సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label చలువపందిరి. Show all posts
Showing posts with label చలువపందిరి. Show all posts

Saturday, March 1, 2014

చలువపందిరి: चलॊ एकबार फिर सॆ...


"చలువపందిరి" లో ఈ నెల "గుమ్ రాహ్" చిత్రంలోని సాహిర్ పాట..'चलॊ एकबार फिर सॆ...' గురించి రాసాను.



పాట గురించిన కబుర్లు క్రింద లింక్ లో ....
http://vaakili.com/patrika/?p=5142


Saturday, February 1, 2014

చలువపందిరి: मोन्टा रे!





గాయకుడు “స్వానంద్ కిర్కిరే” కూడా గీతరచయిత, సంభాషణా రచయిత. పరిణిత లో “పియు బోలే”, కై పో చీ లో “మాంఝా”, త్రీ ఇడియట్స్ లోని అవార్డ్ పొందిన “బెహతీ హవా సా థా వో” లతో పాటూ ఎన్నో విలువైన సాహిత్యాలను అందించారాయన. అవటానికి ఇది చిన్న పాటే అయినా, ప్రతిభావంతులైన రచయిత, స్వరకర్త, గాయకుడు త్రిమూర్తుల్లా వెనుక నిలబడ్డ ఉత్తమ గీతంగా ఈ పాటను చెప్పుకోవచ్చు.

ఈ పాట గురించిన కబుర్లు క్రింద లింక్ లో చదవవచ్చు:
http://vaakili.com/patrika/?p=4913


Wednesday, January 1, 2014

చలువపందిరి: “कोइ ये कैसे बताये..”


ఈ నెల 'చలువపందిరి'లో ... వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవొరేట్ ఫిల్మ్స్ "అర్థ్ " చిత్రంలోని “कोइ ये कैसे बताये..” పాట గురించిన కబుర్లు... 

http://vaakili.com/patrika/?p=4681



Sunday, December 1, 2013

చలువపందిరి : "ये कौन चित्रकार है.."



రాసి తక్కువైనా, వాటి ఖ్యాతి మాత్రం ఎక్కువే. అటువంటి ప్రఖ్యాత సినీగీతాలను రాసిన రచయిత భరత్ వ్యాస్. ఏభైల్లో, అరవైల్లో హిందీ చిత్రాలకు గీతరచన చేసారు. ‘దో ఆంఖే బారహ్ హాత్’ చిత్రంలో అన్ని పాటల్లోనూ ఎంతో అద్భుతమైన ‘ऎ मालिक तेरॆ बिंदॆ हम’ పాటను రాసినది ఈయనే. “నవరంగ్” లో ‘आधा है चंद्रमा रात आधी’, ‘जा रॆ नट्खट ‘ పాటలను, ఇంకా ‘ज्यॊत सॆ ज्यॊत जलातॆ चलॊ.. प्रॆम की गम्गा बहातॆ चलॊ’, ‘तॆरॆ सुर और मॆरॆ गीत’, ‘तुम गगन की चंद्रमा ‘, ‘आ लौट कॆ आजा मॆरॆ मीत’ మొదలైన చిరస్మరణీయమైన గీతాలకు రచన చేసారు భరత్ వ్యాస్.



ప్రయోగాత్మకమైన, కళాత్మకమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు శ్రీ వి.శాంతారామ్ రూపొందించిన ఓ చిత్రం “బూంద్ జో బన్ గయీ మోతీ”! 
గీతకర్త 'భరత్ వ్యాస్' రచించిన మరో అందమైన గీతం “ये कौन चित्रकार है.. ” ఈ చిత్రం లోనిదే! ఆ పాట గురించిన కబుర్లు ఇక్కడ: 
http://vaakili.com/patrika/?p=4461


ఈ గీతాన్ని ఇక్కడ చూడవచ్చు:

Friday, November 1, 2013

చలువపందిరి - దిఖాయీ దియే యూ..






