సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 25, 2013

कौन आया मेरॆ मन कॆ द्वारॆ...





నిన్న సాయంత్రం అనుకుంటా ఈ వార్త తెలిసాకా, "నిన్న తెల్లవారుఝామునట కదా.. రేడియోన్యూస్ లో వినే ఉంటావు.. ఎందుకు చెప్పలేదు నాకు?" అని నాన్నకు ఫోన్ చేసి అడిగా..! 
"మధ్యాన్నం పదకొండింటికి స్పెషల్ ప్రోగ్రాం కూడా వేసారు రేడియోలో.." అన్నారు నాన్న. 
 "మరి...." అన్నా.. 
 "ఏమో.. బాధ వల్ల చెప్పలేకపోయానే..." అన్నారు! ఇంకేం అనను..?! మన్నాడే పాటలన్నీ తలుచుకుంటూ కాసేపు కబుర్లాడుకున్నాం! అంతకన్నా చెయ్యగలిగింది ఏముందని.. 


నాన్నకు ప్రత్యేకంగా ఇష్టమైన గాయకుల్లో ఒకరు మన్నాడే! ఎన్ని రాత్రుళ్ళు.. ఎన్నేసి పాటలు అలా వింటూ.. కబుర్లు చెప్పుకుంటూ... వాటి తాలూకు కథలు చెప్పుకుంటూ గడిపాము.. మా ఇద్దరికే తెలుసు. ఈ పాటలు,సినిమాల ఇష్టాలన్నీ నావేనా... నాన్న నుండి పుట్టుకొచ్చినవే కదా... తన వల్లే నేను.. నా అభిరుచులూ..! అలా నాన్న ద్వారా వచ్చాడు నా జీవితం లోకి "ప్రబోధ్ చంద్ర్ డే" ఉరఫ్ మన్నాడే !!నా పాటల తోటలో నేస్తమై ఉండిపోయాడు...!


పై ఫోటోలో ఉన్న కశ్మీరీ టోపీ ఒక అభిమాని ఆయనకు ఓ సభలో బహుకరించాడుట. అప్పటి నుండీ ఎక్కదికి వెళ్ళినా ఆ టోపీ లేకుండా వెళ్ళేవారుకారుట. అభిమానులంటే అంత ప్రేమ మన్నా కి! ఏ రకమైన పాట అయినా పాడగల వెర్సటైల్ వాయిస్ మన్నాడే ది. అసలు కొన్ని పాటలు తను పాడినవి అని గుర్తుపట్టలేను నేను ఇప్పటికీ. మేనమామ కె.సి.డే దగ్గరా, మరొక గురువుగారు దగ్గరా శాస్త్రియ సంగీతం నేర్చుకున్న సుశిక్షిత కంఠం మన్నాడే ది. అందువల్లనే సినిమాల్లో ఇతర గాయకుల్లా ఇబ్బంది పడకుండా శాస్త్రీయ, లలిత శాస్త్రీయ గీతాలెన్నింటినో అవలీలగా పాడగలిగారు. ఎన్నో భారతీయ భాషల్లో పాటలు పాడిన మన్నాడే మాతృభాష బెంగాలీలో లలిత గీతాలనూ, రవీంద్ర సంగీతాన్నీ ఇంకా హిందీ లో కూడా మరెన్నో నాన్ ఫిల్మీ సాంగ్స్ పాడారు మన్నాడే! తెలుగులో కూడా ఓ పాట పాడించారు మన్నాడేతో! "తారంగం తారంగం" అనే చిత్రానికి "జగదంబ జగదంబ ఏమి ఈ వింతలు" అనే పాట. చిత్రం రిలీజయ్యిందో లేదో తెలీదు కానీ రికార్డ్ ఉందని, మన్నాడే పాట అని నాన్న చిన్నప్పుడు జనరంజని లో వేస్తూండేవారు.


