సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 24, 2009

శ్రావణ జ్ఞాపకాలు ...మార్పు

శ్రావణమాసం మొదలైంది...ఇంక పండగలు మొదలు..మనసులో ఎన్నొ జ్ఞాపకాలు...శ్రావణంలో చిన్నప్పుడు పేరంటాలకి మొక్కుబడిగానే వెళ్ళేదాన్ని.తెచ్చిన శెనగలు మాత్రం అమ్మ పొగిస్తే సుభ్భరంగా తినేదాన్ని. వివాహం తరువాత నాలో చాలా మార్పు ...ఒక కూతురు నుంచి ఒక గృహిణి రూపంలోకి....అన్నదమ్ముల అనురాగం నుంచి భర్త అడుగుజాడల్లోకి మారినందుకొ తెలేదు మరి...!!

"చేతికి గాజులు వేసుకోవె..ఆడపిల్లవి అలా ఉంటే ఎలా?"
"సంకల్పం చెప్పుకుని,ఆచమనం చేసుకోవటం నేర్చుకో,కాస్త దేముడి దగ్గర దీపం పెట్టడం నేర్చుకోకపోతే ఎలా?"
"పేరంటానికి రమ్మంటే ఎందుకొ అంత బాధ?"
"మొహానికి ఆ నల్ల బొట్టేమిటి?కాస్త పెద్దది ఎర్రనిది పెట్టుకోరూ?"
"ఎంతసేపూ ఆ వి టి.వి,ఎం టి.వి,స్టార్ మూవీసు,హెచ్.బి.వో..ఇంకో చానల్ చూడనీవా మమ్మలని?"
"బట్టలు మడత పెడదామని లేదు,తోమిన గిన్నెలు సర్దుదామని లేదు,ఎంతసేపూ ఆ పుస్తకాలు పట్టుకుని లీనమైపోతుంది..ఉలుకూ పలుకూ లేకుండా!"
ఇలాంటి మందలింపులు,కసుర్లు మనం ఎప్పుడైనా లక్ష్య పెడితేగా?!

అలాటి నేను పెళ్లైన రెండు నెలలకే వచ్చిన శ్రావణం లో నొములు మొదలెట్టేసా.మడి చీరకట్టుకుని,కాళ్లకి పసుపు రాసుకుని,చేతినిండా గాజులు వేసుకుని బుధ్ధిగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించేసా.మా అన్నయ్య ఇంక నన్ను చూసి ఒకటే నవ్వు...అటునుంచి,ఇటునుంచీ నన్ను పరికించి,పరిశీలించి....బేక్ స్ట్రీట్ బోయిస్,బోయిజోన్,రిక్కి మార్టిన్ వినే నువ్వేనా?..గృ..గృ..గృహిణివైపొయావే అని ఆటపట్టించేసాడు.అద్దంలో నన్ను నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం.కానీ ఏదొ ఆనందం.సంతృప్తి.
ఊరు మారాక కూడా క్రమం తప్పకుండ దీపారాధన,సహస్రనామాలు,అమ్మ లాగ నవరాత్రుల్లొ తొమ్మిది రొజులూ పూజలు,ప్రసాదాలు చేయటం...అలవాటయిపోయాయి.

పెద్ద పండగలే కాక,సుబ్రహ్మణ్య షష్ఠి,కార్తిక పౌర్ణమి,క్షీరబ్ది ద్వాదశి,ముక్కోటి ఏకాదశి,రధ సప్తమి లాంటి పర్వదిన్నాల్లొ కూడా ఎలా పుజలు చేయాలి,ఏ స్తోత్రాలు చదువుకోవాలి అని ఫోన్లోనొ,మైల్ ద్వారానొ అమ్మని అడిగి తెలుసుకుని యధావిధిగా అవన్ని చేయటం నాకెంతో సంతృప్తి ని ఇచ్చేవి.అవన్ని మళ్ళి అమ్మకి,అత్తయ్యగారికీ ఉత్తరాల్లో రాసేదాన్ని..బాగుందమ్మా అని వాళ్ళు అంటే సంతోషం.ఉపవాసాలు,మడి ఆచారాలు,మూఢనమ్మకాలు నాకు లేవు.నమ్మకం కూడా లేదు.కానీ పర్వదినాల్లో నియమంగా యధావిధిగా పూజ చేయటం ఎందుకో మరి భలే ఇష్టం.ఏదో పరిపూర్ణత్వం పొందుతున్న భావన.

