సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, November 26, 2010

"iam a Britannia girl"

ఇందాకా ఒక సూపర్ బజార్లో(కొత్తింటికి దగ్గరలో ఒక సూపర్ బజార్ దొరికేసింది నాకు) Britannia వాళ్ళ కొత్త బ్రాండ్ ఒకటి కనిపించింది. అంటే అది నేను చూసినది ఇప్పుడే. "Britannia NutriChoice Ragi Cookies". ఇలాగే Oat Cookies కూడా వచ్చాయిట గానీ షాపులో రాగి బిస్కెట్లే ఉన్నాయి కాబట్టి అవే కొన్నాను. ఆత్రంగా ఇంటికి వచ్చి ఒకటి కొరికాను...ప్చ్...నచ్చలేదు. మొదటిసారిగా ఒక Britannia బిస్కెట్ నాకు నచ్చలేదు. మొదటిసారి..! అంటే ఇక్కడ కొంచెం ప్లాష్ బ్యాక్ చెప్పాలి.

"iam a complan girl" లాగ "iam a Britannia girl"(ఇప్పుడిక girl కాదు woman అనాలి కదా..!) ఇంకా చెప్పాలంటే "iam a biscuit lover". చాలా మంది ఆడపిల్లలకి చాక్లెట్స్, ముఖ్యంగా డైరీ మిల్క్ చాక్లెట్స్ గట్రా ఇష్టం ఉంటాయి. కానీ నాకు చిన్నప్పటి నుంచీ బిస్కెట్లు ఇష్టం. నేను డిగ్రీలోకి వచ్చినప్పటి నుంచీ నాకు సూపర్ బజార్ లో సరుకులు కొనే డ్యూటీ ఇవ్వబడింది. ఆ పని నాకు ఇవాల్టికీ ఎంతో ఇష్టమైన పని. అందువల్ల సూపర్ బజర్కు వెళ్ళినప్పుడల్లా కొత్త బ్రాండ్ బిస్కెట్లు ఏం వచ్చాయా అని చూస్తూ ఉండేదాన్ని. క్రీం బిస్కెట్లు పెద్దగా ఇష్టపడను కానీ మిగిలిన అన్ని రకాలూ ప్రయత్నించాను. అన్నింటినీ మించి నేను Britannia ఫ్యాన్ ని. "టింగ్ టింగ్ డి డింగ్...!!"(ఇది Britannia ఏడ్లోని మ్యూజిక్ అన్నమాట). నా చిన్నప్పుడు Britannia బిస్కెట్లు పన్నెండు రూపాయిలు ఉన్న పేక్ వచ్చేది. ఆ టేస్ట్ నాకు భలే ఇష్టం. ఎప్పుడూ అవే కొనుక్కునేదాన్ని. ఇదిగో ఇలా ఉండేవి అవి.





ఆ తరువాత ఫేవొరేట్ britannia good day. ఇలాచీgood day ఒక్కటి నచ్చేది కాదు నాకు. మిగిలిన రకాలన్నీ no one can eat just one అనుకుంటూ
సుభ్భరంగా లాగించేదాన్ని. కానీ కొన్నాళ్ళకు హెల్త్ కాన్షియస్ అయ్యాకా "ఆరోగ్యానికి మంచిది", "లో కొలెస్ట్రాల్" , "హై ఇన్ ఫైబర్" అని ఉన్న బిస్కెట్లన్నీ తినటం మొదలెట్టా.(తింటే మంచిదనిపించి). అన్ని రకాలూ ఎలా ఉంటాయో అని ట్రై చేస్తూ వచ్చాను. ప్రస్తుతం బ్రిటానియావాళ్ళు "న్యూట్రీ ఛాయిస్" పేరుతో ప్రవేశపెట్టిన అన్ని రకాల బ్రాండ్లూ ట్రై చేసా. "NutriChoice Cream Cracker", " NutriChoice Digestive ", "NutriChoice Nature Spice Cracker "మొదలైనవి. అయితే అన్నింటికన్నా నాకు నచ్చినవి "NutriChoice 5 Grain". వీటి ఇరవై రూపాయిల చిన్న పేక్ గానీ నలభై రూపాయిల పెద్ద పేక్ గానీ ఎప్పుడూ ఇంట్లో ఉంచుకుంటాను.