అత్యుత్తమ గాయకుడిగా నిలబడగల సత్తా ఉన్నా కూడా కొద్దిపాటి పాటలకే అతడి ప్రతిభని పరిమితం చేసేసింది చిత్రసీమ. "Jiboner Jalsaghorey" పేరుతో మన్నా రాసుకున్న ఆత్మకథను ఆంగ్లం లోకి ’Memories Come Alive' పేరుతోనూ, హిందీలో 'Yaden Jee Uthi' పేరుతోనూ అనువదించారు. మన్నాడే జీవితవిశేషాల మీద ఓ డాక్యూమెంటరీ కూడా తీశారు. "ఏ మేరీ జొహరా జబీ.. తుఝే మాలూమ్ నహీ.. తూ అభీ తక్ హై హసీ ఔర్ మై జవా.. " (వక్త్) పాట లాగ భార్య అంటే ఎంతో ప్రేమాభిమానాలు మన్నడే కు. క్రిందటేడు జనవరిలో ఆమె చనిపోయాకా పూర్తిగా ఏకాంతవాసి అయిపోయారాయన. 


"कुछ ऐसे भी पल होते है 
जब रात कॆ गेहरॆ सन्नाटॆ 
 गेहरी सी नींद मॆं सॊतॆ हैं 
 तब मुस्कानें कॆ दर्द यहां 
 बच्चॊं की तरहा सॆ रॊतॆ हैं " 
అని తను పాడిన ఒక ప్రేవేట్ సాంగ్ ఒకటి ఉంది. నాకు చాలా ఇష్టం ఆ పాట. ఈ ఒక్క పాట చాలు 'మన్నాడే'ని ప్రేమించెయ్యడానికి. ఇంకే పాట వినకపోయినా పర్వలేదు! గేయ రచయిత "యోగేష్" రచించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు మన్నాడే. ఆ పాట మీరూ వినండి..ఇక్కడ .. http://samgeetapriyaa.blogspot.in/2012/10/manna-deys.html


యూట్యూబ్ లో మన్నాడే హిట్ సాంగ్స్ రెండు వాల్యూస్ లింక్స్ దొరికాయి.. ఆ లిస్ట్ + ఆ లింక్స్ క్రిందన ఇస్తున్నాను.. 

Details: 
1. Zindagi Kaisi Hai Paheli 
2. Tujhe Suraj Kahoon Ya Chand 
3. Nadiya Chale Chale Re Dhara 
4. Chalat Musafir 
5. Yeh Raat Bheegi Bheegi 
6. Gori Tori Paijaniya 
7. Na Mangun Sona Chandi 
8. Poochho Na Kaise Maine(ఆహిర్ భైరవి రాగం) 
9. Apne Liye Jiye To Kya Jiye 
10.Raat Gayi Phir Din Aata Hai

 



Details: 
 1. Ae Bhai Zara Dekh Ke Chalo 
2. Tu Pyar Ka Sagar Hai 
3. Laga Chunari Men Daag 
4. Yari Hai Imaan Mera 
5. Ae Mere Pyare Watan 
6. Hansne Ki Chah Ne Kitna Mujhe 
7. Kasme Wade Pyar Wafa 
8. Ae Mere Zohra Jabeen 
9. Tum Bin Jeevan 
10.Tu Chhupi Hai Kahan
 

http://www.youtube.com/watch?v=O5EMOxdxkOg

 
ఈ రెండు వాల్యూమ్స్ లోవి కాకుండా మరి కొన్ని చక్కని హిట్ సాంగ్స్ ఉన్నాయి. నాలాంటి పిచ్చోళ్ళు ఒకరిద్దరు విన్నా నాకు ఆనందం, మన్నా డే ఆత్మకు శాంతి... కదా అని ఆ పాటలన్నీ ఇక్కడ లిస్ట్ చేస్తున్నాను.. 

1.) కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే.. (చిత్రం: దేఖ్ కబీరా రోయా) 
రాసినది Rajendra Krishan, సంగీతం Madan Mohan 

 

2) బిమల్ రాయ్ తీసిన "దో భీగా జమీన్" సినిమాలో రెండు మంచి పాటలు ఉన్నాయి. ఒకటి అచ్చం "లగాన్" సిన్మాలో "ఘనన్ ఘనన్" పాటను పోలి ఉంటుంది.. వింటానికి ఉత్సాహభరితంగా ఉండే "హరియాలా సావన్ ఢోల్ బజాతా ఆయా.." 
లతా, మన్నడే ఽ కోరస్ 

 

