సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, December 13, 2010

ఆ మేజికల్ స్వరమే "కేకే"

"दर्द में भी येह लब मुस्कुरा जाते हैं
बीते लम्हे हमें जब भी याद आते हैं ...

... आज भी जब वो मंज़र नज़र आते हैं
दिल की वीरानियॊं को मिटा जाते हैं..." (The Train)


అని వింటూంటే అప్రయత్నంగా పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది. ఆ గొంతులో ఒక ప్రత్యేకత అతడిని గొప్ప గాయకుడిగా నిలబెట్టింది. ఒక తపన, తెలియని వేదన, కాస్తంత నిర్వేదం, హృదయాన్ని కుదిపేసే భావన అన్నీ కలిసి ఒక మేజిక్ సృష్ఠిస్తే ఆ మేజికల్ స్వరమే "కేకే" అనబడే 'Krishna kumar kunnaath'ది. కేరళలో పుట్టిన మరో సౌత్ ఇండియన్ గాత్రాన్ని బోలీవుడ్ వరించింది. దేశమంతా మెచ్చింది.



"యారో..." అంటూ "పల్" ఆల్బంలోని పాటతో ఎందరో స్టూడెంట్స్ గుండెల్లో గూడు కట్టేసుకున్నాడు. "లుట్ గయే...హా లుట్ గయే..." అంటూ "హమ్ దిల్ దే చుకే" పాటతో యావత్ భారత దేశ ప్రజానీకాన్నీ ప్రేమావేశంలో ముంచేసాడు. ఇవాళ్టికీ ఆ పాట వింటే భగ్న ప్రేమ తెలియకపోయినా, మనసు తెలియని లోకాల్లోకి వెళ్పోయి...తనలోని దు:ఖ్ఖాన్నంతా సేదతీర్చేసుకుంటుంది.

"तु ही मेरी शब है सुबाह है..."(gangster) అనీ "यॆ बॆखबर..यॆ बॆखबर" (जेहर) అనీ వింటూంటే మన కోసం ఇలా ఎవరైనా పాడకూడదూ... అనే ఆశ పుట్టిస్తుంది ఆ గొంతు!


"ఆవారాపన్ బంజారాపన్..." అని "जिस्म"లో పాట వింటూంటే ఆర్ద్రతతో మనసు బరువెక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పాటలు...ఎన్నిటి గురించి చెప్పేది? ఏ పాటను వర్ణించేది? నలభైయేళ్ళ ఈ మధుర గాయకుడి పాటలు విన్నాకా అభిమానులవ్వనివారు ఎవరుంటారు? అనిపిస్తుంది నాకు.
"కేకే" పాడిన నాకిష్టమైన కొన్ని హిందీ పాటలు....

ज़िंदगी दॊ पल की (kites)
दिल क्यू मेरा (Kites)

छॊड आयॆ हुम वो गलियां (maachis)

प्यार में कभी कभी (Pyaar Mein Kabhi Kabhi)

तदप तडप के इस दिल से (हम दिल दॆ चुकॆ सनम)

यारॊं (Rockford / Pal)

मुझॆ कुछ केहना है (Mujhe Kucch Kehna Hai)

ऎ दिल दिल की दुनियां मॆं (Yaadein)

कोई कहॆ (दिल चाह्ता है)

सच केह रहा है दीवाना(रेहना सै तेरॆ दिल में)

बर्दाश (हम्राज़)

डॊला रॆ डॊला (दॆवदास)

मार डाला (दॆवदास)

रुलाती है मोहोब्बते (Kitne Door Kitne Paas)

जीना क्या जीवन सॆ हार् कॆ (Om Jai Jagadish)

आवारापन बन्जारापन (जिस्म)

चली आयी (Main Prem Ki Diwani Hoon)

ऒ अज्नबी (Main Prem Ki Diwani Hoon)

कबी खुशबू (साया)

उल्झनॊं कॊ दॆ दिया (Main Prem Ki Diwani Hoon)(duet)

दस बहानॆ (दस)

सीधॆ सॆ ढंग सॆ (सोचा न था)

गुजारिश (guzaarish)

तॆरॆ बिन (Bandish)

दर्द मॆं भी यॆ दिल (THE TRAIN )

यॆ बॆखबर (जेहर)

तु हि मेरि शब है (gangster)

ऒ मॆरी जान - (tum mile)

ప్రస్తుతానికి గుర్తున్న 'కేకే' పాడిన(నాకు నచ్చే) తెలుగు పాటలు...:


ఉప్పెనంత (ఆర్యా 2)

ఆకాశానా (మనసంతా నువ్వే)

ఎవ్వరినెప్పుడు (మనసంతా నువ్వే)

ఐయామ్ వెరీ సారీ (నువ్వే నువ్వే)

దేవుడే దిగి వచ్చినా (సంతోషం)

ఫీల్ మై లవ్ (ఆర్య)

గుర్తుకొస్తున్నాయి (నా ఆటోగ్రాఫ్)

ఓ చలియా (హోలీ)

ఊరుకో హృదయమా(నీ స్నేహం)

ఒకరికి ఒకరై (స్టూడెంట్.నం.వన్)

ప్రేమా ప్రేమా(జయం)

వెళ్తున్నా(బాస్)

తలచి తలచి చూస్తే (7G బృందావన్ కాలనీ)

5 comments:

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఎంటెక్లో ఉన్నప్పుడు కల్చరల్ ఫెస్ట్‌కి కేకే ప్రోగ్రాం అరేంజ్ చేశాం. చదువుతున్నప్పుడు ఆజ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఒక అస్సాం అమ్మాయి "అప్పిడి పోడే పోడే.." పాట అతనితోకూడా పాడింది. నాఫేవరట్ సినిమా సంతోషంలో ఫేవరెట్ పాట దేవుడే దిగివచ్చినా పాటను అతను పాడాడని తెలిసినప్పట్నుంచి ఫాన్ నేను. నువ్వు చెప్పిన ఆల్బంలలో ఏవీ నాకుతెలీదు

Somasekhar said...

Great compilation of the best from one of my favorite singers. I think it was just perfect to start off your post with "dard mein bhi yeh lab".

Srujana Ramanujan said...

సంతోషం సినిమాలోని ఆ పాటలో అతని గొంతులో సంతోషం భలే కనిపిస్తుంది. అలా ఆ ఫ్లోలో పడి కొట్టుకుని పోతాము. మనసంతా నువ్వృ లో ఆకాశానా... నా ఫావరిట్ పాటల్లో ఒకటి. నా జ్యూక్ బాక్స్ లో ఇప్పటికీ మోగుతుంటుంది :)

R Satyakiran said...

Yes! He has a very special voice. Whenever there is a situation that should touch the viewers straight and deep, he is the singer of choice.

Analogous to Rag Shivaranjani among Carnatic Ragas. (Comparison of a Bollywood singer with Carnatic Raga?....no, he is a Sounth Indian by birth)

ఆ.సౌమ్య said...

గుర్తుకొస్తున్నాయి కీరవాణి కాదా పాడింది?
నేను ఇన్నాళ్ళు అలాగే నౌకున్నా.
KK పాడారా...వావ్ హేట్స్ ఆఫ్ టు హిమ్....నాకు చాలా ఇష్టం ఈ పాట!