  “గజల్స్ ఫ్రమ్ ఫిల్మ్స్” అని లతా పాడిన ఓ పాతిక గజల్స్ ఉన్న ఆల్బం(రెండు కేసెట్లు) కొన్నారు నాన్నగారు నా కాలేజి రోజుల్లో. నా ఫేవొరేట్ ఆల్బంస్ లో ఒకటి అది. ఆ గజల్స్ లో వాడిన ఉర్దూ పదాలకు అర్థాలు తెలియకున్నా అవన్నీ నాకెంతగానో నచ్చేవి.  కొన్నళ్ళయ్యాకా డిక్షనరీ కొనుక్కుని మరీ ఆ ఉర్దూ పదాలకు అర్థాలు వెతుక్కుని, అర్థాన్ని ఆస్వాదిస్తూ ఆ గజల్స్ వినేదాన్ని. అసలా భాషకున్న మధురిమవల్లనే అనుకుంటా ఓ చిత్రకథానాయకుడు “జిస్కీ జుబా ఉర్దు కీ తర్హా..” అని నాయికను వర్ణిస్తూ పాడతాడు! అలా నే పదే పదే వింటూ వచ్చిన ఆ సినీ గజల్స్ ఆల్బంలోదే ‘Bazaar’ చిత్రంలోని “దిఖాయీ దియే యూ..” అన్న గజల్. నాకెంతో ప్రియమైన పాటల జాబితాలోది. 




వినేకొద్ది వినాలనిపించే ఈ గజల్ లో దాదాపు అన్నీ ఉర్దూ పదాలే. పాటల డైరీలో రాసుకున్న గజల్ లోని ప్రతి పదానికీ అర్థం రాసుకుని, మొత్తం అర్థాన్ని గ్రహించటానికి ప్రయత్నించేదాన్ని అప్పట్లో. ఆ ఇష్టంతోనే ఈ సిరీస్ లో ఈ పాట గురించి రాయడానికి సాహసిస్తున్నా...

పాట గురించిన మిగతా కబుర్లు ఇక్కడ:
http://vaakili.com/patrika/?p=4155



Tuesday, October 1, 2013

చలువపందిరి : यारा सीली सीली..




 "The Hungry stones” అని విశ్వకవి రవీంద్రుడు రచించిన ప్రఖ్యాత కథ ఒకటి ఉంది. ఆ కథను టాగూర్ వందేళ్ళ జయంతి ఉత్సవాల సందర్భంలో ప్రముఖ బెంగాలి దర్శకుడు తపన్ సిన్హా “Khudito Pashan” అనే పేరుతో సినిమాగా తీసారు. చిత్రానికి జాతీయపురస్కారం లభించింది. మరో ముఫ్ఫై ఏళ్ల తరువాత ఈ కథ ఆధారంగానే గేయరచయిత గుల్జార్ “Lekin..” పేరుతో ఓ సినిమా తీసారు. ఈ చిత్రానికి కూడా జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రంలోని “యారా సీలీ సీలీ” అనే పాట గురించి ఈసారి చెప్పబోతున్నా..! 


ఇంతటి భావగర్భితమైన పాటలో చిత్ర కథ కూడా మిళితమై ఉంది కాబట్టి ఈసారి పాటకు 'వాక్యార్థం' రాయడం లేదు. రాసినా అర్థమంతా మారిపోతుంది కూడా! కాబట్టి 'స్వేచ్ఛానువాదం' మాత్రమే ప్రయత్నించాను. 

పూర్తి వ్యాసాన్ని క్రింద లింక్ లో చూడవచ్చు: 
http://vaakili.com/patrika/?p=3934 



Monday, September 2, 2013

చలువపందిరి: “కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్”




శైలేంద్ర, శంకర్-జైకిషన్, రాజ్ కపూర్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో అద్భుతమైన పాటలూ, సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఒక చిత్రం “अनाड़ी (1959)”. అనారీ సినిమాలో మొత్తం ఏడు పాటలు. ఇందులో “బన్ కే పంఛీ గాయే ప్యార్ కా తరానా” పాట తప్ప మిగిలినవన్నీ శైలేంద్ర రాసినవే. ‘దిల్ కీ నజర్ సే’, ‘వో చాంద్ ఖిలా వో తారే హసే’, ‘బన్ కే పంఛీ’ (ఈ పాట ఒక్కటి 'హస్రత్ జైపురి' రాసారు), ‘తేరా జానా’, ’1956, 1957, 1958..’, ‘సబ్ కుచ్ సీఖా హమ్నే’, ‘కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్..’ అన్నీ వేటికవే అన్నట్లుంటాయి. “సబ్ కుచ్ సీఖా హమ్నే నా సీఖీ హోషియారీ” పాటకి సాహిత్యానికి శైలేంద్రకూ, పాడినందుకు ముఖేష్ కూ రెండు ఫిలిం ఫేర్ అవార్డ్ లు వచ్చాయి. ఈ ఏడు పాటల్లో “కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్” పాటను గురించే ప్రస్తుతం నే చెప్పబోయేది..

