సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, July 7, 2009

మొక్కజొన్న పొత్తులు

మొక్కజొన్న పొత్తులు...ఓహ్..irresistable !!
వర్షాలు ఇంకా కురవట్లేదు కానీ మొక్కజొన్నపొత్తులు వచ్చేసాయి.
చిటపటచినుకులు పడుతూంటే,రోడ్డు చివర చెట్టు క్రింద బొగ్గులపై కాల్చిన లేత మొక్కజొన్న పొత్తులు... తినను అనేవారు ఉంటారా?(పళ్ళలో ఇరుక్కుంటాయి అని తిననివారుంటారేమో చెప్పలేం.)
నాకు మాత్రం ఇంట్లో గాస్ స్టౌ మీద కాల్చుకున్న వాటికన్నా బయట బొగ్గులపై కాలిన మొక్కజొన్నల రుచే ఇష్టం.మా ఇంట్లో (గాస్ స్టౌ కాకుండా)చిన్నప్పుడు రెండు చిన్న ఇనప కుంపటులు ఉండేవి.మా అమ్మ వాటిమీద ఉల్లిపాయలు,మొక్కజొన్నలు కాల్చి పెడుతూ ఉండేది.వాటి రుచే వేరు.మొక్కజొన్నలని ఉడకపెట్టి కూడా కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు.తిరుపతి కొండ మెట్లదారిలో వెళ్ళేప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి అవి.మొక్కజొన్నలతో తయారు చేసే వంటల్లోకి వెళ్తే వాటితో --వడలు,సూప్ లు,రకరకాల కూరలూ వండుకోవచ్చు.మొక్కజొన్నల్లో రకాల్లోకి, వెళితే--'బేబీ కర్న్ ' అయితే పచ్చివే తినేయచ్చు.చపాతీల్లోకి బేబీకార్న్ మసాల,బేబికార్న్ చాట్ మొదలైనవి వండుకుంటే భలే ఉంటుంది.అప్పుడప్పుడు మాత్రమే దొరికే "స్వీట్ కార్న్" తొ కూడ చాలా రకాల సూప్ లు,కర్రీలు,కట్లెట్ లు చెసుకోవచ్చు.మేము బొంబాయిలో ఉండేప్పుడు ప్రతి లోకల్ ట్రయిన్ స్టేషన్ ప్రవేశద్వారం దగ్గరా అన్నికాలాల్లోను "స్వీట్ కార్న్" దొరికేది.డెలివరీకి అమ్మావాళ్ళింట్లో ఉన్నప్పుడు బొంబాయి నుంచి మావారి ద్వారా కొరియర్లో "స్వీట్ కార్న్" తెప్పించుకుని మరీ తిన్నాను!!
మొన్న శనివారం నేను,మా పాప బస్సు దిగగానే ఎదురుగుండా కనిపించిన మొక్కజొన్నల బండి మీదకి దృష్టి పోయింది.అన్ని కండెలూ అయిపోయి ఇంక 5,6మాత్రమే మిగిలాయి ఆ బండి మీద.పరుగునవెళ్ళి ఒక లేతది కాల్చి ఇవ్వవయ్యా అని అడిగాను.మాడ్చకుండా కాల్పించుకుని ,చాలా లేతగా ఉన్న ఆ మొక్కజొన్నని తినడానికి నేను,పాప ఇద్దరం పోటీ పడిపోయాం...రోడ్డు మీద వింతగా చూసే జనాల్ని కూడా పట్టించుకోకుండా !!

14 comments:

madhu said...

మంచి పౌష్టికాహారం కూడానూ ! మొక్క జొన్నల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే !

మొక్క జొన్నలతో చేసే గారెలంటే పడి చస్తాను నేను ! :-) ఉత్తినే పచ్చివి తిన్నా, పసందుగా ఉంటాయి !

మంచి టపా తృష్ణ గారు ! ఎన్నో జ్ఞాపకాల్ని తట్టి లేపారు !

Padmarpita said...

ఫొటో చూసే నోరూరుతుంటే...
మీరు ఇలా తిన్నాను అలా తిన్నాను అని మరీ మరీ ఊరించేసారండీ మీ ఈ టపాతో...బాగుంది!

తృష్ణ said...

anonymous gAru,padmArpita gAru,dhanyavAdAlu.

Anonymous said...

అర్జెంటుగా ఏ నెక్లెస్ రోడ్డుకో వెళ్లి తినాలనిపిస్తోంది. నాలాంటి ఫూడీలని ఇలా ఊరించడం పెద్ద బాలేదు. మీ ప్రొఫైలు నాకు బాగా నచ్చింది.

మురళి said...

అప్పుడే కాల్చిన లేత మొక్కజొన్న కండె మీద ఉప్పులో ముంచిన నిమ్మ చెక్క రాసి రుచి చూడండి.. మళ్ళీ వదలరింక... బాగుంది టపా..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నేన్ ఇంటర్లో ఉండేటప్పుడు ఒకడు ఇష్టంలేదు అన్నాడు. ఒక పదినిముషాల తరువాత తినను అన్న ఒక్కపదానికి ఇంతసుత్తెందుకు అని నాబాధ భరించలేక ఒకసారి రుచిచూసాడు. అంతే వాడు కవికాదు కాబట్టీ సరిపోయింది కానీండి లేకుంటే దానిపై ఆటవెలదో, తేటగీతో రాసేవాడు. అప్పటినుంచి వాడికి మొక్కజొన్నను ఎక్కడచూసినా నేనే గుర్తొస్తాను.