ఈ మార్పు ప్రతి ఆడపిల్లలొ కలిగేదే.గొప్పేమి కాదు.కాని కొందరు బుధ్ధిమంతులైన అమ్మాయిలు పెళ్ళి కాని క్రితం కూడా పుజాపునస్కారాలు చేస్తారు.కాని నాలాటి వాళ్ళకు బుధ్ధి,మార్పు పెళ్ళి అయ్యాకే వస్తాయేమో మరి...!!

23 comments:

Sujata M said...

నాకు పెళ్ళయ్యాక కూడా బుద్ధి రాలేదు. శ్రావణ మాసం అంటే నా పుట్తిన్రోజు వస్తుందని ఇష్టం తప్ప వేరే సెంటిమెంటు లేదు. పెళ్ళయ్యాక, మా అత్త గారి సాంగత్యంలో (ఆవిడకి ఫ్రెండ్స్ ఎక్కువ) పేరంటాలంటే ఇంకా చిరాకు. ఎందుకో ఇదంతా భేషజం, ప్రదర్శనా అనే అభిప్రాయం చిన్నపటి నుంచీ పాతుకుపోయింది. అయితే, ఈ మాసంలో గుడిలో అమ్మవారి అలంకరణలు చూడటం ఇష్టం. శ్రీ సూక్తం మాత్రం చదివి, నైవేద్యం పెట్టి తప్పుకుంటాను. మా అక్కకి అబ్బో, ప్రతి పండగా, పండగే ! గ్రాండు గా దేవుణ్ణి ముస్తాబు చేసి, చక్కగా పూజ చేస్తుంది. ఆ ముస్తాబూ, ముగ్గులూ, గుమ్మాలకి కట్టే తోరణాలూ, మామిడి కొమ్మలూ - అవీ చూడాలి. ఈ ముచ్చట కే కదా పండగలు ! చాలా బావున్నాయి మీ జ్ఞాపకాలు !

Anonymous said...

ఒహోయ్, మనం కూడా డిటో. కానీ కొంచెం రివర్సు గేరు. పెళ్లవక ముందు కన్నె నోములు, అవీ ఇవీ అన్నీ చేసేసి, పెళ్లయ్యాక కొన్నేళ్లు కూడా చేసి తర్వాత మానేశాం. మరి టైము లేదు కదా. :P యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా. అందువల్ల మనకిప్పుడు పనే దైవం, పనే నోములు, ఆఫీసే పేరంటం. :) నిత్యం శ్రావణమాసం. గుర్తుండి లంచ్ టైమ్లో తిండి తినడమే పిండివంట, లేని రోజు ఉపవాసం. హహ్హహ్హా...

తృష్ణ said...

@sujaata:పేరంటాలంటే ఇప్పటికీ చిరాకేనండి నాకు.అమ్మలక్కలంతా కలిసి వాళ్ళమిదా వీళ్లమిదా చాడీలు చెప్పుకునే ఓ సమావేశంగానే నాకు పేరంటాలు తెలుసు.కాకపోతే తోరణాలు కట్టి,పుజ చేయటం మాత్రం ఇష్టం.

@అరుణ::) :) :)
నేను ఒట్టి శ్రావణమాసం నోములే పట్టానండీ.మిగిలినవేమీ చెయ్యలేదు.అంత బుధ్ధి ఇంక రాదేమో కూడా..మాకు తెలిసిన ఒకావిడ పట్టని నోము లేదనుకోండి.ఎంత ఒపికో ఆవిడకి.ప్రతి నెలా ఏదొ ఒక వాయనం అంటూ వచ్చేవారు మా ఇంటికి.ఆ శ్రధ్ధనీ,ఓపికనీ మెచ్చాల్సిందే..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

@ తృష్ణ: నినరాత్రి మాచెల్లితో ఆన్‌లైన్‌లో కలిశాను. చీరలో చూస్తే నాక్కూడా మీఅన్నయ్యకి కలిగిన ఫీలింగ్ లాంటిదే. వెంటనే ఒక స్నాప్ క్లిక్‌చేశా.
@ సుజాత: మీ అక్కయగారు ప్రసాదాలు బాగా చేస్తారా? సమాధానం 'అవును ' ఐతే ఆమే అడ్రస్ ఇవ్వగలరు.