ఈ పాట గురించిన మిగతా కబుర్లు ఇక్కడ:
http://vaakili.com/patrika/?p=3779


Thursday, August 1, 2013

చలువపందిరి : रिमझिम गिरॆ सावन





వర్షాకాలంలో ఓ మంచి వానపాటను తలుచుకోకుంటే ఎలా?! వాన పాటలు అనగానే బోలెడు గుర్తుకొచ్చేసాయి.. 
ऒ सजना बरखा बहार आई, 
भीगी भीगी रातॊं मॆं, 
ऎ रात भीजी भीगी, 
प्यार हुआ इकरार हुआ हैं, 
सावन कॆ झूलॆ पडॆ हैं..तुम चलॆ आओ, 
आहा रिमझिम कॆ यॆ प्यारॆ प्यारॆ गीत लियॆ, 
रिमझिम कॆ तरानॆ लॆकॆ आई बरसात, 
रिम झिम रिमझिम रुमझुम रुमझुम, 
रिमझिम गिरॆ सावन, 
ऒ घटा सावरी, 
आज रपट जायॆ तो.., 
एक लड्की भीगी भागी सी… 
ఇలా బోలెడు వాన పాటలు..!
'చలువపందిరి'కి ఏది రాద్దామా అనుకుంటుంటే, “रिमझिम गिरॆ सावन” పాట నన్ను పట్టుకు వదల్లేదు. ‘సరే సరే.. ఈసారి నీ గురించే రాస్తాలే’ అని ఆ పాటకి మాటిచ్చేసా. 

 ఈ పాట గురించిన కబుర్లు వాకిలి పత్రికలో : 
http://vaakili.com/patrika/?p=3542 


పాట ఇక్కడ చూసేయండి..

 .

Thursday, July 4, 2013

“జల్తే హై జిస్కే లియే”


సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో నిపుణుడైన “బిమల్ రాయ్” దర్శకత్వంలో వచ్చిన సినిమా “సుజాత(1959)”. అంటరానితనం ప్రబలంగా ఉన్న అప్పటి రోజుల్లో, అది నేరమని చెప్తూ, ఆ జాడ్యాన్ని విమర్శిస్తూ, ‘అంటరానితనం’ ముఖ్య నేపథ్యంగా తీసిన చిత్రమిది. సుబోధ్ ఘోష్ అనే ప్రముఖ బెంగాలి రచయిత రచించిన కథ ఆధారంగా ఈ చిత్రం తయారైంది. సుబోధ్ రాసిన మరెన్నో కథలు హిందీ, బెంగాలీ సినిమాలుగా రూపొందాయి. 1959లో మూడవ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికవటంతో పాటుగా, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను కూడా ఈ చిత్రం సంపాదించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడింది.


ఈ సినిమాలో  “జల్తే హై జిస్కే లియే” అనే ‘ఫోన్ పాట’ నాకు చాలా ఇష్టం. అధీర్ ప్రేమను అంగీకరించి ఇంటికి వచ్చిన వెంఠనే తల్లి తనకు ఒక హరిజనుడితో వివాహాన్ని కుదిర్చిందని తెలిసి సుజాత బాధపడే సమయంలో అధీర్ ఈ ప్రేమగీతాన్ని ఆమెకు ఫోన్ లో వినిపిస్తాడు. కన్నీరు నిండిన కళ్ళతో, బాధతో అధీర్ ఉత్సాహంగా పాడే ఈ పాటను మౌనంగా వింటుంది సుజాత. అప్పటి సినిమాల్లో ‘ఫోన్ లో పాట’ ఒక ప్రయోగమే అయ్యుంటుంది.





పాట వాక్యార్థం వాకిలి పత్రికలో చూడండి:
http://vaakili.com/patrika/?p=3295


Saturday, June 1, 2013

“दिल ढूँढता है”





(పైన లింక్లో ఈ గజల్ తాలూకూ మూడు వర్షన్స్ వినచ్చు.)


ఇది ‘Ghalib (1961)’ అనే పాకిస్తానీ చిత్రంలోని ఒక గాలిబ్ గజల్. ఈ చిత్రంలో నాయికగా నటించటమే కాక, ఈ గజల్ కు గాత్రాన్ని అందించారు అప్పటి ప్రముఖ పాకిస్తానీ గజల్ గాయని ‘నూర్జహాన్’. ఈ గజల్ లోని ఒక షేర్.. 
“जी ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन 
 बैठे रहें तसव्वुर-ए-जानाँ किये हुए”  

ఇవే వాక్యాల్ని “మౌసమ్(1975)” చిత్రంలో “दिल ढूँढता है” పాటకు పల్లవిగా 
వాడుకున్నారు ప్రముఖ కవి గుల్జార్. ఆయన ఈ చిత్ర దర్శకుడు కూడానూ. ఈ కాలమ్ కోసం నేను ఎంచుకుంటున్న పాటలు చాలావరకు గుల్జార్ రాసినవే కావడం యాదృచ్ఛికం ! పాటను ఎంచుకున్నాకా, అరే.. ఇదీ గుల్జార్ రచనే అని నేనే ఆశ్చర్యపోతున్నా :) చాలాసార్లు అప్రయత్నంగా నేను హమ్ చేస్తూ ఉండే ఆప్తగీతం ఇది.



ఈ పాట గురించి మిగతా కబుర్లు వాకిలి పత్రికలో...
http://vaakili.com/patrika/?p=2992



Friday, May 3, 2013

इस मॊड सॆ जातॆ हैं..





విడుదలౌతూనే వివాదాల్లో చిక్కుకున్న సంచలనాత్మక చిత్రం, గుల్జార్ దర్శకత్వం వహించిన “ఆంధీ(1975)”. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో గుల్జార్ రాసిన నాలుగు పాటల్లో మూడుపాటలు క్లాసిక్స్ గా సంగీతప్రియులందరిచే ఈనాటికీ పరిగణించబడతాయి. “తేరే బినా జిందగీ సే కోయీ..” నా ఆల్ టైమ్ ఫేవొరేట్. ఎన్ని వందల పాటలు నచ్చినవి ఉన్నా.. నా మనసు ఈ పాట దగ్గరే నిలబడిపోతుంది. ఆ తర్వాత “తుమ్ ఆగయే తో నూర్ ఆగయా హై..” కూడా మరువలేని సాహిత్యమే. అయితే ఈ రెండూ స్ట్రెయిట్ లిరిక్స్. “ఇస్ మోడ్ సే జాతే హై..” అనే మూడో పాట లోతైన అర్థంతో పాటూ, కథ లోని మలుపులను కూడా తనలో ఇముడ్చుకున్న పాట. వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాహిత్యాన్ని, అందమైన పదాలతో రాయటం గుల్జార్ ప్రత్యేకత. స్వరపరిచేప్పుడు ఆర్.డి.బర్మన్ గుల్జార్ ని అడిగారుట.. “ఈ నషేమన్ ఏ ఊరి పేరోయ్..?” అని.

ఈ పాటకో చిన్న నేపథ్యం ఉంది. "Aaj Bichhade Hain” అని ఒక పాత ప్రైవేట్ ఆల్బం ఉంది. గుల్జార్ రచనే. అందులో ఉత్తమ్ సింగ్ స్వరకల్పనలో భూపేందర్ సింగ్ పాడిన ఈ “నజ్మ్” ఎంతో హాయి గొలిపేలా ఉంటుంది. ఇదే నజ్మ్ ని కాస్త సాహిత్యం మార్చి “ఆంధీ” చిత్రానికి వాడుకున్నారు గుల్జార్. 

ఆ నజ్మ్ సాహిత్యం, వినడానికి లింక్మ్ ఇంకా ఈ పాట కబుర్లు "వాకిలి" పత్రికలో చదవవచ్చు:

http://vaakili.com/patrika/?p=2707




Tuesday, April 2, 2013

"హమ్ నే దేఖీ హై.. "




హేమంత్ కుమార్ చిరస్మరణీయమైన నేపథ్యసంగీతాన్ని అందించిన "ఖామోషీ" సినిమాకు ప్రముఖ కవి, గేయ రచయిత "గుల్జార్" రాసిన పాటలు బహుళజనాదరణ పొందాయి. హేమంత్ స్వయంగా పాడిన "తుమ్ పుకార్ లో" హాంటింగ్ మెలొడీ ఐతే, "వో షామ్ కుచ్ అజీబ్ థీ", "దోస్త్ కహా కోయి తుమ్ సా.." , "ఆజ్ కి రాత్.." అనే చిన్ని కవితాగానం మూడూ కూడా సంగీతపరంగా, సాహిత్యపరంగా ఆకట్టుకుంటాయి. ఇవి కాక ప్రత్యేకంగా చెప్పుకోవల్సినది "హమ్ నే దేఖీ హై.. " గీతాన్ని గురించి. 