3) రెండోది "దో భీగా జమీన్" సినిమాలోదే "ధర్తీ కరే పుకార్..మౌసమ్ బీతా జాయ్.." అనే పాట. ఇది కూడా చాలా బాగుంటుంది. రష్యన్ ఆర్మీ మార్చింగ్ మ్యూజిక్ ఇన్స్పిరేషన్ తో ఈ పాట చేసానని 'సలీల్ చౌదరి' ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. 
లతా, మన్నడే ఽ కోరస్

 

4.) "చునరి సంభాల్ గోరీ.. ఉడీ చలో జాయ్ రే.." అని 'बहारॊं के सपनॆ ' సిన్మాలో మహా సరదా అయిన పాట ఉంది. అందులో మధ్య మధ్య "హహ్హా..." అనిపిస్తారు లతాతో. వినడానికి భలే తమాషాగా ఉంటుంది. ఆర్.డి.బర్మన్ మాయ అది :) 

Majrooh Sultanpuri ,R.D. Burman, Lata Mangeshkar, Manna Dey.

 

5.) "చోరీ చోరీ" లో "ఆజా సనమ్" డ్యూయెట్ స్కూల్ రోజుల్లో ఖచ్చితంగా ఓ వందసార్లు పాడి ఉంటాను నేను.. :) ఇంటర్ల్యూడ్స్ తో సహా కంఠతా!

Shankar Jaikishan, Hasrat Jaipuri, Lata Mangeshkar, Manna Dey.

 

6.) కన్నడ నవల "హంసగీతె" ఆధారంగా తీసిన సంగీతపరమైన చిత్రం 'बसंत बहार'. అందులో మన్నాడే పాడిన "సుర్ న సజే క్యా గావూ( మై.. సుర్ కే బినా జీవన్ సూనా" ఎంత బాగుంటుందో... గీతకర్తలు Shailendra and Hasrat Jaipuri ల్లో ఎవరు రాసారో ఈ పాట తెలీదు కానీ సంగీతం Shankar-Jaikishan.

   


7.) 'Shri 420' లో 'ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే ', ’ ప్యార్ హువా ఇక్రార్ హువా..” డ్యూయెట్స్ కాక ఈ సోలో కూడా మన్నాడే పాడినదే... Shankar-Jaikishan, Shailendra  

   

8.) కిషోర్ కుమార్ అన్నదమ్ములు ముగ్గురూ నటించిన హాస్యచిత్రం 'चलती का नाम गाडी' లో 'बाबू संझॊ इशारॆ ' అని కిషోర్ తో గొంతు కలిపారు.
 Majrooh Sultanpuri, S.D. Burman, Duet with Kishore Kumar

 


9) క్లాసికల్ బేస్డ్ పాటలే కాక జానపద శైలిలో చేసిన పాటల్లో కూడా గొంతు కలిపారాయన. "మధుమతి" చిత్రంలో "చడ్ గయో పాపి బిఛువా.." పాటలో మధ్య మధ్య వచ్చే కొండజాతి అబ్బాయ్ మాటలూ, పాడే రెండు వాక్యాలూ మన్నా వే! సలీల్ చౌదరీ , శైలేంద్ర, లత, మన్నాడే 



10) another beautiful song 'phir kahi koyi phool khila' from
'anubhav'  
 
 


సినీగీతాలకు ప్రాణం ఉన్నంతవరకూ మన్నడే గళం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది..

Thursday, October 24, 2013

వాన..





వాన.. వాన.. వాన..
నిన్నట్నుండీ
కురుస్తూనే ఉంది..

తడుపుతోంది..
పుడమినీ.. దేహాన్నీ.. మనసునీ..
కడుగుతోంది..
అరుగునీ.. అడుగులనీ.. ఆలోచనల్నీ..
ఊపుతోంది..
కొమ్మలనీ.. పూలనీ.. కలలనీ..
చలిస్తోంది..
నిశ్శబ్దాన్నీ.. మాపునీ.. నన్నూ..

వాన..వాన.. వాన..
ఇంకా
కురుస్తూనే ఉంది..



Monday, October 21, 2013

"అట్లతద్దోయ్ ఆరట్లోయ్ .."





