సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, April 9, 2011

Standing ovation and three cheers to "Anna hazare"



డభ్భై ఒకటేళ్ళ ఉద్యమకర్త ఇరవై ఏళ్ల యువకుడి కన్నా ఉత్సాహవంతుడు. శక్తివంతుడు. వారం రోజుల్లో నాయకుల గుండెల్లో గుబులు పుట్టించి, యావద్దేశాన్నీ తన నినాదానికి గొంతు కలిపేలా చెయ్యగలిగాడు. నా దృష్టిలో కండలు తిరిగిన సినీ హీరోల కన్నా వెయ్యిరెట్లు ఆరాధించయోగ్యమున్నవాడు. దేశం మొత్తాన్ని కదిలించిన సంఘ సంస్కర్త ఋణాన్ని విధంగా మనం తీర్చుకోగలం? అతనే నిలబడకుంటే లోక్పాల్ బిల్లు ఆమోదాన్ని పొందేదా?

ఎవరో ఒకరు ఇలా నిలబడితేనే వెనుక నుంచి మరో పదివేల చేతులు నిలబడతాయేమో...నేనూ వెనుక నిలబడే మందలో ఒక మేకనే..! ఇలాంటి ఎందరో అన్నా హజారేలు ప్రతి గ్రామానికీ ఒక్కడు ఉంటే మన దేశం నిజంగా స్వర్ణభారతమయిపోదూ..?!
"... into that heaven of freedom, my father, let my country awake."


నా మనసులో పొంగిపొర్లుతున్న ఆనందానికీ, దేశంలోని ఇవాళ్టి విజయోత్సాహానికీ కారకుడైన మహామనీషికి నా పాదాభివందనం. Standing ovation and three cheers to "Anna hazare".


అన్నా హజారే గురించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి: http://www.annahazare.org/

6 comments:

యశోదకృష్ణ said...

same feeling.

SHANKAR.S said...

క్రికెట్, యుద్ధం వేళల్లోనే కాక నిజాయితీతో ముందడుగేసి సమస్యపై పోరాటానికి పిలుపిస్తే దేశం మొత్తం ఏకమవుతుందని నిరూపించిన అన్నా హజారే కు జోహార్లు. అయితే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువైన మన దేశంలో అవినీతి కి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ఈ ఉద్యమ స్ఫూర్తి ఏ ఐపియల్ హోరులోనో, ప్రాంతీయ వాదాల జోరులోనో కొట్టుకుపోకుండా, పాలపొంగులా చల్లారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. లేకపోతే అన్నా హజారే కృషి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

సిరిసిరిమువ్వ said...

శంకర్ గారన్నట్టు ఈ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది.

bonagiri said...

జన లోక్ పాల్ వల్ల మేలు జరుగుతుందో లేదో కాని ఈ ఉద్యమం వల్ల మన భారతీయులు మేలుకునే ఉన్నారని, స్పందించే అవకాశం కోసం వేచి చూస్తున్నారని అర్థమయ్యింది.

మరువం ఉష said...

Pray that Sri Anna Hazare's and other prominent social Activists' valiant efforts shall not go in vain. The Lokpal Bill will come in about few months say before the end 2011.

We need to fight corruption in our public dealing every day so that right to good life for every body is achieved in the most peaceful manner.

Satish Dhanekula said...

ప్రత్యక్ష స్వాతంత్ర సమరం లో పాల్గోన్నంత ఆనందం గా ఉంది ఈ ఉద్యమం లో నేను ఒక నీటి బిందువు అయినందుకు. ఈ పోరాటం ఆరంబం మాత్రమె అవ్వాలి అని ఆసిస్తూ హజారే గారికి పాదాబివందనం చేస్తున్నాను.