తృష్ణ said...

అరుణగారు,నా బ్లాగుపై మీ అరుణకిరణాలని ప్రసరించినందుకు ధన్యవాదాలు.మీ నిన్నటి టపా నేను చదవలేకపోయాను.ఆ న్యుస్ పేపర్ ఆర్టికల్ ఓపెన్ కాలేదు ఎంచేతనో.

మురళిగారు,నేను మొన్న శనివారం తిన్నది అలా వుప్పు+నిమ్మచెక్క రాసిన మొక్కజొన్ననే:):)
చైతన్యా,బాగుంది.మరో మొక్కజొన్నాభిమానిని తయారు చేసినందుకు అభినందనలు!!

శ్రీనివాస్ పప్పు said...

తృష్ణ గారు,

పొత్తులంటే మీరు చెపినట్టు ఎక్కడయినా దొరుకుతాయి.మురళీ చెప్పినట్టు తింటేనే సూపర్ కొంచం కొంచం పెదాలు మండుతూ భలేగా ఉంటుందిలెండి(ఆ తర్వాత వేడిగా కాఫీ తాగితే ఇంకా మజా).వైజాగ్ బీచ్ దగ్గర తింటూ అలా సముద్రాన్ని ఆ కెరటాల్ని చూస్తూ అలా ఆ రుచిని ఆస్వాదిస్తుంటే అదో అనుభవం.
కానీ తూ.గో.జీ లో కాట్రావులపల్లి(జగ్గంపేట నంచి పెద్దాపురం- కాకినాడ వెళ్ళే రూట్‌లో)లో దొరికే పొత్తులు తిని తీరాల్సిందే మరి.ఈ సారి ప్రయత్నించండి...

తృష్ణ said...

srinivasgAru,dhanyavAdAlu.mIru cheppina prAntAllO kUDa eppuDainA vELtE prayatnistAnu.

కొత్త పాళీ said...

మొన్న పాప్డీ, ఇవ్వాళ్ళ జొన్నకండెలు .. ఎల్లుండి ఇంకేమి దర్శనమిస్తుందో?
You are bad ! :(

పైనెవరో మొక్కజొన్న ఆరోగ్యానికి మంచిదని సెలవిచ్చారు. అలాంటిదేవీ లేదు. ఇది కూడా మిగతా అన్ని గింజల్లాంటిదే. జొన్న లాబీ వాళ్ళ మార్కెటింగ్ అది.

తృష్ణ said...

కొత్తపాళీ గారు,ఎల్లుండి మీరు ఏది రాయమంటే అది.("పిడతకింద పప్పు" గురించి రాయనాండీ?):))
ఇక్కడ కార్న్ గురించి నాకు తెలిసిన కొన్ని సంగతులు:
(nutritious facts):

1)కార్న్ వల్ల ప్రత్యేకమైన ఆరోగ్యలాభాలు ఏమీ లేకపోయినా అది శరిర మెటబాలిజానికి ఒక రొజుకి సరిపడా కేలరిలు అందించగలదు.
2) శాట్యురేటెడ్ ఫాట్,ఖొలెస్టెరాల్ లెవెల్స్ చాలా తక్కువ.
3)ఎల్లొ కార్న్ లో dietary ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల digestion కి మంచిది.
4)విటమిన్ B,B6 మరియు కొద్దిగా విటమిన్ A,E కూడా కలవు.
5) కార్న్ లో phosphorus, magnesium, manganese, zinc, copper, iron and selenium మొదలైనవి ఎక్కువగా ఉన్నాయి.కొద్దిపాటి potassium కూడా కలదు.
6)చర్మ రక్షణ కు,నరాలను ఉత్తేజ పరిచేందుకు కూడా కార్న్ సహాయపడుతుంది.
ఆవు వ్యాసం లాగ ఇదొక మొక్కజొన్న వ్యాసం అయిపోయిందేమో:)

madhu said...

జొన్న లాబీ ! :-))

మొక్కజొన్న పోషక విలువల గురించి బాగా చెప్పారు తృష్ణ గారు !

Bhãskar Rãmarãju said...

మధుమేహ వ్యాధిగ్రస్తులు మొక్కజొన్న *ఎక్కువ* తింటం మంచిది కాదు.
ఉప్పు నిమ్మచెక్క అనేది మా ఊళ్ళవైపు స్టైల్ కాదు. అలా తినొచ్చు అని నేను హైద్ లో చూసా మొట్టమొదట.

కొంచెం ముదురు కండెని కాల్చి, ఒక్కో ఇత్తుని ఆశ్వాదిస్తూ తింటుంటే ఆ మజానే వేరు.

తృష్ణ said...

రామరాజుగారు,ఆ సంగతి తెలుసునండీ.రాయలేదు..ధన్యవాదాలు.