సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, March 10, 2013

??




ఎన్ని చికాకులు  ఎన్ని గందరగోళాలు
ఎన్ని దిగుళ్ళు  ఎన్ని నిట్టూర్పులో
బతుకుబండి నడవాలంటే
దాటాల్సినవెన్ని టుపోటులో !

ఎన్ని మాటలు  ఎన్ని మౌనాలు
ఎన్ని కూడికలు  ఎన్ని తీసివేతలో.. 
మంచితనపు చట్రంలో నిలవాలంటే
భరించాల్సినవెన్ని సమ్మెటపోటులో !!



8 comments:

శ్రీలలిత said...


శిల శిల్పంగా మారాలంటే సమ్మెటదెబ్బ తినక తప్పదండీ...

శిశిర said...

తప్పదు కదండీ మరి :)

Pranav Ainavolu said...

ఒక రోజు గర్భగుడికి ఉన్న గుమ్మం మూలవిరాట్టుని అడిగిందట - 'స్వామీ నువ్వూ నేనూ ఇద్దరమూ రాయితోనే చేయబడ్డాము. కానీ నన్ను తొక్కుతారూ, నిన్ను మొక్కుతారేందుకు?'

దానికి స్వామి - 'నేను కొన్ని వేల ఉలి దెబ్బలు తట్టుకుని కూడా నిలబడి ఉన్నాను. నువ్వు కొన్ని దెబ్బలకే పడిపోయావు.' అన్నారు.

అదీ సంగతి :)

Anonymous said...

ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ...

A Homemaker's Utopia said...

అందుకే మంచిగా ఉండాలని ప్రయత్నించకూడదండీ..:P..(J/K)

Kamudha said...

చాలా బాగుంది

తృష్ణ said...

sri lalita gaaru, Pranav gaaru, chandra, nagini, kamudha gaaru, thanks a lot for the comments.

తృష్ణ said...

sisira gaaru, thank you too :)