సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, November 28, 2011

చాలా సేపైంది..


చాలా సేపైంది
ఎంత సేపని కూర్చోను...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..

చీకట్లు కమ్మే సంజెవేళ ఎంతసేపని నిరీక్షించడం
ఆశనిరాశల తక్కెడకి ఎటుమొగ్గాలో తెలీని సందిగ్ధం
గెలుపుఓటమిల నడుమ మనసు ఆడుతోంది కోలాటం
రేపైనా వస్తావన్నది ఒక రిక్త నమ్మకం..

జీవిత చక్రాల క్రింద నలుగుతున్న రేయీపగళ్ళు..
చూస్తూండగానే పేజీలు మారిపోతున్న కేలెండర్లు !
జ్ఞాపకాల మాటున కదలాడే నీ ఊసులు
అలుపెరుగని కెరటాల లాస్యాలు
ఎంత దూరం పరుగులెట్టినా వద్దని
మళ్ళీ నీ దరికే చేరుస్తాయినన్నవి !!

ఎదురుచూపులు నావరకే ఎందుకు
నువ్వూ నాకోసం కలవరించకూడదూ..
అని తహతహలాడుతుంది మనసు
వెర్రిది.. దానికేమి తెలుసు
నీ మనసు రాయి అని
ఈ జన్మకు అది జరగని పని అని
అయినా ఎందుకో ఈ ఎదురుచూపు..
నాకోసం నువ్వొస్తావని... కలలు తెస్తావని..

చాలా సేపైంది..
ఎంతసేపని కూర్చోనూ...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..

8 comments:

మధురవాణి said...

చాలా బాగుందండీ.. చాన్నాళ్ళ తర్వాత మీ బ్లాగ్లో ఒక కవిత రాసినట్టున్నారు కదా! :)

మనసు పలికే said...

>>ఆశనిరాశల తక్కెడకి ఎటుమొగ్గాలో తెలీని సందిగ్ధం
గెలుపుఓటమిల నడుమ మనసు ఆడుతోంది కోలాటం
జీవిత చక్రాల క్రింద నలుగుతున్న రేయీపగళ్ళు..
ఎదురుచూపులు నావరకే ఎందుకు
నువ్వూ నాకోసం కలవరించకూడదూ..

అద్భుతం అంతే.. మరో మాట లేదు తృష్ణ గారూ.

రాజ్ కుమార్ said...

baagundandee..!

, said...

baavundi!
chaannalla taruvaatha
chaala ahlaadangaa anipinchindi.

chaala alavokagaa raasinattundi.
inka raayandi.

chadive vaallu chaala mandi vunnaru.

Sridhar

జ్యోతిర్మయి said...

"జీవిత చక్రాల క్రింద నలుగుతున్న రేయీపగళ్ళు..
చూస్తూండగానే పేజీలు మారిపోతున్న కేలెండర్లు !"

సుదీర్ఘమైన నిరీక్షణ అన్నమాట...బావుంది.

Purnima said...

Cool..

నది పారుతూ ఉంటే బండరాళ్ళు కూడా ఇసుకై పోతాయంటా, కొన్ని యుగాలకే అనుకోండి, అయినా..

అలానే నిరీక్షణల ప్రవాహం, ఎంతటి రాయినైనా కరిగింజేస్తుంది.

తృష్ణ said...

@మధురవాణి: పాతదే మధురా...ఇదివరకూ సగం రాసి వదిలేసినది కనిపిస్తే పూర్తి చేసేసా...అదీ సంగతి.
థాంక్యూ.

@మనసుపలికే: థాంక్స్ అపర్ణా. మీ బ్లగ్లో టపాలు చూసాను... అందుకు కూడా మరోసారి ధన్యవాదాలు.

@రాజ్ కుమార్: ధన్యవాదాలు.

తృష్ణ said...

@శ్రీధర్: నచ్చినందుకు ధన్యవాదాలు.

@జ్యోతిర్మయి: :)) ధన్యవాదాలు.

@పూర్ణిమ: అవునా...అయితే మంచిదేకదా...:)
ధన్యవాదాలు.