సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 10, 2009

సినిమా సరదా...

నిన్న సాయంత్రం పాపకి హోమ్ వర్క్ లేదు కదా అని టి.వి.పెట్టాను.టి.వి ముందు కూర్చుని పుర్తి సినిమా చూసి చాలా రొజులు అయ్యింది...చానల్స్ తిప్పుతున్న నా కళ్ళు స్టార్ మూవీస్ దగ్గర ఆగిపొయాయి."outsourced" అనే కిచిడీ సినిమా(సగం హిందీ,సగం ఇంగ్లీషు కలిపి ఉండేవి) వస్తోంది.సగం అయిపోయింది.ఎందుకొ కట్టేయాలనిపించలేదు.మిగిలిన సగం సినిమా చూసేసాను.అబ్బ! అనేలా లేదు కానీ...బానే ఉంది.Josh Hamilton, Ayesha Dharker ప్రధాన పాత్రధారులు.ఉద్యొగరీత్యాఇండియా వచ్చిన ఒక అమెరికన్ కి ఎదురైన రకరకాల అనుభవాలు,అవి అతనిలొ తెచ్చిన మార్పు కధాంశం.మనదేవుళ్ళ గురించి,గుడీలో శివలింగం ఆ రూపంలో ఎందుకు ఉంటుంది,బొట్టుఎందుకుపెట్టుకుంటారు....ఇలాటి కొన్ని విషయాలను హీరోయిన్ అమెరికనబ్బాయికి చెప్పిన వాక్యాలు బాగున్నాయ్.నెట్లోకి వెళ్ళి సినిమాడీటైల్స్ చూసా.2006లో వచ్చిన ఈ సినిమా రకరకాల 6అవార్డ్ లుకూడా దక్కించుకున్నదట.ఇలాటి కిచిడీ సినిమా ఓటి అప్పుడెప్పుడో ఇంకోటి చూసా "Flavours" అని.అది చాలా నచ్చింది నాకు.అమెరికాలొ సెటిల్ అయిన కొందరు భారతియుల జీవితాలను విడి విడిగా చూపిస్తూ, అఖరుకి అందరి కధలనీ ఒకే plotలోకి అల్లిన ఆ స్క్రీన్ ప్లే బాగుంటుంది.
సినిమాలు అందరూ చూస్తారు.అదేంగొప్ప కాదు.కానీ ఎంపిక చేసుకుని సినిమాలు చూడటం అనేది నాకు అమ్మానాన్నలు నేర్పారు. సినిమాలు చూసే అలవాటు ఎలా అయ్యిందంటే....
బెజవాడలో మా ఇంటి దగ్గర "విజయ టాకీస్" అనే సినిమా హాలు ఉండేది. అందులో అన్నీ పాత తెలుగు సినిమాలు వచ్చేవి.మా అమ్మ అవన్ని మా పిల్లలకు చూపించేది.చిక్కడు దొరకడు,గండికోట రహస్యం,పాతాళభైరవి లాంటి జానపదాలు,సీతారామ కల్యాణం,లవకుశ,భీష్మ,శ్రీకృష్ణపాండవీయం,లాంటి పౌరాణికాలు,భక్త ప్రహ్లాద,భక్త రామదాసు, త్యాగయ్య,మహాకవి కాళిదాసు..లాంటి భక్తి చిత్రాలు, మూగ మనసులు,లక్ష్మీ నివాసం, దేవదాసు, ఆరాధన, బాటసారి,మంచి మనసులు,డాక్టర్ చక్రవర్తి లాంటి సామాజిక చిత్రాలు మొదలైనవన్నీ చూపించేది.పాత తెలుగు సినిమాలను,వాటి విలువలను మాకు తెలియచెయ్యాలని అమ్మ తాపత్రయపడేది.
నాన్న Madras film institute student కావటం వల్ల ఆయన ఆ ఇంట్రస్ట్ తో మాకు అన్ని భాషల సినిమాలూ చూపించేవారు.ఫిల్మ్ డివిజన్ వాళ్లు అంతర్జాతీయ చిత్రాలను తెచ్చి ప్రదర్శిస్తూ ఉండేవారు.Russian,German,Italian,Chinese ఇలా వాళ్ళు తెచ్చిన వివిధ దేశాల చిత్రాలను కొన్నింటిని చూపించేవారు నాన్న. బందర్ రోడ్డు చివరికి వెళ్తే "లీలా మహల్" అని ఇంకో హాలు ఉండేది.దానిలో అన్నీ ఇంగ్లీషు సినిమాలు వచ్చేవి. నాన్న మమ్మలను వాటికి తీసుకువెళ్ళేవారు.The Sound of music,speilberg తీసిన అన్ని సినిమాలు,walt Disney productionsవాళ్లవి,Laurel Hardy వి,Charlie chaplin వి, Jungle book,Sidney poitierది "A patch of blue",BenHar,Ten commandments,20,000 Leagues under the sea,For a fewdollers more , Speed,Absolute power, matrix.... ఇలా "A"సర్టిఫికేట్ సినిమాలు తప్పించి ఆ హాల్లొ కొచ్చిన ఎన్నొ మంచి మంచి సినిమాలు చూపించేవారు నాన్న.అందరం కలిసి అయితే తెలుగు,హిందీ సినిమాలు చూసేవాళ్ళం.తెలుగులో అయితే బాలచందర్,విశ్వనాథ్,బాపు,వంశీ,మణిరత్నం,జంధ్యాల,కృష్ణవంశి....ఇలా కొందరు ఉత్తమదర్శకులు తీసిన సినిమాలే చూపించేవారు...అలా అలవాటయ్యింది మాకు సరైన ఎంపికతొ సినిమాలు చూడటం అనేది.ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రాంతీయ భాషాచిత్రాలు,రాత్రిళ్ళు అప్పుడప్పుడు వేసే వివిధ భాషాచిత్రాలు మాత్రమే చూసేవాళ్లం.అలా చూసినవే Satyajit ray,shyam benegal,Guru dutt,Raj kapoor,kishore kumar,bimal roy,Hrishikesh mukharjee...మొదలైన హేమాహేమీల సినిమాలన్ని దురదర్శన్ వాళ్ళు వేస్తే చూసినవే.తరువాత కేబుల్ టి.వి.పుణ్యమా అని వందల కొద్దీ చానల్స్ లో నానారకాల సినిమాలూ..!!వి.సి.డి ల తరువాత సి.డి లు,డి.వి.డీలు....అనేకం ఇవాళ్టిరొజున. ఇప్పుడు వద్దంటే సినిమా...!!
."ఏదో ఒకటి చూసాం అని కాకుండా,ఆ సినిమా చూడటం వల్ల ఏదన్నా ప్రయోజనం ఉందా?అని ప్రశ్నించుకుని ఏ సినిమా అన్నా చూడాలి " అంటారు నాన్న.ఇప్పుడు మాకు మేమై సినిమాలు చూస్తున్నా నాన్న చెప్పిన సుత్రాన్ని ఎన్నడూ మరవలేదు మేము.