మరేమో ఇవాళ అట్లతద్ది కదా.. పొద్దున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ "మునుపు రేడియోలో అట్లతద్ది పాటలు వేసేవారు 'జనరంజని'లో అయినా... ఇవాళ ఒక్క పాటా వెయ్యలేదే.." అంది. సరే నే వినిపిస్తానుండు అని నెట్లో వెతికి ఫోన్లోనే రెండు పాటలు వినిపించా.. అమ్మ సంతోషపడింది. సరే ఆ పాటలు బ్లాగ్లో పెడితే అమ్మాలాగా అట్లతద్ది పాటలు వినాలనుకునేవారెవరన్నా వింటారు కదా.. అని అవుడియా వచ్చింది. అదన్నమాట..:)


నేను అట్లతద్ది నోములాంటివి ఏమీ నోచలేదు కానీ అమ్మ ప్రతి ఏడూ గోరింటాకు పెట్టేది. అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఎంత సరదాగా అట్లతద్ది చేసుకునేవారో చెప్పేది. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అని ఫ్రెండ్స్ అందరూ అరుచుకుంటూ వెళ్ళి ఉయ్యాలలూ అవీ ఉగడం, అమ్మమ్మ అట్లు చేయడం మొదలైన కబుర్లు ప్రతి ఏడూ అప్పుడే వింటున్నట్లు మళ్ళీ కొత్తగా వినేవాళ్లం!
అట్లతద్ది నోము కథ లింక్ దొరికింది..చూడండి:
http://www.teluguone.com/devotional/content/atla-taddi-nomu-113-1441.html 


పాత సినిమాల్లో అట్లతద్ది పాటలు కాసిని ఉన్నాయి గానీ నాకు మూడ్నాలుగే దొరికాయి.. అవే పెడుతున్నాను..

 
1) రక్త సింధూరం చిత్రంలో పాట "అల్లిబిల్లి పిల్లల్లారా ఇల్లా రండి మీరు.. ఇలా రండి అట్లాతద్ది కన్నెనోము నోచాలండి.. నేడే నోచాలండి.." సుశీల బృందం పాడారు..ఆరుద్ర రచన ..

2) పవిత్రబంధం చిత్రంలో ఓ పాట ఉంది.. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచేతద్ది వేడుకమీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే జీవితమే పూచునే.." అని!


3) "అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అంటూ పాడిపంటలు సినిమాలో మరో పాట ఉంది కాని అది ఓ పట్నం అమ్మాయిని ఉడికిస్తూ పాడే పాట. అందుకని అట్లతద్ది కన్నా ఎక్కువ తెలుగుతనం ఉట్టిపడేలా ఎలా ఉండాలో చెప్పేపాట ఇది.
పాట ఇక్కడ వినండి:
 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3112 



4) బొబ్బిలి యుధ్ధం లో "ముత్యాల చెమ్మచెక్క.." పాట అట్లతద్ది పాట అవునో కాదో గుర్తులేదు కానీ అందులో "ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె.." అనే వాక్యం ఉంటుంది.. కాబట్టి బాగుంటుందని ఆ పాటని కూడా జతచేస్తున్నానిక్కడ :)

Tuesday, October 15, 2013

పన్నెండేళ్ల ప్రాయం..వెన్నెల్లాంటి హృదయం..



Fmలో తెలియని పాటలు విన్నప్పుడల్లా నెట్లో వెతకటం నాకు ఎప్పుడూ ఉన్న అలవాటే! ఇవాళా ఓ మంచి పాట విన్నా.. . గూగులమ్మనడిగితే ఆ పాట "బావ" సినిమాలోదని, సాహిత్యం "అనంత్ శ్రీరామ్" దని చెప్పింది. 
పాట వినటాడికి "స్నేహం" చిత్రంలోని 'ఎగరేసిన గాలిపటాలు.. ' సాహిత్యం లాగనే ఉంది. 

పాట మీరూ వినేయండి.. తెలియకపోతే కొత్తగా.. తెలిస్తే మరోసారి నాతో పాటూ... 

