నా(అ)న్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు !!

Saturday, December 17, 2011



రకరకాల వంటలనూ అవలీలగా వండేయగల దిట్ట కాబట్టి "నలభీములు" అయ్యారు.

తన విజ్ఞానవిద్వత్తులను సమస్త బ్లాగుజనాలకూ పంచి "నాన్న"గారు అయ్యారు.

ఆదరాభిమానాలను అందించి బజ్జులోకంలో "భాస్కరన్న" అయ్యారు.

ఇప్పుడు ప్లస్సు లోకంలో ఏ నామాన్ని సార్ధకం చేసుకుంటారో చూడాలి...:))

ఏదేమైనా ఈవేళ(భారతకాలమానం ప్రకారం Dec.17th) మాత్రం ఈ "బహుముఖప్రజ్ఞాశాలి" Birthday boy అన్నమాట !!! Happy Happy Birthday !!


అన్నగారూ, మీ పుట్టినరోజుకు నా స్టైల్లో భోజనం మెనూ ఇదిగోండి... రేపటికి(మీ కాలమానం ప్రకారం) అన్నం ఒక్కటీ వదినగారిని వండమనండి..:))


పొద్దున్నే:


cappuccino coffee , sprouts salad, bread ఆవడ టిఫిన్






మధ్యాన్నానికి:

సూప్, పలావ్, కేరెట్ స్వీట్, వెజిటెబుల్ సలడ్, గారెలు, బూరెలు, గుత్తొంకాయ కూర, ఉల్లిపాయ పులుసు, ఉసిరావకాయ






సాయంత్రం స్నాక్స్ :

నే స్వయంగా చేసిన అరిసెలు, మురుకులు, జంతికలు







రాత్రి డిన్నర్ లోకి: 

పూరీ, చపాతి, దోశ with క్యాబేజీ+కేరెట్ పచ్చడి, స్టీం వెజ్ దోశ, పావ్ భాజీ, చివరిగా చిలకడ దుంప స్వీట్.












హమ్మయ్య...అయిపోయింది ఎరేంజ్ చేయటం...కేకు గట్రా మీ పిల్లకాయలు చూసుకుంటారు... ఇహ కడుపునిండా ఏదీ వదలకుండా తినండి...సరేనా !!


23 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

భాస్కర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

అన్నీ ఆయనకేనా. అతిధులకు ఏమి లేవా?

వేణూ శ్రీకాంత్ said...

WOW Awesome Wishes తృష్ణ గారు, అన్నీ మీ అన్నగారికేనా కాస్త మేంకూడా రుచి చూడచ్చా :-)

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సోదరా :-)

Tejaswi said...

బాగుందండీ, భా.రా.రా. గారికి మీరు ఇచ్చిన విందు....ష‌డ్ర‌సోపేతంగా.

భా.రా.రా.గారూరూరూరూ...మేలుకుని ఈ సెల్లిగారు సేసిన ఇందును లాగించండి...సూరికి, ఆరి సెల్లికి, మీ ఆడాళ్ళ‌కు కూడా పెట్టండి. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

sunita said...

భాస్కర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

kallurisailabala said...

భాస్కర్ గారికి నా తరపున కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందచేయండి.

సుజాత said...

ఎలాగూ సెలవే కదాని ఇంత భారీగా వంట చేసారా ? ఇంకేం, హాయిగా తినేసి బజ్జుంటారేమో భాస్కర్ గారు?

వనజ వనమాలి said...

భాస్కర రామిరెడ్డి గారు .. జన్మ దిన శుభాకాంక్షలు.బ్లాగ్ జనులందరికి పెద్దన్నయ్యగా నిండు నూరెళ్లు చల్లగా వర్ధిల్లాలని హౄదయ పూర్వక శుభాకాంక్షలు

Sravya Vattikuti said...
This comment has been removed by the author.
Sravya Vattikuti said...

వావ్ సూపర్ తృష్ణ గారు ,ఇంతకీ ఈ వంటలన్నీ భాస్కర్ గారికేనా మాక్కూడా ఏమన్నా రుచి చూసే అవకాశం ఉందా ?
భాస్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

మౌనముగా మనసుపాడినా said...

!!భాస్కర్!! గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

భాస్కర్ రామరాజు said...

ఏటీ?
ఇవన్నీ నాకే?
:):)
ఉప్పు తగ్గిందేవిటమ్మా వంటలో?
లాభంలేదు. మరోసారి అన్నీ నేర్పాల్సిందే...


పొట్టనిండా కమ్మని భోజనం పెట్టావమ్మా!! కృతజ్ఞతలు. ధన్యవాదాలు
మాటలు రావటంలేదు.

నా పుట్టిన్నాడు శుభాభినందనుల్ తెల్పిన బంధువులందర్కీ ధన్యవాదాలు

శ్రీలలిత said...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

subbarao said...

మిత్రులు రామిరెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఆ పార్వతీ పరమేశ్వరులు " ఆయు రా రోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని ఱె ప్ప యట్లయి కాచు గాత !

మధురవాణి said...

అనఘ నాన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. :)
పుట్టినరోజు విందు బ్రహ్మాండంగా ఉందండోయ్ తృష్ణ గారూ.. :)

Padmavalli said...

భాస్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!
తృష్ణా, విందు భజనం ఏర్పాట్లు చాలా బాగున్నాయి.

చిలమకూరు విజయమోహన్ said...

సోదరా!నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లు.

ధర్మస్థలమ్ said...

లేటయ్యాను
స్వామీ ! ఏమనుకోకండి

రసజ్ఞ said...

అన్నీ మీ అన్న గారికేనా మాకు కూడా ఏమయినా వడ్డించేది ఉందా???
భాస్కర రామ రాజు గారూ మీకు నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

SHANKAR.S said...

అనఘ, సూరిల నాన్నారికి కుసింత ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.

జయ said...

నా(అ)న్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తృష్ణ గారు మాక్కూడా కన్నులవిందు చేసారు లెండి.

Apparao Sastri said...

భా రా రా అంటే భాస్కర్ రామ రాజు గారు
కొంత మంది భా రా రే గా అనుకుంటున్నారు అని అనిపిస్తోంది
భా రా రే గారు అంటే భాస్కర్ రామ రెడ్డి గారు

తృష్ణ said...

@Apparao sastri : నేనూ అదే చెబ్దామనుకున్నానండి....ధన్యవాదాలు.

తృష్ణ said...

ఈ టపాకు వ్యాఖ్య రాసిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు. వాటా అడిగినవాళ్ళందరికీ కూడా జయగారు చెప్పినట్లు "కన్నుల విందు" అయిపోయిందనే అనుకుంటున్నాను....:)))
Thanks a lot.