సరే ఇంతకీ మొదట్లో రాసిన Britannia Ragi Cookies దగ్గరకు వచ్చేస్తే అందులో ఆర్టిఫీషియల్ స్వీట్నర్ ఎక్కువ వాడారు. దానితో బిస్కెట్ టేస్ట్ కన్నా తీపి తేస్ట్ ఎక్కువ అయిపోయింది. పైగా ఖరీదు కూడా ఎక్కువే పెట్టారు. టేస్ట్ బాగుంటే 5 Grain బిస్కెట్స్ లాగ worthy అనుకోవచ్చు. కానీ నాకైతే నచ్చలే మరి. ఇక వీళ్ళ ఓట్స్ కుకీస్ కూడా కొని అవి ఎలాగున్నాయో చూడాలి మరి...ఎవరన్నా ఈపాటికి తిన్నవాళ్ళుంటే చెప్పినా సరే...!! ఈ పోస్ట్ రాస్తూంటే అ మధ్యన ఎప్పుడో వేణూ శ్రీకాంత్ గారు Britannia బిస్కెట్స్ గురించి రాసిన "
టపా" గుర్తు వచ్చింది. ("టపా" మీద నొక్కితే ఆ పోస్ట్ చూడగలరు.)


6 comments:

వేణూశ్రీకాంత్ said...

సేంపించ్ తృష్ణగారు :-) బాబోయ్ నాకు 5గ్రెయిన్ బిస్కట్సే మరీ తీయగా ఉన్నట్లనిపిస్తాయి. రాగివి అంతకన్నా తియ్యగా ఉన్నాయా ఇక తిన్నట్లే... అయినా నేనూ ఈ రెండు వెరైటీలు ఈవీకెండే ప్రయత్నించి చూస్తాను.

BTW Thanks for the link. మీ పుణ్యమా అని మళ్ళీ ఓ సారి నేనుకూడానా టపా చదువుకుని వచ్చాను :)

తృష్ణ said...

ఫైవ్ గ్రైన్ లో హనీ taste ఎక్కువ కాబట్టి తియ్యగా ఉన్నా భయపడకుండా తినేయచ్చండీ. ఈ రాగి బిస్కెట్లు మాత్రం ప్రయత్నించకండి. ఓట్స్biscuits నేనూ ఎక్కడ దొరుకుతాయో చూడాలి.

సిరిసిరిమువ్వ said...

నేను బిస్కట్లు అంత ఎక్కువగా తినను కానీ వాటిల్లో రకాల గురించి బాగానే తెలుసు. ్మా ఇంట్లో ఒ బిస్కట్ బాయ్ ఉన్నాడు..మా అబ్బాయి.. ఇంకేం లేకుండా అచ్చంగా బిస్కట్లు తిని ఉండమన్నా ఉంటాడు..ఇప్పుడు కాస్త తగ్గిందనుకోండి. తినేది వాడే అయినా తెచ్చేది నేను కాబట్టి..ఎక్కువగా బ్రిటానియావే తెస్తాను. 5 గ్రెయిన్ బిస్కట్సు బాగానే ఉంటాయి. కొత్త కొత్తవి ఏమొస్తున్నాయా అని చూస్తూ ఉంటాను. దాదాపు అన్నిరకాలు తెస్తాను.

తృష్ణ said...

@సిరిసిరిమువ్వ: బహుకాల దర్శనం...thankyou verymuch.

హరే కృష్ణ said...

Wow!
how can i miss this
latest addiction 5 grains :))
ఈ పోస్ట్ నేచరల్ ఫ్రెష్ నర్ ఉన్నట్టు చాలా తియ్యగా ఉంది:)

తృష్ణ said...

@hare krishna: thank you.