'

Thursday, October 10, 2013

మట్టిమనిషి





"పుట్టినవాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయేవాళ్ళేరా! అసలు మనం పుట్టింది ఏడవటానికంటరా? బతకటానికిరా! బతకటానికి. బతికినన్నాళ్ళూ మగసిరిగా బతకాలి! ఒకళ్ళను దేహీ అంటూ అడక్కూడదు. అడ్డం వచ్చిన వాటిని నరుక్కుంటూ వెళ్ళాలి! చేతగాని వాడే ఏడుస్తాడు. చేతుల్లో సత్తువ ఉన్న వాడెవ్వడూ ఏడవకూడదు. సంతోషంగా బతకాలి! మనిషికి సంతోషం ఎక్కడుందంటావా? కష్టపడి పని చెయ్యడంలో ఉంది. చెమటోడ్చి భూమి దున్నటంలో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావటంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లో కొచ్చినప్పుడు ఉండే ఆనందంలాంటిది ఈ భూమ్మీదే మరొకటి లేదురా బాబూ!"
అంటాడు సాంబయ్య మనవడితో! ఎంత చక్కని ఫిలాసఫీ! 

ఇది సాంబయ్య తనకు తానుగా గ్రహించుకున్న జీవనసారం. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి, మట్టినే నమ్ముకు బ్రతికిన ఓ 'మట్టిమనిషి' నేర్చుకున్న జీవన వేదాంతం. 


'సాంబయ్య' డా.వాసిరెడ్డి సీతాదేవి రచించిన "మట్టిమనిషి" నవల లో ప్రధాన పాత్రధారి(Protagonist). కథంతా అతని చుట్టూతానే అల్లుకుని ఉంటుంది. 'ఆంధ్రప్రభ' దినపత్రిక, ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురణ పొందిన ఈ నవల విశేషంగా పాఠకుల ఆదరణ పొందింది. 1972 లో పుస్తక రూపంలో వచ్చిన తరువాత మరో రెండుసార్లు పునర్ముద్రితమైంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ నవల పురస్కారాన్ని అందుకుంది. నేషన్ బుక్ ట్రస్ట్ వారు పధ్నాలుగు భాషల్లోకి అనువదించారు ఈ పుస్తకాన్ని. ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు ఫైనల్ ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా కూడా నిర్ణయించారు. ఇంతటి విశేష ప్రాముఖ్యత పొందిన ఈ సామాజిక నవలలో అప్పటి సమకాలీన సమాజంలోని దురన్యాయాలను, అప్పటికే పతనమవుతున్న భూస్వామ్య వ్యవస్థ లోటుపాట్లను కళ్లముందుంచారు సీతాదేవిగారు. తెలుగు నవలాసాహిత్యంలో ఎన్నదగిన పది ఉత్తమ నవలల్లో ఈ నవల కూడా చోటుచేసుకుని ఉంటుందని పుస్తకం పూర్తయ్యాకా నాకనిపించింది. 




 

సీతాదేవి గారి రచనా శైలి, సామాన్య రైతు జీవితాన్ని ఆవిష్కరించిన తీరు, పాత్రల చిత్రణ, నిశితమైన మనస్తత్వ చిత్రణ అన్ని ఎంతో వాస్తవికంగా, వివేచనాత్మకంగా ఉన్నయి. ఒకవైపు ప్రభుత్వోద్యోగం చేస్తునే సీతాదేవి గారు నవలలు, కథా సంపుటాలూ, వ్యాస సంకలనాలు, పిల్లల కథా సంపుటాలు, అనువాదాలు రాసారంటే నిజంగా అభినందనీయులు. ఆవిడ పలు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్న వివరాలు, వాటి పేర్లు నవల వెనుకవైపు రాసారు.


సుమారు ఏడాదిన్నర క్రితం కొన్న ఈ పుస్తకాన్ని మొన్న ఓ వంద పేజీలు చదివాకా తప్పనిసరిగా మూసేయాల్సి వచ్చింది. మిగిలిన మూడొండల పేజీలూ నిన్న ఏకబిగిన మూడుగంటల్లో పూర్తిచేసానంటే క్రెడిట్ అంతా నా కళ్ళను పరిగెత్తించిన ఆ రచనా శైలిదే! ఇంతకు ముందు ఆవిడ పుస్తకాలేమీ చదవలేదు కానీ ఈ ఒక్క పుస్తకం మాత్రం నన్నెంతో ఆకట్టుకుంది. అసలు నిన్న రాత్రంతా కలత నిద్రలో సాంబయ్య, కనకయ్య, రామనాథబాబు, రవి, వరూధిని...అలా కదులుతూనే ఉన్నారు కళ్లముందు! ఎంతగానో కదిలించేసింది నన్నీ కథ..! విశృంఖల ప్రవర్తనతో జీవితాన్ని నాశనం చేసుకున్న వరూధిని చావుపై కూడా జాలి పుట్టించేంతటి పట్టు ఉన్న కథనం. కొన్ని పుస్తకాలింతే.. మనసునీ, ఆలోచనల్నీ తమ వశం చేసేసుకుంటాయి.


