సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 16, 2009

ఒక కాఫీ కధ:

( ఇది గత రెండురొజుల టాపాలు చదివినవారికి---"ఇంక పడిన బాధ చాలు.పదమని శ్రీవారు వెంట పెట్టుకెళ్ళి కొత్త కీపాడ్ కొనిపెట్టారు.నేను వెన్ఠనే కొనక పోవటానికి ఒక కారణం ఉంది."ఏ వస్తువైనా నువ్వు ఆడగ్గానే కొనేస్తే ఆ వస్తువు విలువ నీకు తెలీదు.ఒకవేళ అది ఏదైనా పాడయినదయితే నాలుగురోజులు ఆగి కొంటే, మళ్ళీ ఎప్పుడూ ఆ వస్తువుని నువ్వు పాడుచేసుకోవు" అనేది నాన్న చెప్పిన సూత్రాల్లో ఒకటి.)
ఇక టపా లోకి:

ఒక కాఫీ కధ:

అనగనగా ఒక అమ్మాయి.ఆ అమ్మాయికి పాల వాసన గిట్టదు.వాళ్ళ అమ్మ పాలు కలిపి ఇస్తే అమ్మ చూడకుండా మొక్కల్లో పారబోసేది.కొన్నాళ్ళకా విషయం గ్రహించి వాళ్ళమ్మ హార్లిక్స్ కొనడం మొదలెట్టింది.ఏడవతరగతి దాకా బాగానే గడిచింది.తరువాత వాళ్ళ మేనమామకి ఆ ఊరు బదిలీ అయ్యింది.వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా పాలు ఇస్తే తాగేది కాదు ఆ అమ్మాయి.అందుకని వాళ్ళ అత్తయ్య పాలలో2,3 చుక్కలు కాఫీ డికాషన్ వేసి ఇచ్చేది.ఆ రుచి చాలా నచ్చేది ఆ అమ్మాయికి.అప్పుడే కాఫీ ఏమిటని వాళ్ళ అమ్మ,ఇంటికి వస్తే ఏదో ఒకటి తాగించకుండా ఎలా పంపటం అని వాళ్ళ అత్తయ్య ఆర్గ్యూ చేసుకుంటూ ఉండేవారు.ఇంట్లో కూడా అలా కాఫీ చుక్కలు వేసి ఇమ్మని ఆ అమ్మాయి రోజూ వాళ్ళమ్మతొ పేచీ పడేది.వాళ్ళింట్లో వాళ్ళ నాన్న ఒక్కరే కాఫీ తాగేది.మిగతావారు బోర్నవీటా తాగేవారు.ఆ పిల్ల పోరు పడలేక "కాలేజీలోకి వచ్చాకనే కాఫీ" అని తీర్పు ఇచ్చేసింది వాళ్ళమ్మ.అలా "కాఫీ" కోసం పదవతరగతి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసింది ఆ అమ్మాయి.


ఇంటరు,కాఫి రెండూ మొదలయ్యాయి.డిగ్రీ అయ్యాకా నాన్నకు,తనకు తానే కాఫీ చేసేది ఆ అమ్మాయి.(వంటొచ్చిన వాళ్ళాతో ఇబ్బంది ఏమిటంటే,వాళ్ళకి ఎవరి వంటా నచ్చదు-కాఫీతో సహా..)పళ్ళు తోమగానే డికాషన్ తీసేయటం,పాలపేకెట్టు కాచిన వెంఠనే వేడి వేడి కాఫీ తాగేయటం...పొద్దున్నే ఆ కాఫీ తాగుతూ న్యూస్ పేపరు తిరగేయటం....ఆమె దినచర్యలో భాగాలు.ఇలా కొన్నేళ్ళు గడిచాకా ఆ అమ్మాయికి కాఫీ రుచి మార్చాలనిపించింది.బ్రూక్ బాన్డ్ పౌడర్ కన్నా మంచిదాని కోసం వెతకటం మొదలెట్టింది.ఒకచోట కాఫీ గింజలు మర ఆడి ఇవ్వటం చూసింది.ఇక అప్పటినుంచీ ప్రతినెలా అక్కడకు వెళ్ళి కాఫీగింజలు మరాడించి ఫ్రెష్ కాఫీ పౌడర్ తిసుకెళ్ళేది.మర ఆడేప్పుడు గింజలు,చికోరీ పాళ్ళు మార్చి ప్రయోగాలు కూడా చేసేది.


