సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 26, 2010

"డబుల్ సెంచరీ "


"రెస్ట్ తీసుకుంటాను కొన్నాళ్ళు రాయనన్నావు...మళ్ళీ ఎందుకు రాస్తున్నావు?" అడిగాడు గత పది రోజులుగా నేను రాస్తున్న టపాలు చూసిన మా అన్నయ్య(తను నా బ్లాగ్ రెగులర్ రీడర్). కొన్నాళ్ళుగా నత్త నడక నడుస్తున్న నా బ్లాగ్ను ఒకరోజు చూసుకుంటూంటే, 187 వ టపా నంబరు చూసాను...మేనెల చివరకు బ్లాగ్ తెరిచి ఒక సంవత్సరం అవుతుంది...ఈ లోపూ 200 టపాలన్నా పూర్తి చేస్తే...ఏదో కాస్త "తుత్తి"గా ఉంటుందనిపించింది....కానీ ఆ నిర్ణయం ఎంత కష్టమైనదో తర్వాత కానీ తెలియలేదు.

బ్లాగ్ మొదలెట్టిన దగ్గరనుంచీ నెలకి 20,25 తక్కువ కాకుండా టపాలు రాసిన నాకు ఈ చివరి 10,15 రాయటం ఎంత కష్టమైందో... అది నాకే తెలుసు ! కంప్యూటర్ లేక కొన్నాళ్ళు, ఓపిక లేక కొన్నాళ్ళూ జాప్యం జరుగుతూ వచ్చింది. ...సంవత్సరం లోపూ 200టపాలు పూర్తి అవ్వాలని రూలేం లేదు...రాస్తే ఏ అవార్డులూ రావు. రాయకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఏ ఛాలెంజ్ లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. అన్నీ వీలుగా ఉన్నప్పుడు టపాలు రాయటం గొప్పేమీ కాదు...పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇలా రాయగలగటం నా మనసుకైతే సంతృప్తినే ఇచ్చింది. నిన్నటి టపాతో డబుల్ సెంచరీ పూర్తయ్యింది. రాయాలనుకున్నవి రాసాను.

బ్లాగుల గురించి ఏమీ తెలియకుండా సంవత్సరం క్రితం మే28న "తృష్ణ..." మొదలెట్టాను.ఈ సంవత్సర కాలంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులూ, పాఠాలూ...!! మరో పది రోజులకు కూడలిలో నా బ్లాగును లంకె వేయగలిగాను. మరో నెలకు "విజిటర్స్ కౌంటర్" పెట్టడం తెలిసింది. "తృష్ణ వెంట" నడుచుకుంటూ వెళ్ళాను... ఇవాళ్టికి 47,500 పై చిలుకు అతిధులు బ్లాగు చూశారు, ఎవరన్నా ఫాలో అవుతారా? అనుకున్న నా బ్లాగుకు 45 మంది నాతో నడిచేవాళ్ళు చేరారు. సుమారు 760 పైగా వ్యాఖ్యలు సంపాదించగలిగాను. వ్యాఖ్యలు రాయకపోయినా కొత్తగా టపా రాస్తే, రెగులర్గా చదివే 150 పై చిలుకు అతిధులను సంపాదించుకోగలిగాను. ఈ లెఖ్ఖలూ, పద్దులూ ఎందుకు? నా తృప్తి కోసమే. ఏ పేపర్లోనూ పడకపోయినా, ఏ బ్లాగర్ చేతా పొగడబడకపోయినా నాలాంటి సాధారణ గృహిణికి ఒక సంవత్సరం లో ఈ మాత్రం అభిమానాన్ని సంపాదించుకోవటం ఆనందం కలిగించే విషయమే.