మూడు తరాల జీవితాలలో వివిధ పరిణామాలను సమర్థవంతంగా, ఎంతో దృశ్యాత్మకంగా అక్షరీకరించారు సీతాదేవి గారు. ప్రతి సన్నివేశం ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు కాక, మనోఫలకంపై ఒక దృశ్యాన్ని చూపెడుతూ ఉంటుంది పాఠకుడికి. ఉత్తరాది నుండి కట్టుబట్టలతో ఆ ఊళ్ళోకి వచ్చిన వెంకయ్య, మోతుబరి రైతు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా కుదిరి, కష్టపడి కౌలు వ్యవసాయం చేసి, పదేళ్ళలో రెండెకరాల పొలం కొనే స్థాయికి ఎదుగుతాడు. కొడుకు సాంబయ్యకు దుర్గమ్మనిచ్చి పెళ్ళి చేస్తాడు. చమటోడ్చి సంపాదించిన ఐదెకరాల పొలాన్ని కొడుకుకి మిగిల్చి వెంకయ్య చనిపోతాడు. కొడుకు పుట్టేనాటికి సాంబయ్య ఏడెకరాల మాగాణి, మూడెకరాల మెట్ట ఉన్న చిన్నకారు రైతు. బడికి కాక, కొడుకు వెంకటపతిని తనతో పాటుగా పొలానికి తీసుకెళ్లటానికే నిర్ణయించుకుంటాడు సాంబయ్య. వెంకటపతి పెళ్ళిడుకొచ్చేసరికీ  ఎనభై ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, సుమారు పాతికవేల కవిలె, దొడ్లూ దోవలు, కొత్తగా కట్టిన డాబాఇల్లు గల షావుకారవుతాడు
సాంబయ్య. ఊళ్ళో అతని పరపతి పెరుగుతుంది. అదృష్టం అందలం ఎక్కిస్తే బుధ్ధి బురదలోకి లాగిందన్నట్లు ఒక చిత్రమైన కోరిక పుడుతుంది సాంబయ్యకి. తన తండ్రి పాలేరుగా చేసిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య తో వియ్యమొందాలని! ఆస్తి హరించుకుపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్న బలరామయ్య గత్యంతరం లేక ఆఖరి కుమార్తె వరూధినిని వెంకటపతికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ వ్యవహారమంతటికీ ముఖ్యకర్త, మధ్యవర్తి గుంటనక్కలాంటి కనకయ్య!


 రైతులకూ పెట్టుబడిదారులకూ మధ్యవర్తిగా ఉంటూ, ఊరువాళ్ల దయాధర్మాలతో సంసారం నడుపుతూ, చిన్నచిన్న పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించి, ఏదో ఒక దోవన లాభాలార్జించి భూస్వామిగా మారిన ఊసరవెల్లి కనకయ్య. ఒకనాడు బక్కపలచగా,తొండిలేక ఆవురావురుమన్న కనకయ్య కాలువగట్టు క్రింద పదెకరాల పొలం, తాను రైతుల ధాన్యం అమ్మించిన మిల్లులోనే పావలా వాటాదారు అవుతాడు. నాలుగువేలతో ఇల్లు బాగుచేసుకుని మేడ కడతాడు. మోసాలతో ధనార్జన చేసి కొడుకునీ,అల్లుడ్నీ లాయర్లను చేస్తాడు. అక్రమార్జనతో బలరామయ్య మేడను కూడా కొని, చివరికి ఆ ఊరి సమితి ప్రెసిడెంట్ కూడా అవుతాడు. సమకాలీన వ్యవస్థలోని లోటుపాట్లకు ప్రతీక అతని పాత్ర.




