సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, December 27, 2014

yes.. ఇంకా ఉంది..



"It is not what life takes away from you that counts, 
It is what you make of what is left with you" - 
Hubert humphrey 

చాలా రోజుల్నుండీ కొనాలనుకుంటున్న ఒక సబ్జక్ట్ తాలూకూ పుస్తకం కనబడింది.. ఆ పుస్తకం వెనకాల పైన రాసిన కొటేషన్ చూడగానే 'పబ్లికేషన్స్ డివిజన్'(పుస్తక ప్రదర్శన) లో ఆ పుస్తకం కొనేసాను. కొన్న పుస్తకాలు ఒక్కొక్కటే ఇందాకా సర్దుతూంటే ఈ పుస్తకం చూసి మళ్ళీ పని ఆపి ఇది చదవడంలో మునిగిపోయాను.. 

 పుస్తకం సంగతి పక్కన పెడితే ఈ కోట్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. జీవితంలో చాలాసార్లు కొన్ని సందర్భాల్లో - 'ఇంకేం ఉంది.. అసలు ఇంకా ఏమైనా మిగిలిందా? ' అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక కారణంతో ఆ సందర్భాన్నీ, ఆ నిరాశనీ దాటి ముందుకు వెళ్తూ ఉంటాము. ఒక్కో రోజూ మర్నాటికి పాతగా, నిన్న ఒక అఙ్ఞానంలా తోస్తూ ఉంటుంది. ఇలానే ప్రస్తుతం నిన్నలన్నీ పాతగా, చిన్నతనంలా, తెలియనితనంలో ఉన్న పసిపిల్లల్లా అనిపిస్తున్నాయి..! Iam seeing the brighter side..
 yes.. ఇంకా ఉంది.. జీవితం ఇంకా ఉంది.. నాకు నేను మిగిలినంతలోనే మళ్ళీ మొదలుపెడతాను.. పయనాన్ని మళ్ళీ సాగిస్తాను..ఆశతో.. నడుస్తాను.. మళ్ళీ..


11 comments:

కార్తీక said...

మీరు ఇంతకుముందొక సారి మీ టపా లో చెప్పినట్లు కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తుంటాయి బోలెడు చుక్కల మెలికల ముగ్గులా...కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడచిపోతుంటాయి. స్తబ్దుగా నిశీధిలా...అలాంటపుడు పైన చెప్పిన లాంటి కొటేషన్ కనిపిస్తే కాస్త ధైర్యం కలుగుతుంది.మంచి ఆలోచన లను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

ధన్యవాదాలు..పాత టపా గుర్తున్నందుకు కూడా..:)

వేణూశ్రీకాంత్ said...

పిక్చర్ అభీ బాకీహై మేరీ దోస్త్ అంటారనమాట :-) థాంక్స్ ఫర్ ద పోస్ట్ తృష్ణ గారు.. కోట్ బాగుంది.

తృష్ణ said...

హ..హ.. సరిగ్గా చెప్పారు. థాంక్స్ వేణూగారూ :)

Unknown said...

bavundi Trushna ji
udayaanne manchi maatalu thank u :))
Radhika(nani)

Sri Kanth said...

కోట్ బావుంది తృష్ణగారూ .. !!
దానికి మీ వివరణ కూడా బావుంది :-)

pushpadodla said...


తృ

నాగరాజ్ said...

ఎక్కడో విన్న విషయం...
ఓ ప్రసిద్ధ షూ కంపెనీ.... ఇద్దరు యంగ్ మార్కెటింగ్ గ్రాడ్యుయేట్సుని ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు సర్వేకోసం పంపిందట... ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో కనుక్కొని రమ్మని. ఇద్దరు ఓ రెండు నెలలు తిరిగొచ్చి రిపోర్టు సమర్పించారట. అందులో ఒకరు: అసలా ప్రాంతంలో షూ అలవాటే లేదు. అందరూ చెప్పులే వాడుతున్నారు. ప్రాస్పెక్ట్స్ ఏమీ లేవు. అక్కడికి మనం వెళ్లడం శుద్ధ దండగ అని. రెండోవాని రిపోర్టు: అక్కడ అందరూ చెప్పులే వాడుతున్నారు. ఇంకా ఏ షూ కంపెనీ కూడా అక్కడ అడుగుపెట్టలేదు. మనం గనక ముందుగా వెళ్లి బిజినెస్ స్టార్ట్ చేస్తే మన కంపెనీకి బోల్డన్ని ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి అని. ప్రాంతం ఒకటే. ఇద్దరి పర్ స్పెక్టివ్స్ అలా ఉన్నాయి. నాణేనికి రెండు పార్శ్వాలున్నట్టే, ప్రతీ దృగ్విషయానికీ రెండు కోణాలుంటాయేమో. మీరు పెట్టిన కోట్ చదివాక ఇది గుర్తొచ్చిందన్నమాట. మీ బ్లాగు స్టేటస్ లోనే... జీవితాన్ని ప్రతి క్షణం జీవించాలని... పెట్టుకున్నారు... ఇక మీకు చెప్పేదేముంది :)

Sujata M said...

U r a grt friend. Mood lifter and inspirational. Wow.

తృష్ణ said...

@ radhika, @srikanth M, @pushpadodla: ధన్యవాదాలు.

@naghraj: అందుకే మరచిపోకుండా అప్పుడప్పుడు బూస్ట్ చేసుకోవడం :) ధన్యవాదాలు.

తృష్ణ said...

@sujata: wow!thanks for the compliment :-)