నాకు తెలిసిన, అనుభూతికి అందిన ఎన్నో విషయాలను మరికొందరితో పంచుకోవాలని, ఇంకా ఇంకా రాయాలని ఉన్నవి... ఎన్నో ఉన్నాయి...కానీ ఇక తొందర లేదు కాబట్టి అవి మెల్లగా ఎప్పుడో....! ఎందుకంటే బ్లాగ్ వల్ల నేనెంత ఆనందాన్ని,తృప్తినీ పొందానో, అంతే సమానమైన బాధనూ, వేదననూ కూడా పొందాను. ఎందుకు బ్లాగ్ తెరిచాను? ఈ బ్లాగ్ వల్ల కదా ఇంత దు:ఖ్ఖాన్ని అనుభవిస్తున్నాను... అని బ్లాగ్ మూసేయాలని చాలాసార్లు ప్రాయత్నించాను. విరామం కూడా ప్రకటించాను. కానీ ఎప్పుడూ పదిరోజులకన్నా బ్లాగ్కు దూరంగా ఉండలేకపోయాను. ఎప్పటికప్పుడు ఏదో శక్తి నాకు అనుకున్నది రాసే అవకాశాన్ని ఇస్తూనే ఉంది. బహుశా నాలో అంతర్లీనంగా అనుభవాలనూ, సంగతులనూ పంచుకోవాలని ఉన్న తపన దానికి కారణం అయి ఉండవచ్చు. అందుకనే నేను రాసేవి ఉపయోగకరమైనవి, ఎవరినైనా ఎన్టర్టైన్ చేసేవీ అయితే మళ్ళీ మళ్ళీ రాసే అవకాశాన్ని భగవంతుడు తప్పకుండా నాకు ఇస్తాడనే నా నమ్మకం. అందుకే ఈసారి విరామాన్నీ, శెలవునీ ప్రకటించట్లేదు...:)

ఇంతకాలం ప్రత్యక్ష్యంగా వ్యాఖ్యలతో, పరోక్షంగా మౌనంతో నా బ్లాగ్ చదివి నన్ను ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు...!!జీవితంలో ఏనాడూ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ నెనెవరినీ ఇబ్బంది పెట్టి ఎరుగను. ఒకవేళ పొరపాటుగా ఎవరికైనా ఎప్పుడైనా వ్యాఖ్యల వల్ల కానీ, టపా వల్ల కానీ ఇబ్బందిని కలిగించి ఉంటే క్షమించగలరు.


ఈ టపాను ప్రముఖ ఆంగ్లకవి "Robert frost " masterpiece అయిన "Stopping By Woods on a Snowy Evening" లోని వాక్యాలతో పూర్తి చేస్తున్నాను...
"..But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep. "


37 comments:

sivaprasad said...

congrats trishna garu

జ్యోతి said...

Double congratulations and come back with more energy..

మధురవాణి said...

తృష్ణ గారూ,
ద్విశతటపోత్సవ శుభాకాంక్షలు. మీరిలాగే వేవేల పోస్టులు రాయాలని మనసారా కోరుకుంటున్నాను.
ఆలస్యంగానైనా ఎప్పుడో ఒకప్పుడు మీ బ్లాగు చదువుతూనే ఉంటాను. మీరన్న మౌనంగా చూసే వాళ్ళ కేటగిరీలో నన్ను కూడా వేస్కోవచ్చు. :-)
ఈ టపాలో మీరు చివర్లో గుర్తు చేసిన లైన్స్ సూటిగా మనసుని తాకాయి. Just Excellent!
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ బుజ్జి పాపాయి కోసం ఎదురు చూడండి. మీకు బోలెడన్ని సంతోషాలూ, సుఖశాంతులూ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

nagini said...

అభినందన మందార మాల.. అందుకోండి. మేడం! మీ 200వ పోస్ట్ కి నాదే.. తొలి కామెంట్.. సో.. నేను కూడా హ్యాపీ.. :)

Lakshmi Raghava said...

మీరు రాసే ప్రతి పొస్టూ ఒక కొత్త సమస్యలకు తలుపుతీస్తుంది ..అందరినీ ఆలొచింప చేస్త్తుంది....చాల విషయాలు తెలుస్తున్నాయి ...మీశైలి నాకిష్టం ..

జయ said...

"A thing of beauty is a joy forever: its loveliness increases; it will never pass into nothingness." Double congrats Trishna.

Hima bindu said...

