటుగా వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకున్న ప్రతిభగల కాళాకారిణి. పాటలకు బాణీలు సమకూర్చగలరు. ఆమె పియానో కూడా చక్కగా వాయించగలరు. బెంగాలీలో పిల్లల పాటలతో ఆమె ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేసారు. అయితే ప్రతిభ ఉన్నా కూడా, పిల్లల పాటలు పాడే గాయని అనే ముద్ర నుంచి తప్పుకోలేకపోయారు. అయితే గాయనిగా ఆమె తన తండ్రి దగర ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు.



నా చిన్నప్పుడు ఒకసారి డిడి-1లో సి.పి.సివాళ్ళు ప్రసారం చేసిన సలీల్ చౌదరీ ఇంటర్వ్యూ ప్రసారమైంది. అన్నింటిలానే అది కూడా రికార్డ్ చేసాం. సలీల్ చౌదరీ సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం నాకూ, నాన్నకూ. అందంగా, పాడటానికి సులువుగా ఉంటూనే ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఆయన ట్యూన్స్. ఆయన సంగీతం సమకూర్చిన పాటలు నేర్చుకోవటం అంత తేలికైన పని కాదు. ఇంతకీ ఆ కార్యక్రమంలో ఆయన స్వరపరిచిన కొన్ని ప్రైవేట్ గీతాలను వినిపించారు. ఎన్ని సార్లు ఆ కేసెట్ మొత్తం వినేవాళ్ళమో లెఖ్ఖ లేదు. వాటిల్లో అంతరా చౌదరి పాడిన ’బీత్ జాత్ బర్ఖా రుత్, పియ న ఆ..యేరీ...’ అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట సంగీతం, సాహిత్యం రెండూ చాలా అద్భుతంగా ఉంటాయి.

ఈ పాటను "మధుర్ స్మృతి" అనే ఆల్బమ్ లో రిలీజ్ చేసారు. కానీ అది బయట దొరకలేదు నాకు. నా దగ్గర ఉన్నది డిడి లోంచి రికార్డ్ చేసుకున్న పాట మాత్రమే. పాటను ఆసక్తి ఉన్నవాళ్ళు క్రింద వినండి. మొదట్లో ఉన్నది సలీల్ చౌదరి
ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు...