Wednesday, June 23, 2010

టినేజ్ ఆర్ట్ - 2

"టీనేజ్ ఆర్ట్ - 1 " అని , creative works అనే లేబుల్ లో కొన్ని ఆర్ట్ వర్క్స్ అదివరకు నేను ఇంటర్లో,డిగ్రీలో ఉన్నప్పుడు వేసిన బొమ్మలు కొన్ని పెట్టాను. అప్పట్లో చేసిన మరికొన్ని ఆర్ట్ వర్క్స్, వేసిన బొమ్మలు ఇంకొన్ని ...


పాట్ పైంటింగ్...దాంట్లో పెట్టిన ఫ్లవర్స్ కూడా నేను తయారు చేసినవే.



అప్పట్లో "ఉత్తరాలు" బాగా రాసుకునేవాళ్ళం కాబట్టి, ఉత్తరాలు పెట్టుకునేందుకు గోడకు పెట్టుకునేలాక్రాస్ స్టిచ్ తో చేసింది .. ఉత్తరాలు పెట్టుకుందుకు వెనకాల క్లాత్ తో మూడు అరలు కుట్టాను..





కార్డ్ బోర్డ్ మీద చాక్ పౌడర్ తో ప్రయోగం..
sheet laminated 'Alpana designs' on colour chart:




కొన్ని పెన్సిల్ స్కెచెస్ ...




అసంపూర్ణ చిత్రం....అప్పట్లో ఎంత ప్రయత్నించినా మొహం వెయ్యలేక వదిలేసాను..


ఈమె ఎవరు? (guess who..?)








Tuesday, June 22, 2010

ఈ మధ్యన వేసిన రెండు గణేశ చిత్రాలు...

చాలా రోజుల తరువాత బొమ్మలపైకి మనసు వెళ్ళింది...
ఈ మధ్యన వేసిన రెండు గణేశ చిత్రాలు...
హేండ్ మేడ్ షీట్ మీద ఒకటి పోస్టర్ కలర్స్ తో..




రెండవది క్రయాన్స్ తో...




ఒక మంచి గణేశుని భక్తి గీతం కూడా వినేయండి మరి....ఈ ట్యూన్ నాకు బాగా నచ్చుతుంది.

Saturday, June 19, 2010

"పుస్తకం"లో నా రెండవ పరిచయం - "మా నాన్నగారు"



"pustakam.net" లో క్రితం ఏడు ప్రచురితమైన నా మొదటి పరిచయం వాడ్రేవు వీరలక్ష్మిగారిఆకులో ఆకునై...

ఇప్పుడు మళ్ళీ రెండవ పరిచయం -- ద్వా.నా.శాస్త్రి గారి "మా నాన్నగారు " గురించి. కీర్తిశేషులైన 62 మంది సాహితీప్రముఖుల జీవన విధానాల గురించి వారి వారి కుమారులు,కుమార్తెలు రాసిన వివరాల సంకలనం ఇది. వివరాల కోసం మరి ఓ లుక్ వేసేయండి...

చాలా మంచి పుస్తకం. ప్రతి సాహిత్య అభిమాని ఇంటా ఉండవలసిన పుస్తకం.

Friday, June 18, 2010

ఒక పాత కవిత...

ఏవో పుస్తకాలు సర్దుతూంటే ఎప్పుడో '97లో రాసిన కవిత ఒకటి కనిపించింది...చాలా రోజుల్నుంచి ఇది ఎందులో, ఎక్కడ ఉందా అని వెతుకుతున్నా..!


పట్టుచీరల రెపరెపలు, ఘాటు సెంట్ల గుబాళింపులు...
మొహమాటపు చిరునవ్వులూ, ప్రెస్టేజీ షోఅప్ లూ...
మనిషినే శాసిస్తున్న కరన్సీ నోట్లు, బ్యాంక్ బేలన్సులు...

ఇవి ఏవీ దాచలేవు - మనిషి మనసు తహతహలూ
అవి - ఎగసిపడే అంతులేని ఆశాకెరటాలు

ఇవి ఏవీ దాచలేవు - పిడికెడు గుండె సవ్వడులు
అవి - గొంతు చీల్చుకు పైగెగసే అనురాగసౌధాలు

ఇవి ఏవీ దాచలేవు - మూగకళ్ళ కన్నీటి వ్యధలు
అవి - మోముపై కదలాడే మనోభావతరంగాలు

కానీ ఇవి అన్నీ...
వెలికి రానీయవు మనిషిలోని మమతను
అజ్ఞాతమైపోయిన మానవత్వపు వెలుగును !!

Monday, June 14, 2010

మావిడి రంగులు...colours of life !