కొన్నాళ్ళకు ఆ అమ్మాయికి పెళ్ళయింది. బొంబాయి వెళ్ళింది.అక్కడ ఇంకో చిక్కు.వాళ్ళుండే ప్రాంతంలో కాఫీ పొడి ఆడే కొట్టు లేదు.కొన్నాళ్ళు పుట్టింటినుంచి తెచ్చుకుంది కాఫీపొడి.ఆ తరువాత "మాతుంగా" అనే ఒక చిన్న సైజు తమిళనాడు ప్రాంతంలో ఆమెకు ఒక కన్నడా కాఫీ కొట్టు దొరికింది.ఆ కాఫీ వాసన ఆ వీధి చివరి దాకా వస్తూంటే,గుండెలనిండా కాఫీ వాసన నింపుకుని అనిర్వచనీయమైన ఆనందంతో
కాఫీ పొడి కొనుక్కుని ఇల్లు చేరేది ఆ చిన్నది.అలా కొంత కాలం గడిచింది...

అకస్మాత్తుగా అనుకోని కొన్ని అవాంతరాల వల్ల, ఒకానొక నిముషంలో ఆ అమ్మాయి "చాలా ఇష్టమైన దాన్ని వదిలేస్తాను" అని దణ్ణం పెట్టేసుకుంది...చాలా ఇష్టమైనదేముంది "కాఫీ" తప్ప?...అంతే మరి ఆ అమ్మాయి కాఫీ మానేసింది.దణ్ణానికో,భక్తికో.... ఆ కారణం నెరవేరింది.!ఆ అమ్మాయి మరింక ఎప్పుడూ కాఫీ తాగలేదు....
కాఫీ వాసన వేసినప్పుడాల్లా మనసు చివుక్కుమంటుంది...41/2ఏళ్ళు అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పటిదాకా మళ్ళీ కాఫీ తాగలేదు.కాఫీవాసన వచ్చినప్పుడు మాత్రం గుండెలనిండా ఆ గాలి పీల్చుకుని తృప్తి పడిపోతుంది..!! ఆ కాఫీ లోటుని మాత్రం రకరకాల టీ ల ( గ్రీన్ టీ,బ్లేక్ టీ,అల్లం టీ,అయ్స్ టీ, లెమన్ టీ,ఆరెంజ్ టీ,పుదీనా టీ,మసాలా టీ,గులాబీ టీ,డస్ట్ టీ,లీఫ్ టీ...etc ) ద్వారా భర్తీ చేసుకుంది.



ఈ కధ వల్ల నేను తెలుసుకున్న నీతి ఏమిటంటే....మనం చాలా అలవాట్లని (మంచివైనా,చెడ్డవైనా) మానుకోలేము అనుకుంటాము.కానీ దేనినైనా చేయగల శక్తి మనకు దేముడు ఇచ్చాడు.ఏ అలవాటు నైనా నేర్చుకునే,మానుకునే శక్తి మనలోనే ఉంది అని ....!




20 comments:

నీహారిక said...

అయ్యో కాఫీ వదిలేసారా?

మురళి said...

ముందుగా కొత్త కీబోర్డు వారైనందుకు అభినందనలు.. ఈ ఇష్టమైనవి మానేయడం అన్న అలవాటు నాకూ ఉందండి.. ఒక్కోసారి పెద్ద కారణాలు కూడా ఉండవు..

మీ శ్రేయోభిలాషి said...

ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఉంటాయి. అయినా ఉబుసుపొక అడుకుతున్నా ఎందుకు మానేసారండి బంగారం లాంటి కాఫి?
మనకి ఇష్టమయిన వాటిని వదిలేసి బగవంతుడితొ ట్రేడింగు చేయటం...నాకయితే నచ్చదు.