."..But I have promises to keep,And miles to go before I sleep,
And miles to go before I sleep. "

.నా స్కూల్ లో చదివిన పోయం"రాబర్ట్ ఫ్రోస్ట్ "ధీ .చాల చాలా ఇష్టం ...ధన్యవాదాలండి మరొక్కసారి నా మనసు తలపులు తెరుచుకున్నాయి .

చిలమకూరు విజయమోహన్ said...

అభినందనలు అలా సాగిపోతూనే ఉండండి.

చిలమకూరు విజయమోహన్ said...

అభినందనలు అలా సాగిపోతూనే ఉండండి.

Sujata M said...

cool andi.

bhala ! sehebhash !!!

so bat ki ek bat - Ur style is addictive ! Enjoyed reading u so far. aap me kuch bat to juroor hi.

Padmarpita said...

అభినందనలు!

R Satyakiran said...

తృష్ణ గారూ, మీ ౨౦౦వ టపా చాలా బాగుంది. అచ్చం ఏదో పుస్తకం సంపాదకీయం చదువుతున్నట్టు ఉంది.
ఆల్రెడీ ఏదైనా బుక్ రాసి ఉండక పొతే వెంటనే స్టార్ట్ చేసెయ్యండి.

vijaya said...

congrats Trishna garu

భావన said...

congratulations తృష్ణ. మీ పయనం లో అంతటా వున్నానని చెప్పలేను కాని చాలా భాగమే మీ నడక ను చూసిన వ్యక్తి గా నాకు కూడా చాలా సంతోషం గా వుంది. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో మీ విజయపు ఖాతా లో వేసుకోవాలని మన్స్పూర్థి గా ఆశిస్తూ.

Unknown said...

congratulations for scoring double century.
mee anubhavaalu,anubhoothulu, paataalu mee blog dwaara maa andaritho panchukovadam nijanga harshaneeyam.
mana manasulo kalige bhavaalaki akshara roopamichchi, mana laaga alochinche vaallaninchi prothsaaham comments roopam lo andadam kooda oka vidhamaina trupthinisthundi, jeevitham nissaaranga undakunda edo uthsahaanisthundi kada!!!!
"live life, just not exist" ani nenu namme policy meekoo sarigga saripothundi,
anyways aarogyam jaagrathandi
aparna

నీహారిక said...

తృష్ణ గారు,
డబుల్ సెంచురీ శుభాకాంక్షలు.
బ్లాగుల వల్ల దుఃఖమా ఎలా???

Unknown said...

తృష్ణ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

మాలా కుమార్ said...

మీ డబుల్ సెంచరీ కీ కంగ్రాట్స్ .
మీ కొత్త పాపాయి ముచ్చట్ల తో మళ్ళీ త్వరగా వచ్చేయండి .

గీతాచార్య said...

I have something to do.

Srujana Ramanujan said...

I enjoyed reading ur blog. Congrats on double century, and waiting for many more posts. :-)

SRRao said...

తృష్ణ గారూ !
డబుల్ సెంచరీ తృష్ణ గారికి డబుల్ కంగ్రాట్స్. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది... నడిపించాలని కోరుకుంటూ.......

Kalpana Rentala said...

తృష్ణ, అభినందన మాందార మాల. మీరు ఇలాంటి టపాలు మరిన్ని రాయాలని కోరుకుంటూ....

శేఖర్ పెద్దగోపు said...

అమ్మో రెండు వందల టపాలే....గ్రేట్..డబల్ కంగ్రాట్సండీ...ఇలాగే మీరు బ్లాగింగ్ ద్వారా ఎంతో ఆనందం పొందాలని ఆశిస్తున్నాను..

Bhãskar Rãmarãju said...

తృష్ణ గారూ
మొన్ననే మీ బ్లాగు మొదటి పోస్టు నుండి ఇప్పటి పోస్టు వరకు దున్నేసాను.
మీ బ్లాగ్ ప్రయాణం చాలా బాగుంది.
౧ నుండి ౨౦౦ వందలవరకూ రావాలంటే అంత ఈజీ కాదు. మీరు నిరూపించారు.
మున్ముందు ఇంకా చక్కని టపాలు కడుతూ మమ్మానందింపజేస్తారని విశ్వసిస్తున్నా మరియూ అభిలషిస్తున్నా.