పట్నవాసపు మోజుతో పల్లె వదిలిన సాంబయ్య కోడలు వరూధిని వెనకాల పెళ్లాం చాటు మొగుడిగా మారిన వెంకటపతి తండ్రిని వదిలేస్తాడు. తన మొండితనం వల్ల, అజాగ్రత్త వల్ల, అదుపులేని నడవడి వల్లా, జీవితాన్ని అభాసుపాలు చేసుకుంటుంది వరూధిని. కనకయ్య వంటి గుంటనక్కల వల్ల, రామనాధబాబు
వంటి మోసకారులవల్ల, వెంకటపతి చేతకానితనం వల్లా, సాంబయ్య చెమట చిందించి సంపాదించిన ఆస్తంతా కర్పూరంలా హరించుకుపోతుంది. ఓ దిబ్బ మీద పూరిపాకలో ఒంటరిగా మిగులుతాడు సాంబయ్య! 


భార్య హఠాన్మరణం తరువాత తండ్రికి మొహం చూపలేని వెంకటపతి కాన్వెంట్ లో చదువుతున్న తన కొడుకుని ఊరిపొలిమేరల్లో తాత వద్దకు వెళ్లమని వదిలి వేళ్పోతాడు. అదంతా ఎలా జరిగింది? అంత ఆస్తి ఎలా హరించుకుపోయింది? వరూధిని ఎలా మరణించింది? తన ఆస్థిని సర్వనాశనం చేసిన కొడుకు వారసుడైన తన మనవడు రవిని సాంబయ్య చేరదీస్తాడా? చివరికి ఏమవుతుంది? మొదలైన ప్రశ్నలకి సమాధానలు తెలుసుకోవాలంటే నవల చదవాల్సిందే మరి :)


పట్నానికి తీసుకెళ్ళి భార్య ప్రాణాలు కాపాడలేని పరమ పిసినారిగా సాంబయ్య పాత్రను చిత్రీకరించినప్పటికీ, ఎందుకో అతనిపై ద్వేషం, కోపం కలగవు. మట్టిని నమ్ముకున్న అతడి ఆత్మవిశ్వాసానికీ, వృధ్ధాప్యంలో కూడా ఓటమి అంగీకరించని అతని పట్టుదలకూ అతడ్ని మెచ్చకుండా ఉండలేము. ఓ సందర్భంలో "హౌ కౄయల్ యు ఆర్? తాతయ్యా!" అంటాడు మనవడు. అందుకు సమాధానం చెప్తూ, "దున్నుతూ దున్నుతూ కాడి మెడమీద వేసుకుని పోయిండిరా! దాని ఋణం అది తీర్చుకుని హాయిగా కన్నుమూసింది. అదృష్టం అంటే దాందేరా! మనుషులకు కూడా రాదురా ఆ అదృష్టం!" అంటాడు. ఎంతటి జీవనసత్యం దాగిఉందో ఆ మాటల్లో! 

మరోసారి - "తాతయ్యా నీకు చదువు రాదుగదా! ఇదంతా నువ్వెట్టా నేర్చుకున్నావ్?" అనడుగుతాడు మనవడు.. అప్పుడు..
"ఈ నేల నా పలక. నాగలే నా బలపం. పొలమే నా బడి! భూమ్మీద దిద్దాను. రోజుకి ఒక్కొక్కమాట ఈ భూమే నేర్పింది నాకు. నా తల్లీ,దైవం, గురువూ ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పరా మనవడా? నీ బడి గొప్పదో నా బడి గొప్పదో? నీచదువెక్కువో నా చదువెక్కువో?" అంటాడు సాంబయ్య! 

ఇతను కదూ జ్ఞాని !
చివర్లో మరోసారి  "ఈ నేలా, ఈ గాలీ, ఈ ఆకాశం చమటోడ్చేవాడి సొత్తురా! అందలమెక్కినోడిది కాదురా!" అంటాడు అతను.
నవలాసారం కూడా ఇదే!