తృష్ణ said...

@మీ శ్రేయోభిలాషి : ఆపదలో ఉన్నప్పుడు, భగవంతుణ్ని వేడుకోవాలన్నప్పుడు,"ఇంత ఇష్టమైనదాన్ని వదిలేస్తున్నానంటే--ఒక మోహం లోంచి బయటపడుతున్నాను అని.." దేముడికి మన ప్రార్ధనతో నమ్మకం కలిగించే ప్రయత్నం చెయ్యటం.అది నాకూ,దేముడికి ఉన్న రిలేషన్...మా ఇద్దరి ఒప్పందాలకీ నేనెవరికీ సంజాయిషీ ఇచ్చుకోను.నే కాఫీ వదిలేయటానికి బలమైన కారణమే ఉందండీ.
దేముడితొ ట్రేడింగ్ అంటే--నువ్వు నాకది ఇస్తే నేను ఫలానాది చేస్తాను అని మొక్కటం.(ప్రదక్షిణలు,మెట్లెక్కటాలు..మొదలైనవి)
నేనలాటి మొక్కుల జోలికి వెళ్ళాలంటే నాకు భయం:)
ఇది కూడా ఎవరి నమ్మకం వాళ్ళదనికోండి.
anyways thanks for the visit sir.

తృష్ణ said...

@ నీహారిక:
ప్రస్తుతానికి no regretsఅండీ.రకరకాల టీ రుచులతో కొత్త ఆనందాన్ని వెతికేసుకున్నా లెండి.

@ మురళి:నేను మాత్రం బలమైన కారణం లేకుండా ఏ ఇష్టమైనదాన్ని వదలనండీ...చాలా స్వార్ధపరురలిని!!

తృష్ణ said...

@మీ శ్రేయోభిలాషి :ఇందకా ఇంకొక విషయం మరిచానండీ.మనిషి లోని అహంకారం జుట్టులో ఉంటుందిట.అది దేముడికి సమర్పించటం అంటే మనిషి తన అహాన్ని విడిచి అన్యధా శరణం నాస్తి అని వేడుకొవటం అన్నమాట.కాబట్టి --"తలనిలాలు ఇచ్చే మొక్కు" లొ కూడ ఒక అంతరార్ధం ఉందండి.ఇది కూడా ట్రేడింగ్ లెఖ్ఖలొకి రాదండి.
ఒక్క ప్రశ్నకి ఇంత క్లాసు పీకుతొందే అని తిట్టుకోకండెం!!

బ్లాగాగ్ని said...

కాఫీ విషయంలో నేనూ మీకు డిట్టోయే. కానీ నేనింకా వదిలెయ్యలేదులేండి. బాగా వ్రాశారు.

తృష్ణ said...

@ బ్లాగాగ్ని:your blag is too good.i have to download those chandamaama serials first.those heroic stories are my childhood favourites.thankyou for the visit.

Ram Krish Reddy Kotla said...

Bagundandee mee coffee katha..nijame, denni ayina thyajinche sakthi aa devumu manaku ichaadu..manam adi kanugonte chaalu...

కొత్త పాళీ said...

very interesting.
My relation with coffee was not as romantic, but was certainly as passionate if not more. I too gave it up, almost 8 years ago, for a very mundane reason though!
You're absolutely right that you don't have to justify such feelings/decisions.

తృష్ణ said...

@kishanreddy: thank you .

కొత్తపాళీగారు,అయితే నాకన్నా మీరు నాలుగెళ్ళు ఎక్కువ టి తాగారన్న మాట:)
నాలాటి వాళ్ళు ఇంకొందరున్నరని "తుత్తి" పడచ్చు నేను!!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

సినిమా బాలేదని తెరలు చించేస్తామా? కీబోర్డు మీద మజ్జిగపోసి కాఫీ ఆపడమా? ఎంటో జీవితం. హహహ

తృష్ణ said...

చైతన్యా,అది జొకా?పోస్టు సరిగ్గా చదివావా? మజ్జిగ పోసి నాలుగున్నర రొజులు,కాఫి ఆపి నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది..!!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

sorry. :( I didnt observe.