శుభాకాంక్షలు.
భాస్కర్ రామరాజు

Ramu S said...

Congratulations. Keep it up.
Ramu
apmediakaburlu.blogspot.com

Anonymous said...

hello... hapi blogging... have a nice day! just visiting here....

వేణూశ్రీకాంత్ said...

అభినందనలు తృష్ణగారు :-) ఏడాదిలో రెండొందలు పూర్తిచేయడం చెప్పుకోదగిన విశేషమే (నాకు వంద పూర్తి చేయడానికి రెండేళ్ళు పట్టింది :-p) మీరిదే స్పీడ్ లో దూసుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. మొదటి నుండీ కాకపోయినా మీ తృష్ణవెంట నేను కూడా చాలా దూరమే నడిచాను కానీ ఇంకా మీ బ్లాగ్ లో నేను చదవాల్సిన టపాలు మిగిలి ఉన్నాయ్ :-)

శిశిర said...

అభినందనలండి. ఆ 150 మందిలో నేనూ ఒకర్తిని.

Unknown said...

Trishna garu....haerty congratulations...
poni lendi me 200th post ki aina nenu mee post lu chaduvutunnanu...oka vela chusundaka pothe..
ammooo...chala miss ayyedaanni!! :)

sunita said...

Congrats........

సుజాత వేల్పూరి said...

మీరు ఇన్ని టపలు, ఇన్ని వ్యాఖ్యలు అని లెక్కలూ అవీ చెప్పక్కర్లేదు, మీదొక మంచి బ్లాగ్ అంతే! మంచి అభిరుచి ఉన్న తృష్ణ ఏడాదిలో రెండొందల టపాలు అవలీలగా రాసేసిందంటే నాకేం ఆశ్చర్యంగా లేదు.

మీ టపాల్లో సంగీతం గురించి రాసినవి నాకెంతో ఇష్టం!మన అభిరుచులు ఈ విషయంలో కలుస్తాయని అనిపిస్తూ ఉంటుంది

కంగ్రాట్స్! ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ తీసుకోవద్దు.రాస్తూనే ఉండండి!

మరువం ఉష said...

తృష్ణ, These words are from currently Bangalore-based writer Shoba Narayan [who once wrote for publications such as TIme, Newsweek, The New York Times and The Wall Street Journal] "I don't want to wake up as an old woman and wonder, 'what if?'... Better to try and fail than not have tried at all." I am sure she never failed at any that she attempted perhaps.

I quoted from her article.."Return to India: One Family's Journey To America and Back". She moved to INDIA after living in USA for 20y. These are additional details..but her words are among some triggers that inspired me to start my blog.

Likewise, I guess you have something motivated and doing something that derives satisfaction and peace. And of course no journey can be totally smooth, bumpy rides are not uncommon. Live and learn!

Best of Luck..Keep going. Like many said above yours is often times an informative and pleasant blog.

ఎందుకో ఇవాళ తెలుగు మూడ్ రాలేదు, sorry but.

Anonymous said...

అభినందనలు.
మొత్తానికి టెండూల్కర్ అయిపోయారన్నమాట.

హరే కృష్ణ said...

wow
congratulations
200*

siva said...

dup

siva said...

క౦గ్రాట్స్! మీకు రె౦డొ౦దలేమోగాని మాకు రె౦డువేల పై మాటే. ఒక్కోటీ పది సార్ల పైగా ...... మీరు గాప్ ఇచ్చినా న౦బరు పెరుగుతూనే వు౦టు౦ది!

Somasekhar said...

తృష్ణ గారు,

A journey of 1000 miles starts with a single step.

ఏడాది ముందు మీరు వేసిన ఆ మొదటి అడుగు ఎంత ఘనవిజయం సాధించింది అనే దానికి మీరు ఇప్పటి వరకు ప్రచురించిన ఈ 200 బ్లాగులు, సంపాదించుకున్న అభిమానులు నిదర్శనం.

మీ మనసుకి నచ్చిన ఈ లోకానికి మీరు తొందర గానే తిరిగి రాగలరని అశిస్తున్నాను.