ఇలా నాకనిపించడం యాదృచ్ఛికమో, ప్రేరణో ఉందోలేదో తెలీదు కానీ నాకీ నవల చదువుతూంటే రెండు  ఆంగ్ల నవలలు గుర్తుకు వచ్చాయి. ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి, నోబుల్ పురస్కార గ్రహీత 'Pearl Buck' రాసిన 'The Good Earth', Thomas Hardy నవల 'The Mayor of casterbridge'. 'The Good Earth'లో protaganist 'wang lung';  '
The Mayor of casterbridge' లో protaganist  'Henchard'. ఈ మూడు నవలల్లోనూ protaganist  ది ఒకటే దుస్థితి.. రెక్కల కష్టం వల్లనే సామాన్యుడి నుండి ధనికుడిగా ఎదగడం, ఆ తర్వాత మళ్ళీ ఏదో కారణాన పతనమైపోయి మళ్ళీ సామాన్యుడైపోవడం. కథ, కారణాలు మాత్రమే వేరు వేరు. ఒకవేళ ఎక్కడైనా వీటి ప్రేరణ ఉండిఉన్నా కూడా "మట్టి మనిషి"కి స్వాతంత్ర్యంగా నిలబడి ఒక గొప్ప నవల అనిపించుకోదగ్గ లక్షణాలన్నీ ఉన్నాయి. సాహిత్యాన్ని అభిమానించే ప్రతి పాఠకుడూ తప్పక చదవవలసిన నవల ఇది!

Thursday, October 3, 2013

కొత్త సిరీస్ - "పాట వెంట పయనం..."



మధురమైన మన పాత తెలుగు పాటల గురించిన ఒక సిరీస్ "సారంగ" సాహిత్య వారపత్రికలో ఇవాళ నుండీ మొదలైంది. పేరు - "పాట వెంట పయనం..."

“బతుకంతా పాటలాగ సాగాలి” అని పాడుకున్నారొక కవి! పాట అంటే కేవలం సంగీతమే కాదు, అందమయిన సాహిత్యం!  ప్రతి పాటకూ ఓ ప్రత్యేకమైన పదనేపథ్యం ఉంటుంది. ఏదో ఒక విషయం పైన  రాయబడిన బోలెడు. నవ్వు, పువ్వు, వెన్నెల, జీవితం.. ఇలానన్నమాట. అలాంటి కొన్ని నేపథ్యాలను ఎన్నుకుని, ప్రతి వ్యాసంలో ఆ నేపథ్యం తాలుకూ పాటలను గుర్తుకు తెచ్చి, వినిపించే ప్రయత్నం చేయబోతోంది “పాట వెంట పయనం…”

మరి నాతోబాటూ పాట వెంట పయనానికి మీరూ రండి...

http://www.saarangabooks.com/magazine/2013/10/02/%E0%B0%AA%E0%B1%82%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%95%E0%B1%80/

Tuesday, October 1, 2013

చలువపందిరి : यारा सीली सीली..




 "The Hungry stones” అని విశ్వకవి రవీంద్రుడు రచించిన ప్రఖ్యాత కథ ఒకటి ఉంది. ఆ కథను టాగూర్ వందేళ్ళ జయంతి ఉత్సవాల సందర్భంలో ప్రముఖ బెంగాలి దర్శకుడు తపన్ సిన్హా “Khudito Pashan” అనే పేరుతో సినిమాగా తీసారు. చిత్రానికి జాతీయపురస్కారం లభించింది. మరో ముఫ్ఫై ఏళ్ల తరువాత ఈ కథ ఆధారంగానే గేయరచయిత గుల్జార్ “Lekin..” పేరుతో ఓ సినిమా తీసారు. ఈ చిత్రానికి కూడా జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రంలోని “యారా సీలీ సీలీ” అనే పాట గురించి ఈసారి చెప్పబోతున్నా..! 


ఇంతటి భావగర్భితమైన పాటలో చిత్ర కథ కూడా మిళితమై ఉంది కాబట్టి ఈసారి పాటకు 'వాక్యార్థం' రాయడం లేదు. రాసినా అర్థమంతా మారిపోతుంది కూడా! కాబట్టి 'స్వేచ్ఛానువాదం' మాత్రమే ప్రయత్నించాను. 

పూర్తి వ్యాసాన్ని క్రింద లింక్ లో చూడవచ్చు: 
http://vaakili.com/patrika/?p=3934