Surabhi said...

Good post Trishna gaaru,
My relation is with Tea, though I have not stopped drinking.
My mother was quite against me drinking tea. Even when I was in college she never used to let me drink tea. when we visited any guests home at their entrance itself I use to say to my mom that don't tell them 'maa chinni tea taagadu' atleast let me drink it here and always use to wait for Tea.
Now whenever I drink tea I feel my mom close by.
I also believe in giving up something you like and have the same reasoning as you.

తృష్ణ said...

@surabhi: thankyou verymuch for sharing your memories...

హరే కృష్ణ said...

నేను ఇప్పుడే చూసాను ఈ పోస్ట్
http://harekrishna1.blogspot.com/2009/06/blog-post.html
అంత ఇష్టమైన కూడా వదిలేయడమా :(
బావుంది మీ శైలి ..అభినందనలు

Mauli said...

baagundandeee...nenooka danne mokka lalo paalu posindi anukonna ...

naku ippudu oka bhayam pattukondi ..nendaina vadalali ante adi ila blogs kani books kaani chadavatam ....ammmo....deenikanna ...aa problem ye face chesestanu andi yentha kastam ayina...:)

తృష్ణ said...

@ Testingwheel: thanks for the visit.నాకేదో ఇబ్బంది వచ్చిందని అందరికీ అల రావాలని లేదు కదండి..మీకే problems రావు!భయపడకండి.

SHANKAR.S said...

"కాఫీ" కోసం పదవతరగతి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసింది ఆ అమ్మాయి."

మీలాగే నేనూను. పెద్దయ్యాకే కాఫీ / టీలు అంటారు, ఎప్పుడైనా మా తమ్ముడితో గొడవపడుతుంటే ఇంత పెద్దవాడయ్యవు తమ్ముడితో గొడవ పడచ్చా అని ఎవరైనా అంటే అయితే పెద్దోడ్నయిపోయా కదా ఇప్పుడు కాఫీ తాగచ్చా అని వెంటనే అడిగితే పిల్ల చేష్టలు అనేవారు. (ఈ పెద్దోల్లున్నారే.......అనిపించేది)

"కొన్నాళ్ళకు ఆ అమ్మాయికి పెళ్ళయింది. బొంబాయి వెళ్ళింది.అక్కడ ఇంకో చిక్కు.వాళ్ళుండే ప్రాంతంలో కాఫీ పొడి ఆడే కొట్టు లేదు."

ఇది చదివాక సుమతీ శతక పద్యానికి శ్రీ శ్రీ గారి పేరడీ గుర్తొచ్చింది.

ఎప్పుడు పడితే అప్పుడు
కప్పుడు కాఫీనొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ


"టీ ల ( గ్రీన్ టీ,బ్లేక్ టీ,అల్లం టీ,అయ్స్ టీ, లెమన్ టీ,ఆరెంజ్ టీ,పుదీనా టీ,మసాలా టీ,గులాబీ టీ,డస్ట్ టీ,లీఫ్ టీ...etc )"
నేను కాఫీని ఆస్వాదిస్తా గానీ టీని ప్రేమించినంతగా ఇష్టపడను. అగ్రస్థానం టీ దే. అసలు మనిషి పు"ట్టి"న దగ్గరనుండి కా"టి"కి పోయే వరకు టీ లేకుండా బ్రతకలేడు అని నా ఖచ్చితమైన నమ్మకం. కాబట్టి టీకే నా తొలి ఓటు, కాశ్మీరీ చాయి తాగారా? మాంచి చలిలో బ్లాక్ టీలో సాల్ట్ వేసుకుని అందులో బన్ను ముంచుకుని వేడి వేడి గా తాగుతుంటే మహప్రభో బెమ్మాన్డమంటే బెమ్మాన్డమే!!! ఇంట్లో మొన్నటిదాకా మామూలుటీ, మసాలా టీ తాగేవాడిని. ఈ మధ్య గ్రీన్ టీకి అలవాటు పడిపోయా.