సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 2, 2011

పాటల్లో చెత్త ఉపమానాలు


నిన్న పొద్దుటి ఊసు. ఆదివారం కదా వాకింగ్ కి బధ్ధకంగా బయల్దేరా. అంటే లేటుగా అన్నమాట. అన్ని Fms లోనూ భక్తిగీతాలు అయిపోయి సినిమా పాటలు మొదలైపోయాయి. ఇదీ బానే ఉందనుకుంటూ వింటూ నడుస్తున్నా. రోబోలోని ఓ హిట్ సాంగ్ మొదలైంది. ఈ పాట ఎలా హిట్టయ్యిందో జనాలే చెప్పాలి. చరణంలో ఏ వాక్యానికీ పొంతనలేదు. ఈ డబ్బింగ్ పాటలు పాడేవాళ్ళు చాలామటుకు తెలుగువాళ్ళు ఉండరు (తెలుగువారు కాకపోయినా తెలుగు వచ్చినవాళ్ళూ ఉంటారు). మరి తెలిసో తెలీకో ఇచ్చిన సాహిత్యాన్ని శ్రధ్ధగా పాడేస్తారు పాపం... వినే మన ఖర్మకి మనల్ని వదిలేసి.

ఇంతకీ ఇందాకటి రోబో పాటలో చిన్మయి అనుకుంటా "తేటగ ఉన్న దూటనయ్యో నన్ను నోటబెట్టెయ్ మొత్తం" అని పాడింది. ఓరి భగవంతుడా ఇదేం ఉపమానం తండ్రీ అనుకున్నా. పచ్చి దూట ఎవరన్నా కరకర నమిలి తినగలరా అసలు? తమిళంలో ఈ పాటలో ఈ వాక్యం ఇలానే ఉందో మరి ఏమన్నా మార్పులున్నాయో...లేక ఇది అనువాదకుల ప్రతిభో మరి తెలీదు. ఇలాంటి భయానక ఉపమానాలు తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసిన పాటల్లోనే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి.

వెంఠనే నాకు "బాయ్స్" సినిమాలో పాటలోని ఓ వాక్యం గుర్తుకొచ్చింది. సాధనా సర్గమ్ పాడుతుంది "కుళ్ళిపోయిన మామిడిలో జత పురుగులమౌదాం.." అంటూ. నిఘంగా ఆవిడకు ఆ వాక్యం అర్ధం తెలిస్తే ఆ పాట పాడేదా? అని డౌటొచ్చేది నాకు ఆ పాట ఎక్కడైన విన్నప్పుడల్లా.
ఎంత గాఢప్రేమికులైతే మాత్రం కుళ్ళిపోయిన పండులో పురుగులతో పొలికా? వాక్యాలకు పొంతన లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి చెత్త కంపారిజన్ లు ఎందుకు వాడతరో...తెలీదు.

'దేషం', 'ఆష', 'ఆకాషాలు' అని పాడుతూంటే చచ్చినట్లు వింటున్నాం. అవికాక ఇలాంటి
ఘోరమైన వాక్యాలు డబ్బింగ్ పాటల్లో కోకొల్లలుగా వస్తున్నా ఆదరించేస్తున్నాం. అయినా చేసేవారు చేస్తున్నారు, రాసేవాళ్ళు రాస్తున్నారు, వినే మనం వినేస్తున్నాం.


మీకూ గుర్తున్న ఇలాంటి చెత్త కొంపారిజన్లు ఏమన్నా ఉంటే తెలపండి...

12 comments:

Surya said...

sakhi movie lo "snehituda snehituda" paata vinnara? konta bhaganiki asalu arthame undadu, just raagam kosame vinali ante.

Sujata M said...

కీలిమంజారో పాటను భువన చంద్ర తెలుగు లో కి అనువదించారనుకుంటాను. మొన్నోసారి బాలూ 'పాడుతా తీయగా' లో ఆయన పద ప్రయోగాల్ని మెత్తగా ఆక్షేపిస్తే ఆయన తన ప్రాబ్లం చెప్పాడు. రెహమాన్ అనువాదకులకు అస్సలు స్వేచ్చ ఇవ్వడంట. మాతృకలో పలికే శబ్దాన్ని పోలిన పదాల్నే రాయమంటాట్ట. దీనివల్లే ఆయన పాటలంత నవ్వొచ్చేలా రాస్తాడంట. అన్నట్టు వెలింగ్టన్ (ఊటీ) లో ఒక సైనికాధికార్ల వసతి గృహం పేరు - కీలీమంజారో. దీన్ని బ్రిటీషర్లే కట్టి పేరు పెట్టార్ట. అంత బావుంటుందా కీలీమంజారో ?!

beekay said...

నా ఫేవరేట్ ఉపమానాలు మాత్రం.. కొత్త ఘర్షణ సినిమా లో 'అచ్చుల్లోనా హల్లువో.. జడ కుచ్చుల్లోనా మల్లేవో' అంటే ఎప్పుడూ నాకు అనుమానం.. 'నా జీవితం లో అంత 'misplaced' నువ్వు అనా?

ఇదే పాట లో నా కుడి యెదలో... అని ప్రారంభం అయిన వాక్యం కూడా నాకు అర్థం అవదు.. :-(

karthik said...

very well written,

i remember the song in telugu yuva and hindi yuva.. just horrible!!

Pramida said...

Sakhi lone "kaaylove chedugudugudu..." song kuda anthe.. "neellose aatallo ammalle untundo.. vedhisthu aadisthe naa bidde antundo..." idi endo...

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Totally agree with you.

Nice post :)

మనసు పలికే said...

తృష్ణ గారూ.. మొత్తానికి పొద్దు పొద్దున్నే అంత మంచి సాహితీ కళాఖండాన్ని విని ధన్యులయ్యారనమాట..;)

హహ్హహ్హా.. ఏ డబ్బింగ్ పాట గురించి అని చెప్పాలి..? అపరిచితుడులో ఉంటుంది నోకియా పాట. అబ్బో.. ఇంకా అలాంటివి చాలానే ఉన్నాయిలే. అలా అని డబ్బింగ్ పాటలన్నీ అలాగే ఉంటాయనుకోడానికి కూడా లేదు. బొంబాయి, రోజా పాటలు ఎంత బాగుంటాయో.

ఆ.సౌమ్య said...

"నాకు నీకూ నోకియా, రేపో మాపో మాఫియా కేపచ్చీనో కాఫీయా, సోఫియా" ఈ పాట విన్నరా ఎప్పుడైనా? అందులో "ప్రేమకి రూటువి నువ్వే, హాలీవుడ్ మూవీ నువ్వే, అమెరిక మేప్ వి నువ్వే..నిను నచ్చాలే" ఏమిటో ఆ పోలికలు! ఒక మనిషి అమెరికా మేప్ లా ఉండడమేమిటో! డబ్బింగ్ పాటల గురించి చెప్పకండి బాబోయ్....వికారం కలుగుతుంది.

ఆ.సౌమ్య said...

కిళీమాంజారో (రోబో) పాటలో "పెద్ద పాము మల్లె వచ్చి పిల్ల జింకను పట్టేయ్, సొంఠి మిరియం తోటి నన్ను సూపుమల్లే తాగేయ్".....జింక ని చంపే పాము కౄరత్వంలో రొమాన్స్ ని ఎలా చూడగలుగుతున్నారో ఆ పైవాడికే తెలియాలి.

సొంఠి మిరియం తాగితే గొంతులో ఎలా ఉంటుందో వీళ్లకెప్పుడైనా తెలుసా అని నా అనుమానం.

DailyBugle said...

@"కుళ్ళిపోయిన మామిడిలో జత పురుగులమౌదాం.."

ఈ వాక్యం అరవ పైత్యాన్ని యధాతధంగా దిగుమతి చేస్కున్న బాపతే

తమిళంలో ఈ పంక్తి ఇది:

"అళుగివిట్ట మాంబళత్తిల్ ఇరు వండుగళ్ నామ్ దాన్"

మక్కికి మక్కి తర్జుమా చెస్తే
"కుళ్ళిపోయిన మామిడి పండులో రెండు పురుగులు మనమే"

so, ఈ కుళ్ళు కంపు ఒరిజినల్ లోనిదే. సుజాత గారు చెప్పినట్టు రహమానుడు మాతృకలోని పదాలే పెట్టమని ఒత్తిడి పెట్టినట్టున్నాడు.

ఉన్నంతలో డబ్బింకవి(వెన్నెలకంటి?)గారు ఈ పంక్తిని కొంచెం అందంగానే (హతవిధీ!)రాశాడనే చెప్పుకోవాలి.

గిరీష్ said...

వీటికే ఇలా అయిపోతే, ఇంక అయిటం పాటలకి ఇంకేం అనాలి.. బాబోయ్, పక్కా బూతులు..iam very dip-pressed with that lyrics :(, అదేం అంటే మాస్ అంటారు..

కొత్త పాళీ said...

interesting.
The first one I encountered was Kadhalan - premikudu. "అందమైన ప్రేమరాణి" పాట మొత్తం ఇలాగే ఉంటుంది. ఆ రోజుల్లోనే చెత్తాతి చెత్తపోలికల్తో పాటరాయడాన్ని తమళకవి వైరముత్తు ఒక ఫైన్ ఆర్ట్ గా డెవలప్ చేశారు. మనోళ్ళు వాటిని యథాతథంగా దిగుమతి చేసుకుంటున్నారు.