కథలో రోగి(అరుణ్)కి పూర్వ స్మృతి గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో, నర్స్(రాధ) గతంలో అరుణ్ రాసిన ఈ పాటను వినిపిస్తుంది. ఈ పాటలో ప్రేమ యొక్క లక్షణాలను తెలిపే ప్రయత్నం చేస్తాడు కవి. లతా మంగేష్కర్ పాడిన అపురూపమైన గీతాల్లో ఒకటైన ఈ గీతార్థాన్ని ఈ నెల "వాకిలి" పత్రికలో చూడండి..
http://vaakili.com/patrika/?cat=28




Friday, March 1, 2013

“ओ साथी रे..”



పురస్కారాలు అందుకోకపోయినా, కొన్ని పాటలు ఎంతో ఖ్యాతిని సంపాదించేసుకుని సంగీతప్రియుల పెదాలపై ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి పాటల్లో ఒకటి “ముకద్దర్ కా సికందర్“(1978) సినిమాలోని “ओ साथी रे..” పాట. అమితాబ్ బచ్చన్ సినిమాల్లో “షోలే” తరువాత అత్యంత జనాదరణ పొందిన సినిమా ఇది. చిత్రంలో “సలామే ఇష్క్ మేరీ జా”, “దిల్ తో హై దిల్”, “రోతే హుయే ఆతే హై సబ్” మొదలైన మిగతా పాటలన్నీ బహుళజనాదరణ పొందినవే. ప్రేమనీ, ఆవేదననీ, ఆర్ద్రతనీ కలగలుపుకున్న “ओ साथी रे..” పాట మాత్రం ఆణిముత్యమనే చెప్పాలి. అమితాబ్ కి ఎన్నో హిట్ సాంగ్స్ ని రాసిన గీత రచయిత “అంజాన్” ఈ పాటని రాసారు. 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు కిశోర్ కుమార్ పాడిన ఉత్తమ చిత్రగీతాల్లో ఈ పాట ఒకటి. సంగీతదర్శకద్వయం “కల్యాణ్ జీ-ఆనంద్ జీ” సంగీతాన్ని అందించిన “ओ साथी रे..” పాట ఇప్పటికీ ఎంతో మంది నోట వినిపిస్తునే ఉంటుంది అనటం అతిశయోక్తి కాదు. కొన్నేళ్ళుగా ఇదే పాట కొందరి నోటి వెంట పాటగా, ఈల గా కొన్ని వందలసార్లు వినీ వినీ విసుగొచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి :-)

మిగతా భాగం "వాకిలి" పత్రికలో...
http://vaakili.com/patrika/?p=1531





Friday, January 25, 2013

"కుచ్ దిల్ నే కహా.."


ఈ నెల "వాకిలి" పత్రికలో "అనుపమ" చిత్రంలోని "కుచ్ దిల్ నే కహా.." పాట గురించి రాసాను.
వ్యాసం క్రింద లింక్లో చూడవచ్చు...
http://vaakili.com/patrika/?p=823

ఆసక్తి ఉన్నవాళ్ళు అలా "చలువపందిట్లోకి" వెళ్ళిరండి...:))


(టపాకి కామెంట్ మోడ్ పెట్టడం లేదు)

Tuesday, December 25, 2012

"వాకిలి" లో కాస్త చోటు..



బ్లాగ్ రాయటం మొదలుపెట్టాకా, బ్లాగ్లోకపు గోడల్ని దాటి ఒకసారి "నవతరంగం"లో, మూడు నాలుగుసార్లు "పుస్తకం.నెట్" లో, మరో నాలుగు వ్యాసాలు "చిత్రమాలిక"లో రాసాకా.. ఎందుకో ఇక్కడే నా బ్లాగ్ గూట్లోనే ఉండిపోయా....

ఇన్నాళ్ళకి మళ్ళీ మరో అడుగు వేసాను... అది కూడా "వాకిలి" ప్రోత్సాహంతోనే ! "వాకిలి e-పత్రిక" వాళ్ళు నన్ను కాలమ్ రాయమని అడిగినప్పుడు ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను...

మరి నాతో పాటూ మొదటి సంచికలో, నే వేసిన "చలువ పందిరి" క్రింద నా పాటల కబుర్లు విందురుగాని రండి...

http://vaakili.com/patrika/?cat=28

వాకిలిలో నాకూ కాస్తంత చోటిచ్చి, నా వ్యాసాన్ని ప్రచురించిన సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.