తృష్ణ said...

@chaitanya:వంటలే కాదు,నేను ప్రసాదాలు కూడా బాగా చేస్తాను.మరి మా address ఇవ్వనా?

లక్ష్మి said...

ప్చ్ :(

నేనేటో అప్పుడూ ఇప్పుడూ కూడా ఒకేలాగ ఉండిపోయా. ఎవరైనా నన్ను ఇది చెయ్యి అని ఫోర్స్ చేస్తే అది చస్తే చెయ్యను, సో అలా జనాలు నా మీద ప్రతాపం చూపించినకొద్దీ బిర్ర బిగుసుకుపోయా. కొన్ని కొన్ని పండుగలకి మాత్రం బుద్ధిగా అన్నీ చేస్తా, లేదంటే దేవుడికి "హెలో బాస్, అక్కడ అంతా క్షేమమా? ఇక్కడ తమరి దయవల్ల ఆల్ హ్యాపీస్" అని చెప్పి బండి లాగించేస్తా

మురళి said...

'ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా?' అని ఆశ్చర్య పోతూ కామెంటబోతుంటే చైతన్య గారు మరో షాక్ ఇచ్చారు.. బాగున్నాయి మీ కబుర్లు..

తృష్ణ said...
This comment has been removed by the author.
తృష్ణ said...

@ లక్ష్మి:"ఎవరైనా నన్ను ఇది చెయ్యి అని ఫోర్స్ చేస్తే అది చస్తే చెయ్యను, సో అలా జనాలు నా మీద ప్రతాపం చూపించినకొద్దీ బిర్ర బిగుసుకుపోయా." కొన్ని విషయాల్లొ నేనూ ఇంతేనండీ..కానీ అప్పుడప్పుడు కొన్ని తప్పలేదు నాకు..

@ మురళి: ఉంటారండి.అమెరికాలో ఉన్న నా ఒక స్నేహితురాలు అక్కడ ఒక గుడికి వెళ్ళి మరీ బాబాగారి పారాయణ అదీ చేస్తుంది.దినికేమంటారు? :) :)

పరిమళం said...

తృష్ణ గారూ ! నేను మాత్రం పెళ్ళికి ముందు అమ్మమ్మ , అమ్మల వెంట ...ఆ తర్వాత మావారి అమ్మమ్మగారి పర్యవేక్షణలో పూజలు బాగానే చేశానండీ ...ఇప్పటికీ నాకు వీలైనంతలో అన్నీ చేస్తాను ...మీ టపా ఆనాటి జ్ఞాపకాల్ని తడిమింది .

కామేశ్వరి said...

బావుందండీ మీ ఙాపకం! మనుషులు ఎప్పుడూ తమ కి తెలిసిన పేటర్న్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ఆందుకే మనకి మన పెద్దలు చేసిన పనులు మనమూ చేస్తూంటే ఒక తెలియని సంతృప్తి కలుగుతుంది. ఈ రోజుల్లొ కూడా ఇలాంటి వారు ఉంటార అని అనుకునే వాళ్ళకీ, ఇలాంటివి నచ్చని వాళ్ళకి ఒక చిన్న మనవి సాంప్రదాయాలు కొన్ని కారణాల వల్ల ఏర్పడబడినవి. పూర్వ కాలంలో నెట్వర్కింగ్ కి పేరంటాలు ఆయువుపట్టు. కానీ మనము దానిని దుర్వినియోగం చేసి అం‍దరి మీదా చాడీలు చెప్పుకునేందుకు వాడుకుంటే అది మన తప్పా లేక పెరంటాల తప్పా? ఆలోచించండి

Bhãskar Rãmarãju said...

:):)
ఆరోజుల్లో మేము ఇలా చేయలేదమ్మా!! ఇదేంఇ చోద్యం, ఇదేమి పద్ధతి? కలికలం కాకపోతేనూ.
వాయనాలకి వెళ్ళేవాళ్ళామా, ఇస్తినయ్యవాయనం అనగానే, పెద్దల అనుమత్తీస్కుని, అప్పుడు పుచ్చుకుంటినయ్య వాయనం అని చెప్పేవాళ్ళాం భయభక్తులతో. :):)
మా అమ్మ, ఇప్పట్లో మావిడాయ్, పొద్దున్నేలేచి, కాపీ గట్రా కూడా మడి గట్రా తోనే, నిద్దళ్ళు కూడా మడితోనే ...
కాషీపోష్కుని మడికట్టుకుని. మోచేత్తాకా మట్టిగాజులేస్కుని...
మొగుళ్ళు వారేవా, ఇయ్యాల గారెలు అని బుగ్గలు నొక్కుకుంటుంటే ఆడోళ్ళు వచ్చి అచ్చింతలు చేతులో ఎప్పుడుపెడతారా ఎప్పుడు దీవించేసి ఇక పట్రా గారెలు అని అందామా అని వెదురుసుసేవాళ్ళు. :):)

>>తెచ్చిన శెనగలు మాత్రం అమ్మ పొగిస్తే సుభ్భరంగా తినేదాన్ని.
పొగిస్తే అంటే ఏంటండి? వేయించటమా?

Bhãskar Rãmarãju said...

మురళి భాయ్ - మావిడ నెలకోసారి శ్రావణమాసం నోములు చేస్తుంది :):)
(స్వగతం - తను చూడదని ఈ ధైర్యం)

తృష్ణ said...

@ పరిమళం:అయితే మిరు "వెరీ గుడ్ గాళ్" అన్నమాట!!

@ కామేశ్వరి: పొద్దున్న చూసిన టపా మిదేనా?మిరు చెప్పినది నుటికి నూరుపాళ్లనిజం.తప్పు "పేరంటాళ్లది కాదు" మనదేనండి.

Memory Makers said...

తృష్ణ గారు!నెను మీలాగె రికీ మర్టిన్,ఛానెల్ వి చూసెదాన్ని.ఇప్పుడు శ్రావణ మ౦గళవారాలు,వైభవ లక్ష్మీ వ్రత౦,16ఫలాల నోము అన్నీ చేస్తున్నాను.బాగు౦ది మీ పొస్ట్.

తృష్ణ said...

@ భాస్కర్ రామరాజు:పాత రొజుల్లొ మా అమ్మ కూడా రొజూ మడి కట్టుకునేది.మా మామ్మగారి ఇంట్లో నైవేద్యం పెట్టాకనే భొజనం.
అంట చేత్తొ నేతి గిన్నె ముట్టుకున్నా మహాపరాధం!!
మడి,మడి,మడి .....చాలా భయపెట్టేసేవారండి బాబు!

"పొగచటం" అంటే పోపు వేసి అందులొ శెనగలు వేసి ఉడకపెట్టడం.చిన్నప్పుదు అమ్మ ఇత్తడి గిన్నెలో అలా పొగుస్తు ఉండేది.(అప్పుడు బుల్లి కుక్కర్లు లేవు మరి)

తృష్ణ said...

@haritha:wow!great madam.same pinch :) :)
మీది కుక్కరీ బ్లాగా?భలే...

Bhãskar Rãmarãju said...

హరిత గారూ నమస్తే -
>>ఇప్పుడు శ్రావణ మ౦గళవారాలు,వైభవ లక్ష్మీ వ్రత౦,16ఫలాల నోము అన్నీ చేస్తున్నాను.
ఇవి ప్రతీ నెల చెస్తారా మీరూ?

Bhãskar Rãmarãju said...

హరిత గారూ
మీ కుక్కరీ బ్లాగులో పోస్టులు అపెసారేంటి?

Anonymous said...

చాలా బావున్నాయి మీ జ్ఞాపకాలు !

తృష్ణ said...

@ nelabaludu:dhanyavaadaalu.

Memory Makers said...

కుకరీ బ్లాగా?పాప౦ ఇ౦టి నలభీమ కి పోటీ యె౦దుకని ఆపేసాన౦డి.

తృష్ణ said...

@ haritha:(viShayam ardham ayyaakaa) ha..ha..ha...thats great fun andi :) :)