19 comments:

కంది శంకరయ్య said...

తృష్ణ గారూ,
మీరిచ్చిన లింక్ ద్వారా గుప్పెడు మనసు చిత్రంలోని నాకెంతో ఇష్టమైన "మౌనమె నీ భాష ఓ మూగ మనసా" పాటను యూట్యూబ్ లో విని ఆనందించాను. ఈ పాటకోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే మీరు పరిచయం చేసిన ఔట్ సోర్స్డు, ఫ్లేవర్స్ చిత్రాలను కూడా చూడాలనే ఆసక్తి కలిగింది. టోరెంట్స్ లో దొరుకుతాయో చూడాలి.

కంది శంకరయ్య said...

తృష్ణ గారూ,
మీరిచ్చిన లింక్ ద్వారా గుప్పెడు మనసు చిత్రంలోని నాకెంతో ఇష్టమైన "మౌనమె నీ భాష ఓ మూగ మనసా" పాటను యూట్యూబ్ లో విని ఆనందించాను. ఈ పాటకోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే మీరు పరిచయం చేసిన ఔట్ సోర్స్డు, ఫ్లేవర్స్ చిత్రాలను కూడా చూడాలనే ఆసక్తి కలిగింది. టోరెంట్స్ లో దొరుకుతాయో చూడాలి.

తృష్ణ said...
This comment has been removed by the author.
తృష్ణ said...

శంకరయ్యగారూ,Flavours తప్పక చూడండి బాగుంటుంది.బ్లాగుకి విచ్చేసినందుకు ధన్యవాదాలు.