కలర్స్ ఆఫ్ లైఫ్...అంటే ఇదే అనిపించేలా ఎంత బాగున్నాయో చూడండి ఈ మావిడి కొమ్మలు..!!
ఒకే చెట్టు ఆకులకు ఇన్ని రంగులు మనకి మళ్ళీ చెట్లలో నాకు చాలా ఇష్టమైన "రావి చెట్టు"లో కనిపిస్తాయి. ఒకే చెట్టుకు ఎన్నో రంగుల ఆకులు. రీడిఫ్ మైల్ లో ఎక్కడో ఈ ఫోటో కనిపించింది...వెంఠనే బ్లాగులో దూర్చేసా...:)

Saturday, June 12, 2010

My new blogs



కూర్చుని లేవలేనమ్మ వంగుని తీర్ధానికి వెళ్ళిందని సామెత. ఉన్న ఒక్క బ్లాగ్ రాయటానికి తీరుబడి, ఓపిక ఉన్నా లేకపోయినా, కొత్తగా మరో మూడు బ్లాగులు తెరిచే సాహసం చేసింది తృష్ణ. ఇంకా ఏదో...ఏదో చెయ్యాలని తాపత్రయం.


వారం పది రోజులు క్రిందా మీదా పడి, అర్ధం కాని, అయోమయమైన బ్లాగ్ పరమైన టెక్నికల్ విషయాలతో కుస్తీలు పట్టి పట్టీ...కరువొ కాలమో... మొత్తానికి కొత్తగా ౩ బ్లాగులు తెరిచాను. అందులో రెండు నా ప్రొఫైల్లో కనబటటం లేదు. ప్రయత్నించి ప్రయత్నించి విసుగుపుట్టి వదిలేసా. ఎవరినన్న అడగచ్చు...కానీ తెలియని విషయాలు నేర్చుకోవాలనే తృష్ణ నన్నాపని చేయనివ్వలేదు. ఈ టెంప్లేట్ తో సహా మిగిలిన మూడు టెంప్లేట్స్ నేనే మార్చుకోవాలని నడుంకట్టుకుని మొత్తానికి సాధించాను. ఇలా ఎవరి సహాయం లేకుండా తెలియని విషయాలను శోధించటంలో కాస్త ఆలస్యమైనా, భలే సరదా ఉంటుంది. ఇక కొత్త బ్లాగులను కూడలికి లంకె కూడా వేసాను.

మరి ఆ బ్లాగుల వివరాలేమంటే :
1) "రుచి...the temptation"

ఇది నాకు వంటల పట్ల ఉన్న అమితమైన తృష్ణతో ఉద్భవించింది.

2)"సినిమా పేజీ"

ఇది నాకున్న సినిమా పిచ్చి ప్రకోపించటం వల్ల ఏర్పడింది.

3)"సంగీతప్రియ"

ఇక ఈ ఆఖరుది నాకు అన్నిరకాల సంగీతాల పట్ల ఉన్న ప్రేమను తెలుపుతుంది.

మరి అన్నిటిపై ఓ లుక్కేసి, నేను వాటిల్లో ఇప్పుడైనా, కొన్నాళ్ళకైనా, మరెప్పుడైనా మంచి మంచి టపాలు రాయాలని ఆశీస్సులందించేయండి.


Friday, June 4, 2010

పుట్టినరోజు "బాలు" ని rare photos..!!

తెలుగు సినీ గేయ ప్రపంచం లో ఒక యునీక్ సింగర్ గా బాలుగారు అధిరోహించిన శిఖరాలను బహుశా మరెవ్వరూ చేరుకోలేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుని తాలుకూ కొన్ని రేర్ ఫొటోస్ ను, కొన్ని జ్ఞాపకాలనూ ఈ టపాలో పంచుకుంటున్నాను.

1971లో నాన్నగారు ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు , 'సంబరాల రాంబాబు' సినిమా రిలీజ్ తరువాత మద్రాస్ నుంచి బాలుగారు వచ్చినప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యు ఫోటో ఇది. ఆకాశవాణి తరఫున ఇంటర్వ్యు చేస్తున్నది మా నాన్నగారు.


బాలుగారి పాటకు నలభై వసంతాలు పూర్తయినప్పుడు "నయనం" అనే మాసపత్రిక వారు 2007లో ఆయన గురించిన విశేషాలతో,ఆర్టికల్స్ తో ఒక ప్రత్యేక సంచిక వేసారు. గొల్లపూడి గారి "ఎలిజీలు" పుస్తకం ఆవిష్కరణ సభ + బాలు పాటకు నలభై వసంతాలు సందర్భంగా జరిగిన సన్మాన సభ తాలూకూ విశేషాలు ఆ పత్రిక లో ప్రచురించారు. అందులోనివే ఈ క్రింది ఫోటోస్ :










ఆ పుస్తకంలో ప్రచురించిన బాలుగారి బయోడేటా :

అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.

అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. నా పేరు అడిగి ఒక జోక్ కూడా వేసారుట ఆయన. (ప్రస్తుతం ఆ లెటర్ కాని ,ఆటోగ్రాఫ్ కానీ దొరకలేదు టపాలో పెడదామంటే..) ఆ తరువాత కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పటమే కాక బాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన "మహానది" సినిమా చూశాకా, బాగా నచ్చేసి, నాన్న ఆయనకు ఒక లెటర్ రాసారు. దానికి ఆయన సమాధానం రాస్తూ చివరలో నా పేరు గుర్తుంచుకుని అమ్మాయికి ఆశీస్సులు అని కూడా రాసారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది.