సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, April 2, 2011

ధమాకా all around !!

ధమాకా all around !!

ఆటగాళ్ళ కళ్ళలో.. ఆనందభాష్పాలు...

బయటంతా ...టపాసులు...హంగామా..

ఇంట్లో జనాల సంబరాలు...
"It is the proudest moment of my life" అంటున్నాడు సచిన్...
బావుంది.

ఒప్పుకుంటాను.. నేను క్రికెట్ ఎంజాయ్ చెయ్యలేను. చూడను.
ఇవాళ మేచ్ కూడా చూసినది ఆఖరి పది నిమిషాలే.

కానీ నా చుట్టూరా ఉన్న మనుషుల ఆనందాన్ని చూసి సంబరపడతాను.
మనుషుల మొహాలలో ఆనందం నన్నెంతో ఉత్సాహపెడుతుంది..

భారత్ క్రికెట్ టీం కు అభినందనలు.

4 comments:

SHANKAR.S said...

విజయం లో "రుచి...the temptation" అదేనండీ. అది ఏ రంగమైనా సరే.

మన నాయకులకి, ప్రజలకి ఈ స్ఫూర్తి ఎప్పుడొస్తుందో!!!!!!!

prabandhchowdary.pudota said...

''నా చుట్టూరా ఉన్న మనుషుల ఆనందాన్ని చూసి సంబరపడతాను.
మనుషుల మొహాలలో ఆనందం నన్నెంతో ఉత్సాహపెడుతుంది..''

Very nice andi...

చిలమకూరు విజయమోహన్ said...

నేను ఊరిలో లేకపోవడం వల్ల ఆటను ఆస్వాదించలేకపోయినా,ఇక్కడ బ్లాగుమిత్రులందరూ మంచి క్రికెట్ విందులనందించారు.జయహో భారత్.

తృష్ణ said...

@శంకర్.ఎస్: నిజమేనండి. నిన్న దేశం మొత్తం మీద కనబడ్డ సమైక్యత ప్రజలలో అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఉంటే ఎంత బాగుంటుందీ అని పదే పదే అనిపించింది.
ధన్యవాదాలు.

@ప్రబంధ్ చౌదరీ.పూదోట: ధన్యవాదాలు.

@చిలమకూరు విజయమోహన్: "నాన్న"గారి బ్లాగ్లో "రన్నింగ్ వ్యాక్యలు" , RED FM లో 'ప్రతిక' లైవ్ కామెంట్రీ చెప్పిన తీరు అన్నీ భలేగా ఉన్నాయండీ..!
ధన్యవాదలు.