Sujata M said...

OUTSOURSE is a good film though.

తృష్ణ said...

sujAta gAru,aakharu sagamE chUsa kadaMDI...cinimA mottam chUstE impression marOla unTundi.ekkaDanna dorikitE mottam chUdAli.

మురళి said...

బాగుందండి మీ అభిరుచి.. 'మౌనమే నీ భాష..' తరచూ వింటాను నేను..

తృష్ణ said...

ధన్యవాదాలు మురళిగారు.పాటల మీద రాసిన ఏ టపాకీ మీరు వ్యాఖ్య రాయకపోతే మీకు పాటలంటే ఆసక్తి లేదేమో అనుకున్నాను.

వెన్నెల రాజ్యం లో క్రీడావార్తలు బాగున్నాయండి.ఇదే చూడటం.సినిమా మిరూ నిన్ననే చుసారా?అదివరకెప్పుడోనా?

MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

chala bagundi andi meeru cheppina vidanamu alage na blog kuda vachhi na posting chusi coments ivvandi mariyu mee suchanalanu ivvandi untanu andi
http://mirchyvarma.blogspot.com

కొత్త పాళీ said...

మీరూ బెజవాడేనా? మాదీ బెజవాడే! :)
విజయాటాకీసులో పాత సినిమాలు మాత్రమే ఆడుతాయి అన్నారంటే మీరు 80లలో పెరిగిన వాళ్ళై ఉంటారు :) నా చిన్నతనంలో విజయాలో మొదటి రిలీజ్ సినిమాలే ఆడేవి. 75 ప్రాంతాల్లో కొత్తవంతెన దగ్గర కనకదుర్గా టాకీసు కట్టాక, విజయకి పోటీ ఎక్కువై, హడావుడీగా బోలెడు రెనొవేషన్స్ అన్నీ చేశారు. దురదృష్ట వశాత్తూ కనకదుర్గా ఏవో లీగల్ గొడవల్లో పడి దిగజారి పోయింది. అటుపైన విజయా కూడా ..

మీకు సినిమా గురించి మంచి అభిరుచి ఉన్నట్టుంది. సంతోషం! నవతరంగం చూశారా?

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

తృష్ణగారు, మీరొక చిన్నరాయబారం నడపాలి. నెమలికన్ను నాపై అలిగింది. కారణాలు తెలియట్లేదు. గోపి గోపిక గోదావరి టపా నొక్కితే నన్ను వాకిట్లోనే నిలబెట్టింది గూగులమ్మ. నాకు వీసా దొరకలెదు. ఈ విషయం కొంచెం చెప్పండి. ఎంత త్వరగా చెస్తే అంత మంచిది.ఎవోసెట్టింగులు మారనట్టున్నాయి. కొంచెంచెప్పి మార్పించండి.

కొత్త పాళీ said...

మీరు మొదట్లో వేసిన రంగుల బొమ్మలు ఇప్పుడే చూశాను. చాలా బాగున్నాయి. మీరు సకల కళావల్లవి అన్నమాట. :)
రెండు ప్రశ్నలు:
1. ఆ జాడీల మీద గులాప్పూలు 3Dలో ఉన్నాయి, అవి అలాగే దొరుకుతాయా? ఇటువంటి జాడీలు ఎక్కడ దొరుకుతాయి? అవి మొదట కొన్నప్పుడు ఏ రంగులో ఉన్నాయి?
2. గాజు మీద పెయింట్ చెయ్యడానికి ఎటువంటి పెయింట్లు ఉపయోగించారు?

తృష్ణ said...

