సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, May 3, 2011

"Herbvia" ( Herbal Stevia Sweetner)


వచ్చేసింది వచ్చేసింది "Herbvia". i.e Herbal Stevia Sweetner. "Stevia"(http://trishnaventa.blogspot.com/2010/01/blog-post_05.html) గురించి అదివరకూ రాసాను.


ఆ మధ్యన ఒక హెర్బల్ ఎగ్జిబిషన్ లో స్టివియా పౌడర్ వచ్చింది అని చూశాను. కానీ ఎక్కడ దొరుకుతుందో వివరాలు అడగటం మర్చిపోయాను. నిన్న బజార్లో ఓ సూపర్ మార్కెట్లో స్టీవియా పౌడర్ కొందామని వెళ్ళేసరికీ ఈ Herbvia చూశాను. చుట్టూ మనుషుల్లేకపోతే హుర్రే అని అరిచే మాటే. నేను మూడేళ్ల నుంచీ పంచదార బదులు స్టీవియా పౌడర్ కొని వాడుతున్నాను. కానీ అది సమపాళ్ళలో మరిగించుకుని, పది గంటల తరువాత వడబోసి దాచి వాడటం కొంచెం శ్రమతో కూడుకున్న పనే. కానీ నేచురల్ స్వీట్నర్ అని మిగిలిన artificial sweetners కన్నా నేను దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని.


ఇప్పుడు ఇక మరిగించుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా ఈ Herbvia పిల్స్ వాడేయచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లకైతే స్టీవియా చాలా మంచిది. చాలామంది ఆర్టిషియల్ స్వీట్నర్స్ వాడలేక పంచదార లేకుండా ఏదీ తినలేక తాగలేక ఇబ్బంది పడుతూంటారు. అలాంటివారికి ఇది వరమనే చెప్పాలి. పైగా ఎక్కువకాలం artificial sweetners వాడటం వల్ల ఎన్నో ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. సుగర్ ఫ్రీ స్వీట్స్ అని బజార్లో అమ్మేస్తూ ఉంటారు. వాటిల్లో వాడే artificial sweetners డయాబెటిస్ వాళ్లకు ఎంతో హాని చేస్తాయి.

* ఇవి మెదడు మీద ఎన్నో దుష్ప్రభావాలను చూపిస్తాయి.

* గర్భవతులు వీటిని వాడితే పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* ఇవి బ్లడ్ సుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయ్యలేవు.

ఇవి కేవలం artificial sweetners యొక్క కొన్ని ముఖ్యమైన ఇబ్బందులు మాత్రమే. స్టీవియాలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స ఏవీ ఉండవు. ఈ స్టీవియాతో తయారు చేసిన Herbvia లో కూడా స్టీవియా పౌడర్ కున్న సుగుణాలే ఉన్నాయా లేవా అన్నది ఇంకా నేను ధృవీకరించుకోవాల్సి ఉంది. కానీ జనాలు ఎక్కువగా వాడే ఏస్పర్టేమ్, సర్కోస్ లాంటి artificial sweetners కన్నా డెఫినేట్ గా Herbvia నయం అని చెప్పవచ్చు.

3 comments:

anrd said...

ఈ స్టీవియా మొక్కలు ఔషధ మొక్కల ప్రదర్శన జరిగేచోట్ల అమ్మటం నేను చూశానండి. ఆ మొక్క పెరట్లో పెంచుకోవచ్చని చెప్పారు. ఆకు తింటే చాలా తీయగా ఉంది. ఇది వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అన్నది తెలియదు....

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Trishna Garu: Could you please let me know at which super market[chain] you saw this Herbvia? I could not get this Sugar Free Herbvia in Chennai? Tx!!

తృష్ణ said...

@anrd:అవునండి..ఔషధ మొక్కల ప్రదర్శనలొ ఇవి ఉంటాయి.నేను స్టీవియా సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇంతవరకు చదవలేదండీ మరి..

@గణేష్: నాకు ఇది ఒక ప్రైవేట్ సూపర్ మార్కెట్లో దొరికిందండి.మళ్ళీ ఇప్పుడు దొరకలేదు నాక్కూడా..:((
డబ్బా మీద కస్టమర్ కేర్ ఫ్.నంబర్ ఉంది. ట్రై చేయండి ఇస్తాను..079-26868666
Zydus Wellness Ltd,ahmedabad వాళ్లది.