కొత్తపాళిగారు,మీకు నేను ఒక పెద్ద ఉత్తరమే రాయాలి.నెల క్రితం నేను బ్లాగు మొదలెట్టినప్పుడు అన్ని బ్లాగులూ పరిశీలిస్తున్నప్పుడు మీ బ్లాగులొ విజయవాడ ఫొటొలు చూసి ఎగిరి గంతేసి దానికి వ్యాఖ్య రాసాను.ప్రచురించారు కానీ నా బ్లాగువైపు కన్ను వెయ్యలేదు..ఇన్నాళ్ళకి మీ దయ కలిగింది.ఇంతకుముందు రెండు టపాల్లో బెజవాడ గురించి రాసాను మీరు చూసి ఉండరు."కొత్త వంతెన" "కనక దుర్గ టాకీసు" అబ్బ అబ్బ..నా మనసు విజయవాడ పొలిమేరల్దాకా వెళ్ళిపోయింది...thanks for your visit.
ఆ కుండ plain గా దొరికినదే మామూలు మంచినిళ్ళ కుండ లాగ పెంకు రంగులో..దాని మీద 3D లాగ ఉన్న గులాబీలు నేను స్వయంగా తయారు చేసినవి.chalk powder లో ఫెవికల్ కలిపి!!
గ్లాస్ పైంటింగ్స్ కి గ్లాస్ కలర్స్ అమ్ముతారు.అవి కొని వాడటమే.గ్లాస్ మీద లైనింగుకి నల్ల రంగు త్యుబ్ ఒకటి దొరుకుతుంది.దానితో లైనింగు వేసి,తరువాత కలర్స్ వేసుకోవటమే.thats the thing sir.

తృష్ణ said...

మిర్చివర్మగారు,నాకు ఒకరికి సలహా చెప్పేంత 'సీన్ ' లేదనుకుంట.ఇక్కడ చాలా మంది గొప్ప గొప్ప బ్లాగర్లు ఉన్నారండీ.మీ బ్లాగు తప్పక చూస్తాను.ధన్యవాదాలు.

చైతన్యా,నేను కూడా మీలాగ ఒక బ్లాగర్నే కదా.నేను పావురాన్ని కాదు రాయబారం పంపటనికి.(just kidding)నెమలికన్ను గారి కొత్త టపా చూడలేదు నేనింకా.నన్ను కూడ బయటనిలబెడతారో ఏమో చూడలి..

సృజన said...

నేను చూసాను...పోయిన నెలలో కూడా వేసారండి, కలవర పడకండి మళ్ళీ వేస్తారు.
But "Outsource"is an good movie.

కొత్త పాళీ said...

మీరు ఫొటోబ్లాగులో వ్యాఖ్య అంటే వెనక్కెళ్ళి చూశాను. ఎప్పుడో నవంబర్లో వేసిన పోస్టుకి మీరు జూన్నెల్లో వ్యాఖ్య రాయడంతో గమనించలేదు.
నేనీ మాటలు ఇలా పబ్లిగ్గా అంటే మన బ్లాగర్లలో బెజవాడ వాళ్ళంతా నాతో దెబ్బలాడేందు కొస్తారు. ఒకప్పుడు అమ్మ ఊరు, ఇప్పుడు అత్తారి ఊరు అని తప్ప, బెజవాడంటే నాకేమీ అనుబంధం లేదు, ప్చ్! నవోదయ బుక్షాపూ, కనకదుర్గమ్మ గుడీ .. అంతే నేను పనిగట్టుకుని వెళ్ళి చూసేవి.

తృష్ణ said...

thanks srujanagAru.

కొత్తపాళిగారు,నేనక్కడ పుట్టకపోయినా 28ఏళ్ళు ఉండి,తిరిగిన ఊరు...ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన ఆ ఊరంటే నాకెంతో ఇష్టం.

Kalpana Rentala said...

తృష్ణ,

మీ బ్లాగ్ నాకు బాగా నచ్చింది. సింపులు గా సూటిగా వుంది. మాది విజయవాడే కాబట్టి మీరు చెప్పిన విషయాలతో నాలో ఎన్నో పాత జ్ఞపకాలు. ఆ విజయ టాకీస్ చుట్టు ఎన్ని కబుర్లో.

అభ్యంతరం లేకపోతే మీ నాన్నగారి పేరు చెప్తారా? మీరు నాకు తెలిసి వుండొచ్చేమొనన్న ఒక చిన్ని ఆశ, అంతే.

మీ బ్లాగ్ కి పైన పెట్టిన note బావుంది.

కల్పన రెంటాల

kalpanarentala.wordpress.com

తృష్ణ said...

కల్పనగారు, మీ ఇంటి పేరుని బట్టి మీ నాన్నగారు,మీ బ్రదర్ కూడా నాకు తెలుసనుకుంటున్నాను.మా నాన్నగారి పేరు నేను బ్లాగులో చెప్పదలుచుకోలేదండి.కానీ మీకు తప్పక తెలిసి ఉండొచ్చు.మీకు నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు.